Telugu News

పత్తా లేని పంతులు… -హాజరు ఉంది మరి సార్ ఎక్కడ…?

-జిల్లా మారిన జిల్లా పేరు మరదా..?

0

పత్తా లేని పంతులు…

-హాజరు ఉంది మరి సార్ ఎక్కడ…?
-జిల్లా మారిన జిల్లా పేరు మరదా..?
-పిల్లల భవిష్యత్తుకి కొన్నిసార్లు బరోసా ఎది..
-అస్తవ్యస్తంగా దేవనగరం పాఠశాల. -కొరవడినఉన్నత అధికారుల పర్యవేక్షణ.

(మంగపేట-విజయం న్యూస్):-

ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో మంగపేట మండలం రాజుపేట గ్రామ పంచాయతీ పరిధిలో (దేవనగరం) ప్రాథమిక పాఠశాలలో మౌలిక సౌకర్యాల కల్పనపై, విద్యా వ్యవస్థ పనితీరు పై సర్వే నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు తోకల రవి విద్యార్థులను అడిగి వారి సమస్యలను తెలుసుకున్నారు.ఈ పాఠశాలలో ఉపాధ్యాయులు ఒక రోజు వస్తే ఒక రోజు రావడంలేదని విద్యార్థులు అన్నారు.పాఠ్యపుస్తకాలు పూర్తిస్థాయిలో రాలేదన్నారు. అదేవిధంగా తరగతిగదిలో నాపరాయిలు పగిలి ఇసుక బయటికి రావడం వలన పిల్లలు కింద పడి దెబ్బలు తగలడం లాంటి సంఘటనలు ఇదివరకు చాలా జరిగినయి అని తెలుసుకున్నారు.

ఉన్నతాధికారులు వెంటనే ఈ సమస్య పరిష్కరించాలని గ్రామస్తులు మండిపడ్డారు. ఫ్యాన్లు ,కిటికీలు లేక తరగతి గదిలో లైట్స్ లేక వెనకాల కూర్చున్నటువంటి పిల్లలకు బోర్డు పైన రాసే అక్షరాలు కనపడక పిల్లలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పాఠశాలకు కాంపౌండ్ వాల్ లేక తరగతి గదిలోకి పాములు తేళ్లు వస్తున్నాయని అన్నారు. అదేవిధంగా పాఠశాల గదిలో అపరిశుభ్రంగా పైపులు ఉన్నాయి అని అన్నారు. అదేవిధంగా నూతన జిల్లా ములుగు జిల్లా ఏర్పడి మూడు సంవత్సరాలు పూర్తి కావస్తున్నా దేవనగరం ప్రాథమిక పాఠశాల బోర్డు పై వరంగల్ జిల్లా పేరు ఇంకా మార్చని ప్రధానోపాధ్యాయులకి ఇంకా జిల్లా పేరు మారిన సంగతి ప్రధానోపాధ్యాయులు కి తెలీకపోవచ్చు అని అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు నవ్వుతు సమాధానం చెప్పుతుండడం ప్రధానోపాధ్యాయులు కి తన బాధ్యతను గుర్తుచేస్తుంది.ఇప్పటికైనా జిల్లా పేరు మార్చవలసిందిగా ఎస్ ఎఫ్ ఐ జిల్లా అధ్యక్షులు రవి హెచ్చరించారుు.అలాగే విధులకు ప్రతిరోజు హాజరు కానీ ఉపాధ్యాయుల మీద చర్యలు తీసుకోవాలని మండల అధికారులను కోరారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలి విద్యార్థులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు లేనియెడల ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో దశలవారీగా పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు జయకృష్ణ ,రాజేష్, కేశవ, సాయి, మహీన్ తదితరులు పాల్గొన్నారు.

also read :-ఖమ్మంలో భారీగా క్రాస్ ఓటింగ్.. అంతర్మథనంలో టీఆర్ఎస్.. ఫలించిన భట్టి వ్యూహం