Telugu News

 టి.యూ.డబ్ల్యూజే (టి.జే.ఎఫ్) సభ్యత్వం తీసుకొండి.. భరోసాగా ఉండండి

సభ్యత్వం తీసుకున్న పాలేరు నియోజకవర్గం జర్నలిస్టులు 

0
 టి.యూ.డబ్ల్యూజే (టి.జే.ఎఫ్) సభ్యత్వం తీసుకొండి.. భరోసాగా ఉండండి
== అల్లం నారాయణ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు భరోసా*
== జర్నలిస్టుల పక్షపాతి  ఆకుతోట ఆదినారాయణ
== సభ్యత్వం తీసుకున్న పాలేరు నియోజకవర్గం జర్నలిస్టులు 
కూసుమంచి,నవంబర్ 5(విజయం న్యూస్): 
తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ఆధ్వర్యంలోనే జర్నలిస్టులకు భరోసా ఉందని టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ అన్నారు . జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఏర్పడిన టి.యూ.డబ్ల్యూజే (టి.జే.ఎఫ్) ఎప్పటికీ జర్నలిస్టుల పక్షపాతేనని అన్నారు. శనివారం కూసుమంచి లోని ఎస్.ఆర్. ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పాలేరు  డివిజన్ స్థాయి సభ్యత్వ నమోదు, కార్యవర్గ సమావేశం లో ఆయన మాట్లాడుతూ తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ గా అల్లం నారాయణ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి జర్నలిస్టుల సంక్షేమం కోసం పని చేస్తున్నారని చెప్పారు. కరోనా విపత్తు సమయంలో వేల మంది బాధిత జర్నలిస్టులకు రూ. 20 వేల ఆర్థిక సహాయం అందించిన ఘనత తమ సంఘానికే దక్కిందన్నారు.
జర్నలిస్టులకు ఎప్పుడు ఏ విధమైన సమస్య ఎదురైనా పరిష్కారం దిశగా పోరాడే పటిమ గల నాయకత్వం జిల్లా కమిటీ లో ఉందన్నారు. కొత్త అక్రిడేషన్ కార్డుల జారీలో జరిగిన జాప్యం పై పోరాడుతున్నామని, చిన్న పత్రికలకు అక్రిడేషన్ కార్డుల కోసం ఐ అండ్ పీఆర్ ఆఫీస్ ముందు ధర్నా చేసిన విషయాన్ని గుర్తు చేశారు. తమ సంఘం పేరు చెబితేనే కొన్ని సంఘాల నాయకులు భయపడుతూ ఉలిక్కిపడుతున్నారని, జర్నలిస్టు సంఘాల పేరుతో వసూళ్లు చేయడం, విహారయాత్రలు చేయడం పరిపాటిగా మారిందన్నారు. సంఘాల పేరుతో చందాలు వసూలు చేసి పబ్బం కడుపుకోవడం కొందరికి ఆనవాయితీగా మారిందని విమర్శించారు. అటువంటి వ్యక్తుల వల్ల జర్నలిస్టు సమాజానికి కలంకం వాటిల్లుతుందన్నారు. ఈ సందర్భంగా పలు సంఘాలకు చెందిన కొందరు నాయకులు  సభ్యత్వం తీసుకున్నారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాలకు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ లు పెద్ద సంఖ్యలో హాజరవడం హర్షించదగ్గ విషయమని, సంఘం పటిష్టతకు ఇదే నిదర్శనం అన్నారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులకు సభ్యత్వం అందజేశారు.
ఈ కార్యక్రమంలో  జిల్లా నాయకులు విజేత, ప్రశాంత్ రెడ్డి, చిర్రా రవి,శెట్టి రజినికాంత్, రంజిత్, ఏ ఉపేందర్, సంతోష్,కర్ణ, సుందర్,పసలాది సత్యనారాయణ, హనుమంత్ రెడ్డి,నరసింహారావు,వేణు,రాము,టి హనుమంతరావు, లక్ష్మణ్, సకినవీటి అరుణ్ కుమార్,అచ్యుతరామారావు,శ్రీనివాస్ రెడ్డి,మామిడి ప్రవీణ్,యం మోహన్,సునీల్ లతో పాటుగా పలు మండలాల విలేఖర్లు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.