Telugu News

అంతిమ విజయం కమ్యూనిస్టులదే.. పువ్వాడ

== పెట్టుబడిదారి వ్యవస్థపతనం పతనం తప్పదు

0

అంతిమ విజయం కమ్యూనిస్టులదే.. పువ్వాడ
== పెట్టుబడిదారి వ్యవస్థపతనం పతనం తప్పదు
== కమ్యూనిస్టుల పురోగమనం మొదలైంది
== సి.పి.ఐ బహిరంగసభలో పువ్వాడ, కూనంనేని
== ఖమ్మంలో అకట్టుకున్న ఎర్రదళం కవాత్- ప్రదర్శన
(ఖమ్మం ప్రతినిధి-విజయం న్యూస్)
కమ్యూనిస్టు ఉద్యమ ప్రస్థానంలో ఒడిదొడికులు ఎదురైన అంతిమ విజయం మాత్రం కమ్యూనిస్టులదేనని సి.పి.ఐ సీనియర్ నేత పువ్వాడ నాగేశ్వరరావు పేర్కొన్నారు. ప్రపంచ వ్యాపితంగా కమ్యూనిస్టులు పురోగమిస్తున్నారని, లాటిన్ అమెరికా దేశాల్లో కమ్యూనిస్టులజయకేతనం ప్రారంభమైనదన్నారు.భారతకమ్యూనిస్టు పార్టీ 97వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఖమ్మం రోటరీనగర్ సి.పి.ఐ పైలాన్ వద్ద ఆదివారం బహిరంగసభ నిర్వహించారు. సభకు ముందు పెవిలియన్ గ్రౌండ్ నుండి రోటరీనగర్ పైలాన్ వరకు ఎర్రకవాత్ ప్రదర్శన నిర్వహించారు. సి.పి.ఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ అధ్యక్షత వహించిన బహిరంగసభలో పువ్వాడ మాట్లాడుతూ పెట్టుబడికి వ్యతిరేకంగా సమాజాభివృద్ధి కొరకు కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించిందన్నారు. 96 ఏళ్ళప్రస్థానంలో అనేక మంది వీరిలో తమ ప్రాణాలను తృణప్రాయంగా భావించి ప్రజల హక్కుల కోసం త్యాగం చేశారన్నారు.

allso resd :- ఖమ్మంలో సి.పి.ఐ ఎర్రకవాత్

సాయుధ పోరాట కాలంలో నాలుగున్నర వేలమంది వీరులు ప్రాణాలర్పించి నిజాం పాలన నుండి విముక్తి కలిగించారన్నారు. సంపద సృష్టించేవారికి సంబద పై హక్కు దక్కాలని కమ్యూనిస్టు పార్టీ పోరాడిందన్నారు. 96 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్తానంలో ఎన్నో పోరాట విజయాలను అందుకున్న కమ్యూనిస్టు పార్టీ ప్రస్తుత పాలకులు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతర పోరాటం సాగిస్తుందన్నారు. మొడీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని ప్రైవేటీకరించేందుకు పూపుకుందని ఆయన ఆరోపించారు. ప్రజా సమస్యలపరిష్కారం కోసం పోరాడేవారే కమ్యూనిస్టులని కమ్యూనిస్టులదే అంతిమ విజయమని ఆయన స్పష్టం చేశారు. నిరంతరం పెట్టుబడి దారులు ప్రజా వ్యతిరేక పాలకులపై పోరాటాలు నిర్వహించాలని పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజా పోరాటాలకు పునరంకితం కావాలని పువ్వాడ పిలుపు నిచ్చారు.
== పెట్టుబడిదారీ సమాజపతనం మొదలైంది : కూనంనేని
సి.పి..ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ పెట్టుబడిదారీ సమాజపతనం ప్రపంచ వ్యాపితంగా మొదలైందన్నారు. పెట్టుబడిదారీ సమాజ ముద్దుబిడ్డ అమెరికా చుట్టూ లాటిన్ అమెరికా దేశాల్లో ఎర్రజెండా రెపరెపలు మొదలయ్యా యని చిలిదేశంలో 35 ఏళ్ళ వామపక్ష యువకుడు దేశ అధ్యక్షునిగా ఎన్నికయ్యారని కూనంనేని తెలిపారు. సమాజ ప్రారంభం నుండి బలవంతుడిదే రాజ్యమని ఏదో ఒక పద్దతుల్లో బలహీనులను దోచుకునేవారని కూనంనేని తెలిపారు. బలవంతులకు వ్యతిరేకంగా బలహీనులను సమీకరించి పోరాటం సాగించడం కమ్యూనిస్టులతోనే ప్రారంభమయ్యా అన్నారు.స్కీమ్ ల పేరుతో కొందరు పాలకులు మోసం చేస్తుంటే మరికొందరు మతాన్ని అడ్డు పెట్టుకొని లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తున్నారని సాంబశివరావు ఆరోపించారు.

తుదిశ్వాస వరకు ప్రజల పక్షాన పోరాడేవారు కమ్యూనిస్టులు ఒక్కరేనని ఆయన తెలిపారు. పెట్టుబడిదారి సమాజ వికృత రూపాన్ని ప్రజలు అర్ధం చేసుకుంటున్నారని కమ్యూనిస్టుల పురోగమనం తప్పదని కూనంనేని తెలిపారు. సి.పి.ఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాగం హేమంతరావు, సిద్దినేని కర్ణకుమార్ తదితరులు ప్రసంగించగా సి.పి.ఐ జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేష్ ఆహుతులను వేదికపైకి ఆహ్వానించారు. ఈ సభలో సి.పి.ఐ నాయకులు జమ్ముల జితేందర్ రెడ్డి, శింగునర్సింహారావు, ఎస్.కె.జానిమియా, బి.జి.క్లెమెంట్, యర్రాబాబు, పోటు కళావతి, సి. హెచ్.సీతామహాలక్ష్మి, మహ్మద్ సలాం, కొండపర్తి గోవిందరావు, మిడికంటి వెంకటరెడ్డి, తోట రామాంజనేయులు వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ప్రజానాట్యమండలి కళాకారుల పాటలు అలరించాయి.

ALSO READ :-తామర పురుగుతో తంటాలు.