Telugu News

‘పాలేరు’ రేసులో మరో ఇద్దరు..?

అనూహ్యంగా తెరపైకి వచ్చిన పేర్లు

0

‘పాలేరు’ రేసులో మరో ఇద్దరు..?

== అనూహ్యంగా తెరపైకి వచ్చిన పేర్లు

== ట్విస్ట్ ఇవ్వనున్న ఆ నేత

== ఇప్పటికే కసరత్తు..

== పాలేరులో ఏం జరుగుతోంది..?

(పెండ్ర అంజయ్య, కూసుమంచి-విజయంన్యూస్)

అందరి చూపు పాలేరు వైపే.. ఎవరు ఊహించని పేర్లు.. ఎవరు గ్రహించని వారు తెరపైకి వస్తున్నారు.. పాలేరు నుంచి పోటీకి మేము సైతం అంటూ కాలుదువ్వుతున్నారు.. ఇప్పటికే రేసులో ఉన్న వారికంటే గత కొద్ది సంవత్సరాలుగా సడిసప్పిడి లేని నాయకుల పేర్లు తెరమీదకు వస్తున్నాయి.. ఉన్నట్లుండి ఆ పేర్లు తెరమీదకు వస్తుండటంతో తెలంగాణలోనే పాలేరు నియోజకవర్గం హాట్ పేవరేట్ మారింది.. దీంతో పాలేరు నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు రోజురోజుకు మలుపుతిరుగుతున్నాయనే చెప్పాలి… ఎవరు ఊహించని ట్విస్ట్ లు పాలేరుకు స్వంతమవుతున్నాయి..  గత ఆరు నెలల క్రితం ఎవరు ఊహించని విధంగా షర్మిళ  పాలేరు ప్రజలందరికి షాక్ ఇస్తే.. ఇంకోందరు నాయకులు షాకులమీద షాకులిస్తున్నారు..

ఇది కూడా చదవండి: ‘అమాత్యుల’ వ్యాఖ్యలు ఎవరికి గుణపాలు..?

‘నేను సైతం అంటూ’ పాలేరులో పోటీకి సై అంటూ ట్విస్ట్ ఇస్తుండటం గమనర్హం.. ఇక ఎవరు ఊహించని విధంగా మరో నేత పేరు తెరపైకి రాగా, మరో మహిళ నేత పేరు కూడా తె పైకి వచ్చింది.. రాష్ట్ర రాజకీయాల్లోనే సంచలన నాయకుడిగా పేరుగాంచిన ఓ నేత ఆ ఇద్దరికి భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది.. అందులో భాగంగానే సంక్రాంతి తరువాత సంచలన ప్రకటనలు ఉండే అవకాశం కనిపిస్తోంది.. పాలేరుకు సై అంటున్న ఆ ఇద్దరు ఇప్పటికే తెరవెనక ఏర్పాట్లలో నిమగ్నమైనట్లు.. వాళ్ల అభిమానులు, కలిసి పనిచేసిన వారితో చర్చలు జరుపుతున్నట్లుగా కనిపిస్తోంది..

తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత కీలక నియోజకవర్గం ‘పాలేరు నియోజకవర్గం’. ప్రస్తుత పరిస్థితిల్లో సంచలనాలకు నిలయంగా మారింది. రాష్ట్రంలో ఉన్న కీలక నేతలందరి పాలేరు వైపు చూస్తుండటంతో ఆ నియోజకవర్గం చాలా హాట్ గురూ అన్నట్లుగా మారింది.. అధికార పార్టీ నుంచి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు టిక్కెట్ వచ్చిన రాకపోయిన పాలేరు నుంచి పోటీ చేస్తానని ప్రకటించి ఆయన ప్రచారంలో నిమగ్నమైయ్యారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి ఇప్పటికే టిక్కెట్ నాదే అంటూ ప్రచారం చేసుకుంటున్నారు.. కాగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా పాలేరు వైపు కన్నేశారు.. ఆయన పరిస్థితి అటుఇటుగా ఉంటే పాలేరులో పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు.. ఇదంతా ఒక ఎత్తు అయితే వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిళ పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ప్రకటించడం గమనర్హం. ఆమె ప్రకటన ఎవరు ఊహించలేదు.

ఇదికూడా చదవండి: ఫ్లాన్-బీ దిశగా పొంగులేటి

ఇక బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా పాలేరు నుంచి పోటీ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ పార్టీ నాయకత్వం, బహుజన యువకులందరు ప్రవీణ్ కుమార్ ను ఇక్కడ నుంచి పోటీ చేయాలని కోరుతున్నారు.. ప్రజాశాంతి పార్టీ అధినేత కే.ఏ.పాల్ కూడా పాలేరులో పోటీ చేసే అవకాశాలున్నాయి.. వీరిద్దరు ఇప్పటి వరకు ప్రకటించలేదు. ఇక కాంగ్రెస్ పార్టీ సంగతి అందరికి తెలిసిందే.. కంచుకోటగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఆశావాహులు ఎక్కువే ఉంటారు.. ప్రస్తుతం కూడా ఎడ్ల శ్రీరామ్ యాదవ్, రాయల నాగేశ్వరరావు, రామసహాయం మాదవి రెడ్డి, మద్ది శ్రీనివాస్ రెడ్డి, తిరుమలాయపాలెం జడ్పీటీసీ బెల్లం శ్రీనివాస్ రేసులో ఉన్నారు. ఇదిలా ఉంటే పాలేరు నుంచి సీపీఎం పార్టీ పోటీ చేసే యోచనలో ఉంది. ఆ పార్టీ నుంచి మాజీ ఎంపీ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం లేదా పోతినేని సుదర్శన్ పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

** మరో ఇద్దరు నేతలు తెరపైకి..?

అయితే ఇప్పుడు మరో రెండు పేర్లు తెరపైకి అకస్మికంగా వచ్చాయి.. వారిద్దరిలో ఎవరినో ఒకర్ని ఇక్కడ పోటీ చేయించాలని వారి రథసారథి భావిస్తున్నట్లు తెలుస్తోంది.. కచ్చితంగా వారిద్దరిలో ఎవరికో ఒకరికి చోటు, సీటు దక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.. ఇప్పటికే ఆ నేత వారికి సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.. ఇంతకు వారేవ్వరో..? ఏ పార్టీ నాయకులో.. తెలుసుకోవాలనుకుంటే సాయంత్రం విడుదల చేసే విజయం పత్రిక కథనంను కచ్చితంగా చదవండి.. అశ్ఛర్యకరమైన విషయం ఏమిటంటే ఆ ఇద్దరు నేతలు కూడా పాలేరు నియోజకవర్గంకు చెందిన వారు.. ఒకే మండలానికి చెందిన వారు కావడం గమనర్హం.

ఫార్ట్ -2  మరో కథనంలో..చూస్తునే ఉండండి.. విజయం తెలుగు దినప్రతిక..