Telugu News

ఖమ్మం లో వెంకీ మామ సందడి

ఎనీ టైం… ఎనీ సెంటర్ అంటూ వెంకీ మామ సందడి

0

ఖమ్మం లో వెంకీ మామ సందడి

== ఎనీ టైం… ఎనీ సెంటర్ అంటూ వెంకీ మామ సందడి

== హోరెత్తిన వెంకీ నినాదం

(ఖమ్మం -విజయం న్యూస్)

*ఎనీ టైం … ఎనీ సెంటర్… సింగిల్ హ్యాండ్ రఘురాముడు… ఖమ్మం… ఖమ్మం… ఖమ్మం…. కమాన్ అంటూ సినీ హీరో వెంకీ మామ నగరంలో సందడి చేశారు. మయూరి సెంటర్ నుంచి ఇల్లందు క్రాస్ రోడ్ వరకు జరిగిన రోడ్ షో లో ఖమ్మం ప్రజానీకం వెంకటేష్ ను చూసేందుకు ఉత్సాహకత చూపారు. సుమారు రెండు గంటల పాటు జరిగిన రోడ్ షో ఆద్యంతం ఖమ్మం ప్రజానీకాన్ని అలరించింది. అడుగడుగునా వెంకటేష్ కు నీరా’జనం’ పలికారు. అభివాదం చేస్తూ… హస్తం గుర్తుకు ఓటు వేసి ఆర్ఆర్ఆర్ ను గెలిపించాలని కోరుతూ ముందుకు సాగారు.

ఇది కూడా చదవండి:- మూడో నెంబర్ “గుర్తుం”దా…!: విక్టరీ వెంకటేష్

 

వెంకటేష్ ప్రచారం వీడియో దిగువునా..