Telugu News

ఖమ్మం లో ఇద్దరు సైబర్ నేరగాళ్ళు అరెస్ట్

వెల్లడించిన ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్

0

ఖమ్మం లో ఇద్దరు సైబర్ నేరగాళ్ళు అరెస్ట్

== వెల్లడించిన ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్

(ఖమ్మం క్రైం -విజయం న్యూస్)

ఖమ్మం లోసైబర్ క్రైమ్ పోలీసులు ఇద్దరు సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు  పోలీస్ కమిషనర్ తెలిపారు.

నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకొని మోసాలు చేస్తున్న ఇద్దరు సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు.

నల్గొండ జిల్లాకు చెందిన
పారేపల్లి సాయి కృష్ణ @ సాయి 26 సం,, అతని సహచరుడు పెట్రోల్ బంక్‌లో ఉద్యోగి అయిన రావులపాటి శివ, 21 సం, ఇద్దరు నిందుతులు హైదరాబాద్‌లోని ఎల్‌బీ నగర్‌లో నివాసం వుంటూ..

ఇది కూడా చదవండి:- ఖమ్మం లో బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి నామినేషన్..ఎవరంటే..?*
వెబ్‌సైట్‌లో వివిధ ఇంజినీరింగ్ కాలేజీల హెచ్‌ఓడీల సంబంధించిన ఫోన్ నెంబర్లు సేకరించి HOD లకు ఫోన్ చేసి తమ పాత విద్యార్థిగా, IBM కంపెనీలో ఉద్యోగం చేసినట్లుగా
పరిచయం చేసుకుని కాలేజ్ విద్యార్థులకు పలు మల్టీనేషన్ కంపెనీలలో బ్యాక్ డోర్ ఉద్యోగ అవకాశం కల్పిస్తాని నమ్మించారు. కాలేజ్ హెచ్ వో డి లు సైతం వారి మాయలో పడి ఐటి కంపెనీలో ప్లెస్ మంట్ కోసం ఈ ఫోన్ నెంబర్లకు సంప్రదించాలని సైబర్ నేరగాళ్ల ఇచ్చిన ఫోన్ నెంబరును అయా కాలేజ్ వాట్సప్ గ్రూపులో పోస్ట్ చేశారు. నిరుద్యోగ యువత/విద్యార్థులు కాలేజ్ హెచ్ వో డి లు ఇచ్చిన నెంబర్ కావడంతో నిర్భయంగా ఫోన్ నెంబర్ కు కాల్ చేశారు. విద్యార్థులకు ఉద్యోగం ఆశ చూపి వల వేసిన సైబర్ నేరగాళ్లు ముందుగా 35 వేలు చేల్లించాలని, కంపెనీ జీతం వచ్చిన తరువాత మరో 35 చెల్లించాలని నమ్మించి మోసం చేయడం మొదలుపెట్టారు. ఖమ్మం కు చెందిన ఇద్దరు యువతల నుండి 70 రూపాయలు UPI పే ద్వారా చెల్లించారు. తదుపరి రోజు ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో మోస పోయినట్లు గుర్తించిన బాధితులు మార్చి 27 న చేసిన ఫిర్యాదుతో క్రైమ్ నెంబరు 04/2024 U/S. 420 IPC & సెక్షన్. 66(డి)ఐటీ చట్టం ప్రకారం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. విచారణ చేపట్టిన సైబర్ క్రైమ్ పోలీసులకు ఖమ్మంతో పాటు కరీంనగర్, నల్గొండ, హైదరాబాదు, జగిత్యాల, గుంటూరు, రాజమండ్రి జిల్లాలో సుమారు 50 మంది బాధితులు వున్నట్లు గుర్తించామని తెలిపారు.

ఇది కూడా చదవండి:- ఖమ్మం రేసులో RRR..?

IPLలో బెట్టింగ్‌కు, జాల్సలకు అలవాటు పడిన నిందుతులను చాకచక్యంగా ఖమ్మం కొత్త బస్‌స్టాండులో ఏప్రియల్ 18 న అదుపులోకి తీసుకొని ఏప్రియల్ 19న రిమాండ్ కు తరలించామని తెలిపారు. ఈ తరహ సైబర్ మోసాగాళ్లు ఎక్కడ కనిపించారని, చేసే ఫోన్ నెంబరుతో బ్యాంక్ అకౌంట్లు, ఫోన్ పే, గూగుల్ పే,UPI అకౌంట్లు వుండవని తెలిపారు. సమయానుకూలంగా వ్యాపారుల దగ్గరకు వెళ్లి
పలు వ్యాపారాలు చేస్తున్నట్లు నమ్మించి ఫోన్ లో నెట్‌వర్క్ సమస్య వుందని, ఫ్రెండ్స్ UPI ద్వారా డబ్బులు మీ అకౌంట్ పంపిస్తారని, మీదగ్గర నుండి క్యాష్ ఇవ్వగలరని నమ్మించి నగదు తీసుకొని వెళ్తుంటాడని తెలిపారు. నిందితుల నుంచి మూడు సెల్​ఫోన్లను, లక్ష పది వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. ఇలాంటి సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచించారు.

సైబర్ క్రైమ్ మొదటి కేసు సమర్థవంతంగా చేధించిన సైబర్ క్రైమ్ ఏసీపీ ఫణింద్ర,సిఐ శివ కుమార్, ఎస్సైలు రంజిత్, విజయకుమార్ ను పోలీస్ కమిషనర్ అభినందించారు.

పి ఆర్ వో