Telugu News

మోటాపురం వద్ద రెండు కార్లు ఢీ.. ఐదుగురికి గాయాలు

నేలకొండపల్లి-విజయంన్యూస్

0

మోటాపురం వద్ద రెండు కార్లు ఢీ.. ఐదుగురికి గాయాలు
(నేలకొండపల్లి-విజయంన్యూస్);-

రెండుకార్లు ఎదురేదుగా వచ్చి బలంగా ఢికొట్టుకున్నాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన నేలకొండపల్లి మండలం మోటాపురంలో శనివారం చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే ఖమ్మం నుంచి కూసుమంచి మండలం మీదగా నేలకొండపల్లి మండలానికి కారులో ప్రయాణిస్తున్న ఉపాధ్యాయులకు సంబంధించిన కారు,మరో కారు ఢీకొట్టుకున్నాయి. రాజేశ్వరపురం పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు కారులో ప్రయాణిస్తున్నారు. వారికి గాయాలుకావడంతో 108వాహనం ద్వారా ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ సంఘటన సమాచారం అందుకున్న నేలకొండపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.