Telugu News

చరిత్రలో నిలిచిపోయేలా టియుడబ్ల్యూజే రాష్ట్ర మహాసభలు

నివాస స్థలాలు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే యూనియన్ లక్ష్యం

0

చరిత్రలో నిలిచిపోయేలా టియుడబ్ల్యూజే రాష్ట్ర మహాసభలు

== నివాస స్థలాలు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే యూనియన్ లక్ష్యం

== జిల్లా కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరహత్ అలీ

(ఖమ్మం-విజయం న్యూస్):

టియుడబ్ల్యూజె (ఐజెయు) రాష్ట్ర మూడవ మహాసభలు జూన్ మాసంలో ఖమ్మంలో జరగనున్నాయని ఈ మహాసభలు చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోవాలని టియుడబ్ల్యూజె (ఐజెయు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరహత్ అలీ తెలిపారు. మహాసభలలో

-నివాస స్థలాలు, అక్రిడేషన్లు, హెల్త్ కార్డుల సమస్యలపై చర్చించడం జరుగుతుందన్నారు. టియుడబ్ల్యూజె (ఐజెయు) జిల్లా కార్యవర్గ సమావేశం ఆదివారం జిల్లా అధ్యక్షులు వనం వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన విరహత్ అలీ

-మాట్లాడుతూ మీడియా రంగంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని ఒక పక్క యాజమాన్యాల వైఖరి, మరో పక్క జర్నలిస్టులు

ప్రత్యేకించి సోషల్ మీడియాలో వచ్చిన మార్పులు చర్చనీయాంశమవుతున్నాయన్నారు. నిస్వార్థంగా సమాజ సేవకు అంకితమై జర్నలిజం

వృత్తిలో నిబద్ధతతో కొనసాగుతున్న వారు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అనేక దశాబ్దాలుగా పని చేస్తున్న వారికి సైతం నివాస –

-స్థలాలు దక్కలేదని ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల నివాస స్థలాల పంపిణీ గురించి ఒక ప్రణాళిక తయారు చేస్తుందని విరహత్ అలీ

-టియుడబ్ల్యూజె (ఐజెయు) కృషి చేస్తుందన్నారు. గత 10 ఏళ్లుగా జర్నలిస్టుల హెల్త్ కార్డులు సరైన రీతిలో అమలు కాలేదని వందలాది మంది జర్నలిస్టులు సరైన వైద్యం అందక మృత్యువాడ పడ్డారని విరహత్ అలీ తెలిపారు. హెల్త్ కార్డులు అన్ని ఆసుపత్రుల్లో చెల్లుబాటు అయ్యే విధంగా కార్డు ద్వారా క్యాష్ లెస్ వైద్యం అందేవిధంగా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లెక్కలు పక్కన పెట్టి వృత్తిలో

-తెలిపారు. మీడియా అకాడమీ అధ్యక్షులు శ్రీనివాస్ డ్డి నేతృత్వంలో అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టుకు నివాస స్థలం అందేవిధంగా కొనసాగుతున్న వారికి హెల్త్ కార్డులు అందించాలని ఐజెయు డిమాండ్ చేస్తుందన్నారు. దశాబ్దాల చరిత్ర కలిగిన యూనియర్ రాష్ట్ర మూడవ -మహాసభలు జూన్ మాసంలో ఖమ్మంలో జరగనున్నాయని మహాసభలకు అతిథ్యమిచ్చేందుకు ముందుకు వచ్చిన ఖమ్మంజిల్లా కమిటీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ చరిత్రలో నిలిచిపోయేవిధంగా మహాసభలను నిర్వహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా సౌహార్థ ప్రతినిధులు హాజరు కానున్నారని ఆయన తెలిపారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు కె. రాంనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ ఖమ్మంజిల్లాకు మహాసభల నిర్వహణ బాధ్యతను అప్పగించడం పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు. ఎటువంటి లోటు పాట్లకు తావివ్వకుండా మహాసభలను నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో జాతీయ సమితి సభ్యులు అమరవాది రవీంద్ర శేషు, రాష్ట్ర -సమితి సభ్యులు మాటేటి వేణుగోపాల్, సామినేని మురారి, ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర కన్వీనింగ్ కమిటీ సభ్యులు నలజాల వెంకట్రావు, ఎస్ ఖదీర్, రాష్ట్ర బాధ్యులు ఖాదర్బాబా, రమణారెడ్డి, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆవుల శ్రీనివాస్, కనకం సైదులు, వీడియో జర్నలిస్టు అసోసియేషన్ నాయకులు ఆలస్యం అప్పారావు, నగర అధ్యక్ష, కార్యదర్శులు మైసా పాపారావు, చెరుకుపల్లి శ్రీనివాస్, జిల్లా కోశాధికారి నాగండ్ల శివానంద, యూనియన్ బాధ్యులు నలజాల వెంకట్రావు, రత్నం, జిల్లా ఉపాధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, వివిధ పత్రికల, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు హాజరయ్యారు.