Telugu News

నిరుద్యోగ భృతి రూ. 3016 వెంటనే అమలు చేయాలి

ఖమ్మం జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఎడ్లపల్లి సంతోష్

0

నిరుద్యోగ భృతి రూ. 3016 వెంటనే అమలు చేయాలి
== ఖమ్మం జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఎడ్లపల్లి సంతోష్
(ఖమ్మం- విజయంన్యూస్)
తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే ఇంటికో ఉద్యోగం వస్తుందని చెప్పిన సీఎం కేసీఆర్, తెలంగాణ వచ్చిన అనంతరం సీఎం గా ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామినిచ్చారని, కానీ ఇప్పటి వరకు నియోజకవర్గానికి ఓ ఉద్యోగం ఇచ్చే పరిస్థితి లేకుండా పోయిందని, అందుకే నిరుద్యోగులకు కచ్చితంగా నిరుద్యోగ భతి రూ.3016 పథకాన్ని వెంటనే అమలు చేయాలని జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఎడ్లపల్లి సంతోష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన పత్రికా సమావేశంలో జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు యడ్లపల్లి సంతోష్ మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుద్యోగ యువకులను పదే పదే మోసం చేస్తున్నారు అని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముఖ్య కారణం నీళ్లు, నిధులు, నియామకాలని, అలాంటి నియమకాల కోసం కొన్ని వందల మంది యువకులు తెలంగాణ పోరాటంలో బలిధానాలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

also read :-డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికాడు…తన వెహికిల్ ని తనే తగలబెట్టుకున్నాడు*

తెలంగాణ రాష్ట్రంలో, ఏడు సంవత్సరాలుగా ఎటువంటి నోటిఫికేషన్ విడుదల చేయకుండా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయకుండా ప్రభుత్వం మీనమేషాలు లెక్కించడం కరెక్ట్ కాదు అని అన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోలో నిరుద్యోగ భృతి రూ.3016 ఇస్తాం అని చెప్పి, నేటికీ మూడు సంవత్సరాలు గడుస్తున్నా ఈ పథకం అమలు చేయకుండా మరలా నిరుద్యోగ యువతను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఎటుచూసినా నిరుద్యోగ యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఈ దొర కే.సిర్ మాత్రం తన కుటుంబంలో అందరికి మంత్రి పదవులు, యం.యల్.సి, రాజ్యసభ పదవులు ఇచ్చి తెలంగాణ రాష్ట్ర సంపధ దోచుకునే పనిలో బిజీగా ఉన్నాడు అని విమ్మర్శించారు.

రాష్ట్రంలో నిరుద్యోగ యువకులు నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తుంటే కే.సి.ర్ మాత్రం వైన్ షాప్ నోటిఫికేషన్, బార్ షాప్ నోటిఫికేషన్ విడుదల చేస్తూ సంపద పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. డిసెంబర్ 31 నైట్ వైన్ షాప్ లు రాత్రి 1 గంట వరకు ఓపెన్ అని తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ కొంత మంది నిరుద్యోగ యువకులు సోషల్ మీడియాలో కే.సి.ర్ ని ప్రశ్నిస్తే వారిపై దేశ ద్రోహం కేసులు పెడుతూ ప్రశ్నించే గొంతుకలను అనగ తొక్కే ప్రయత్నం చేస్తున్నారని, దీనికి పరాకాష్ట నిన్న అరెస్ట్ కాబడ్డ మా సింగరేణి మండల యువజన కాంగ్రెస్ కో ఆర్డినేటర్ గుగుళోత్ హర్ష నాయక్ అని అన్నారు. నేడు ధర్నా చౌక్ లో జరగవలసిన నిరుద్యోగ దీక్ష పర్మిషన్ లేకపోవడం వల్ల రద్దు చేయడం జరిగిందన్నారు.

also read :-_సంజయ్‌ అరెస్ట్‌ తీరుపై 14 రోజులపాటు బీజేపీ ఆందోళనలు**

ఇకనైనా ముఖ్యమంత్రి నిరుద్యోగ సమస్య దృష్టి పెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి, మీ ఎన్నికల హామీ నిరుద్యోగ భృతి పథకం వెంటనే అమలు చేయాలి డిమాండ్ చేస్తున్నాం అన్నారు. రానున్న రోజుల్లో యువజన కాంగ్రెస్ పక్షాన మంత్రులను , ముఖ్యమంత్రిని రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా నోటిఫికేషన్ కోసం, నిరుద్యోగ భృతి కోసం అడ్డుకుంటాం అని అన్నారు. ఈ పత్రిక సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బానోత్ సైదేశ్వరావు, ఖమ్మం అసెం్బ్లి ప్రధాన కార్యదర్శి కొండూరి హృదయ్ కిరణ్, మధిర అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సాయి అన్వేష్, ఖమ్మం రూరల్ మండలం,నెలకొండపల్లి మండల కో ఆర్డినేటర్స్ బొల్లం మహేష్ యాదవ్, భూక్యా కిరణ్,కుక్కల నరేష్, ఖమ్మం 4 పట్టణ యువజన కాంగ్రెస్ కో ఆర్డినేటర్ షేక్ ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.