Telugu News

అధికారంతో అంటగాకే యూనియన్లకు మనుగడ లేదు: విరహత్ అలీ

ఖమ్మంలో జరిగిన ఐజేయు జిల్లా సభలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరహత్ అలీ

0

అధికారంతో అంటగాకే యూనియన్లకు మనుగడ లేదు: విరహత్ అలీ

== భజన సంఘాలు పదవుల కోసం ప్రాకులాడతాయి

== ఖమ్మంలో జరిగిన ఐజేయు జిల్లా సభలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరహత్ అలీ

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

అధికారంతో అంటకాగే ఏ ట్రేడ్ యూనియన్ అయినా,ఉద్యోగ సంఘాలు అయినా మనగడ సాగించలేవని ఆయన విరహాత్ అలీ అన్నారు.భజన సంఘాలు పదవుల కోసం ప్రాకులాడుతాయే తప్పా జర్నలిస్టుల హక్కుల కోసం కోట్లాడలేవని టీయుడబ్ల్యూజే(ఐజేయు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరహత్ అలీ అన్నారు.  శుక్రవారం ఖమ్మం జిల్లా కేంద్రంలో జరిగిన టి యు డబ్ల్యు జె ఐజెయు జిల్లా కార్యవర్గ  సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

ఇది కూడా చదవండి: జర్నలిజం ముసుగులోని అసాంఘీక శక్తులపై తరిమెద్దాం : ఐజేయు

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 60ఏళ్ళ చరిత్రలో తమ యూనియన్ కు పోరాటాలు,ఉద్యమాలు,త్యాగాల చరిత్ర ఉందే తప్ప ఏనాడూ కూడా ప్రభుత్వాలకు తొత్తులుగా ఉండలేదు,పదవులకోసం ప్రాదయేపడలేదన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత కొంతమంది దుర్బిదితో కొత్త దుకాణాన్ని ఏర్పాటు చేసి ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీ పదవులకోసం సాకిలా పడ్డారన్నారు.జర్నలిస్ట్ వ్రతిని నమ్ముకొని,సామాజీక స్ప్రహ కలిగిన 13వేల మంది సభ్యులు కలిగిన నిరంతరం పోరాటపటిమ కలిగిన టియుడబ్ల్యుజె గతంలో చేసిన అనేక పోరాటాల ఫలితంగా ఎన్నో సంక్షేమపధకాలను సాధించుకున్నామన్నారు.భారత దేశంలోనే అత్యధిక స్దాయిలో జర్నలిస్టులకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంఘంగా మన యూనియన్ కు గుర్తింపు ఉందన్నారు. దేశ వ్యాప్తంగా 50వేల మంది కి అక్రడేషన్లు ఉంటే ఒక తెలుగు రాష్ట్రాల్లోనే 50వేల మంది జర్నలిస్టులకు అక్రిడేషన్లను సాధించన ఘనత కూడా తమ సంఘానికే దక్కుతుందన్నారు.30 ఏళ్ళ క్రితం పత్రికయజమానులు తమ పత్రికలో పనిచేసే విలేఖర్లను పాలేర్లకంటే హినంగా చూసే రోజుల్లో  కనీసం పత్రిక నుంచి గుర్తింపు కార్డును జారీ చేయడానికి కూడా ఇస్టపడని రోజుల్లో  గ్రామీణ విలేఖర్లను వర్కింగ్ జర్నలిస్టులుగా గుర్తించాలని అనాడు ఉద్యమించిన ఫలితంగానే 1996లో సూర్యాపేటలో జరిగిన రాష్ట్ర మహాసభలో అనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రామీణ విలేఖర్లకు అక్రిడేషన్లు ఇవ్వడానికి అంగికరించారని ఆయన ఈ సందర్బంగా గుర్తు చేశారు.

ఇది కూడా చదవండి: జర్నలిస్టుల సమస్యలపై  దేశవ్యాప్తంగా ఆందోళన: విరహత్ అలీ

గ్రామీణ విలేఖర్ల కోసం ఉద్యోగ భద్రత కోసం పోట్లాడి వర్కింగ్ జర్నలిస్ట్ చట్టాన్ని తీసుకొచ్చిన చరిత్ర కూడా తమ యూనియన్ కే ఉందన్నారు. లేబర్ కోర్టు ద్వారా ఎంతో మంది మండల విలేఖర్లకు పత్రికయజమాన్యం ద్వారా నష్టపరిహారం ఇప్పించిన ఘనత తమదేనన్నారు.జర్నలిస్టుల సమస్యలపై రాష్ట్ర రాజధానిలో ఐదువేల మంది జర్నలిస్టుతో గర్చించడంతో పాటు గల్లి నుంచి ఢిల్లీ వరకు ఉద్యమాన్ని విస్తరించి జంతర్ మంతర్ వద్ద భారీ వర్షంలో కూడా ధర్నా చేసి అనాటి ఉప రాష్ట్ర పతి వెంకయ్య నాయుడిని కలిసి జర్నలిస్టుల సమస్యలపై మొరపెట్టుకోవడం జరిగిందన్నారు.భవిష్యత్తులో జర్నలిస్టుల సంక్షేమం ,కనీస మౌళిక సదుపాయాలను కల్పించేందుకు  నిరంతరం పోరాటాలు చేస్తుంటామని విరహాత్ అలీ ప్రకటించారు.