Telugu News

*నేడు నేలకొండపల్లిలో నిరుద్యోగ దీక్ష

విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన రాయల

0

*నేడు నేలకొండపల్లిలో నిరుద్యోగ దీక్ష

==  విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన రాయల

(నేలకొండపల్లి -విజయం న్యూస్) 

నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని, నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నేలకొండపల్లి మండల కేంద్రంలో నిరుద్యోగ దీక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఇది కూడా చదవండి:-;కేటీఆర్  నోరు జాగ్రత్త: సీఎల్పీ నేత భట్టి

ఈనెల 3న ఉదయం 10.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి పట్టణంలోని శ్రీ పొట్టి శ్రీరాములు సెంటర్ నందు కేసీఆర్ ప్రభుత్వంలో మోసపోయిన నిరుద్యోగులకు మద్దతుగా పాలేరు నియోజకవర్గ టీపిసిసి సభ్యులు రాయల నాగేశ్వరరావుచే* నిరుద్యోగ నిరసన దీక్ష కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది..ఈ కార్యక్రమాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం టౌన్ అధ్యక్షులు మమ్మద్ జావిద్, ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షులు పుచ్చకాయల వీరభద్రం,జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు మొక్క శేఖర్ గౌడ్,జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు దోబ్బల సౌజన్య,మైనారిటీ సెల్ అధ్యక్షులు సయ్యద్ హుస్సేన్,

ఇది కూడా చదవండి:- కాంగ్రెస్ తుంగ పూస లాంటిది: పువ్వాళ్ల

యస్.సి.సెల్ అధ్యక్షులు బొడ్డు బోందయ్య, ఐఎన్టీయుసీ అధ్యక్షుడు కొత్తా సీతారాములు,యస్.టి అధ్యక్షులు మాలోతు రాందాస్ నాయక్ ,వైరా టీపిసిసి సభ్యులు వడ్డె నారాయణరావు, టీపిసిసి సభ్యులు శీలం ప్రతాప్ రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బాలాజీ నాయక్ ,యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు యడ్లపల్లి సంతోష్, ఎన్ఎస్యూఐ అధ్యక్షులు వేగినేటి ఉదయ్,పాల్గొంటారు.. కావున నిరుద్యోగులు పాలేరు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాగలని నేలకొండపల్లి మండలం కాంగ్రెస్ నాయకులు కోరారు.