Telugu News

అపరిశుభ్రంగా సంధ్యతండా పంచాయతీ కార్యాలయ అవరణం

%% చెత్తాచేదారంతో నిండిపోయిన అవరణం

0

అపరిశుభ్రంగా సంధ్యతండా పంచాయతీ కార్యాలయ అవరణం
%% చెత్తాచేదారంతో నిండిపోయిన అవరణం
%% పట్టించుకుని పాలకులు, పంచాయతీ కార్యదర్శి
(కూసుమంచి-విజయంన్యూస్)
పంచాయతీ కార్యాలయం అంటే ప్రజలందరి నిలయం.. ప్రజలు తమ సమస్యలను చెప్పకునేందుకు, ప్రభుత్వ పథకాలను అమలు చేసేందుకు, ప్రభుత్వ ఉద్యోగులు పనిచేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యాలయం.. ఆ కార్యాలయంలో సర్పంచ్, పాలక సభ్యులతో పాటు పంచాయతీ కార్యదర్శి, పంచాయతీ సిబ్బంది అక్కడ విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఆ పంచాయతీని చాలా పరిశుభ్రంగా ఉంచుకుని, ఆ తరువాత గ్రామ పంచాయతీని కూడా శుభ్రం చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఇటీవలే పరిశరాల పరిశుభ్రత, మనఊరు..మన ప్రణాళిక.. గ్రామజ్యోతి, మనఊరి ప్రణాళిక లాంటి కార్యక్రమాలను చేపట్టి గ్రామ పంచాయతీ భవనాలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలను పరిశుభ్రంగా చేయాలని ప్రభుత్వం అదేశాలిచ్చింది.

also read:-కూసుమంచిలో అధికారులపై ప్రశ్నల వర్షం.

కానీ కూసుమంచి మండలంలోని సంధ్యతండా పంచాయతీ కార్యాలయ అవరణం మాత్రం చూసేందుకే ఇబ్బందికరంగా ఉంది. నూతనంగా ఏర్పడిన పంచాయతీ కావడంతో స్వంత భవనం లేకపోయినప్పటికి పంచాయతీ కార్యాలయం కోసం ఓ ఇంటిని కిరాయిగా తీసుకుని ఉపయోగించుకుంటున్నారు. అక్కడ పంచాయతీ కార్యాలయం చుట్టు ప్రహరిగోడ ఉన్నప్పటికి ఆ కార్యాలయ అవరణం మొత్తం పిచ్చిమొక్కలతో నిండిపోయి ఉంది. కార్యాలయ అవరణం ముందుభాగం మాత్రమే కొంత వరకు శుభ్రంగా ఉన్నప్పటికి చుట్టుపక్కల మొత్తం పిచ్చిమొక్కలు, చెత్తాచేదారంతో నిండిపోయి ఉంది. కనీస పరిశుభ్రత కనిపించలేదు. దీంతో పంచాయతీ కార్యాలయ అవరణాన్నే శుభ్రం చేయని పాలకులు, పంచాయతీ కార్యదర్శులు పంచాయతీనేమి పరిశుభ్రంగా ఉంచుతారని ఆరోపిస్తున్నారు. తక్షణమే పంచాయతీ అధికారులు స్పందిస్తారా..? వేచి చూడాల్సిందే..?