Telugu News

పిబ్రవరి 17న నిరుద్యోగ దినోత్సవం

16న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరుద్యోగ దీక్షలు

0

==పిబ్రవరి 17న నిరుద్యోగ దినోత్సవం
== 16న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరుద్యోగ దీక్షలు
== యువజనులు, నిరుద్యోగులందరు హాజరు కావాలి
== విలేకర్ల సమావేశంలో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సంతోష్
==(ఖమ్మం-విజయంన్యూస్);-
తెలంగాణ నిరుద్యోగ సమస్యలను పరిష్కరించకుండా, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాక ఆత్మహత్యలు చేసుకుంటే వారి సమస్యలను పరిష్కరించాల్సిన సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలంటూ మూడు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించుకోవడాన్ని నిరసిస్తూ సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈనెల 17న నిరుద్యోగ దినోత్సవం చేస్తున్నట్లు యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఎడ్లపల్లి సంతోష్ తెలిపారు.

also read :-రాహుల్ కు బాసటగా సీఎం కేసీఆర్.. మోడీ ప్రభుత్వంపై ద్వజం

మంగళవారం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సంజీవరెడ్డి భవన్ లో పత్రికా సమావేశం నిర్వహంచగా, ఈ సందర్భంగా జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు యడ్లపల్లి సంతోష్ మాట్లాడుతూ తెలంగాణ కోసం కొట్లాడి త్యాగాలు చేసిన అమర వీరులకు నివాళులు అర్పిస్తూ, వారి త్యాగాలపై ఏర్పడ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గత ఏడున్నర సంవత్సరాలుగా నిరుద్యోగ యువతకు చేస్తున్న మోసాలకు నిరసనగా కేసీఆర్ పుట్టిన రోజును నిరుద్యోగ దినోత్సవంగా జరుపుతున్నామని తెలిపారు. మాయమాటలతో సకల జనులను మోసం చేస్తున్న సీఎం కేసీఆర్ దళిత బందు పేరుతో దగా,దళిత ముఖ్యమంత్రి పేరుతో దగా, దళితులకు మూడెకరాల భూమి పేరుతో దగా, ఎక్కడ ఎన్నికలు ఉంటే ఇదిగో అదిగో నోటిఫికేషన్స్ అంటూ దగా, నిరుద్యోగ భృతి పేరుతో దగా ఇలా తెలంగాణ రాష్ట్రంలో సకలజనులను మోసం చేస్తున్నారని ఆరోపించారు.

also read :-కెసిఆర్ జన్మదిన వేడుకల్లో బహిర్గతమైన వర్గ విభేదాలు…..
“ఫిబ్రవరి 17 నిరుద్యోగ దినోత్సవం” కార్యక్రమంలో భాగంగా 15 తేదీన అమర వీరులకు నివాళి అర్పిస్తూ పత్రికా సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. అలాగే 16 తేదీన అన్ని నియోజకవర్గాల్లో నిరుద్యోగ దీక్ష నిర్వహిస్తున్నామని, 17 తేదీన నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అమలు చేయాలని, అలాగే ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయాలని, చనిపోయిన నిరుద్యోగ అమరుల కుటుంబాలకురూ. 25 లక్షలు ఎక్సెగ్రెషియా ఇవ్వాలనే డిమాండ్ చేస్తూ “నిరుద్యోగ దినోత్సవం ” పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బుధవారం ఖమ్మం జిల్లాలో 5 నియోజకవర్గంలో నిరుద్యోగ దీక్ష నిర్వహించుట జరుగుతుంది అని అన్నారు.

పెద్ద ఎత్తున ఈ నిరుద్యోగ దీక్షలో నిరుద్యోగ యువత, యువజన కాంగ్రెస్ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు బెల్లంకొండ శరత్, బిచ్చాల అన్వేష్, జెర్రిపోతుల అంజనీ, ఖమ్మం అసెంబ్లీ ఉపాధ్యక్షులు బానోత్ కోటే‌ష్ నాయక్, ప్రధాన కార్యదర్శి కొండూరి హృదయ్ కిరణ్, పాలేరు అసెంబ్లీ నాయకులు బొల్లం మహేష్ యాదవ్, బేతంపూడి మదు, యడవల్లి నాగరాజు, కుక్కల నరేష్,భుక్యా కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.