Ukraine Crisis ప్రధాని మోదీకి ఉక్రెయిన్ అధ్యక్షుడి ఫోన్
(విజయం న్యూస్):-
దిల్లీ:-ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఫోన్‌లో మాట్లాడారు.
తమ భూభాగంపై లక్షమంది ఆక్రమణదారులున్నట్లు ఆయన మోదీకి చెప్పారు.తమ దేశంపై భీకరదాడి చేస్తున్న రష్యా సైన్యాన్ని తిప్పికొడుతున్న తీరును వివరించారు.ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తమ దేశానికి మద్దతు ఇవ్వాలని, దురాక్రమణను ఆపాలని కోరారు.
also read :-మెమే ఖర్చులు భరిస్తాం..మా విద్యార్థులను రప్పించండి : కేటీఆర్
రష్యా దురాక్రమణ అంశంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉండడాన్ని రష్యా ప్రశంసించిన నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు భారత్ సాయం కోరడం గమనార్హం.