Telugu News

తాతామధుకు అపూర్వ స్వాగతం

కూసుమంచిలోని నాయకన్ గూడెం నుంచి ఖమ్మం వరకు భారీ ర్యాలీ

0

తాతామధుకు అపూర్వ స్వాగతం
== కూసుమంచిలోని నాయకన్ గూడెం నుంచి ఖమ్మం వరకు భారీ ర్యాలీ
== కూసుమంచిలో ఘనసన్మానం
== ఘనంగా స్వాగతం పలికి అభినందించిన పాలేరు ఎమ్మెల్యే
== ఖమ్మం కార్యాలయంలో ఘన సన్మానం

(కూసుమంచి-విజయంన్యూస్)
ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా నియామకమైన ఎమ్మెల్సీ తాతా మధుసూధన్ అపూర్వ స్వాగతం లభించింది. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియామకమైన అనంతరం తొలిసారిగా హైదరాబాద్ నుంచి ఖమ్మం వచ్చిన సందర్భంగా ఖమ్మం జిల్లా సరిహద్దు ప్రాంతమైన కూసుమంచి మండలంలోని నాయకన్ గూడెం గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. తాతామధుకు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అక్కడ నుంచి ర్యాలీగా కూసుమంచి మండల కేంద్రానికి చేరుకోగా, కూసుమంచిలో స్థానిక టీఆర్ఎస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో గజమాలతో సన్మానించారు. అనంతరం కూసుమంచి గ్రామంలోని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి క్యాంఫ్ కార్యాలయంకు తాతామధుసూధన్ వెళ్లగా పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు.

పుష్పగుచ్చమిచ్చిసన్మానించి అభినందించారు. అనంతరం తాతామధుసూధన్ పాలేరు ఎమ్మెల్యేను సన్మానించారు.అనంతరం ఎమ్మెల్యే అందించిన తేనేటి వింధుకు హాజరైయ్యారు. అనంతరం కూసుమంచి నుంచి ర్యాలీగా ఖమ్మం రూరల్ మండలం చేరుకోగా, ఖమ్మం రూరల్ మండల పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. గజమాలలతో తాతామధుసూధన్ ను ఘనంగా సన్మానించారు. అనంతరం మోటర్ సైకిల్ ర్యాలీతో పార్టీ కార్యాలయం వరకు వెళ్లారు. అక్కడ ఖమ్మం పట్టణ కమిటీ అధ్యక్షుడు పగడాల నాగరాజు ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. ఆయన పార్టీ కార్యాలయంలోని తల్లితెలంగాణ విగ్రహానికి పూలమాలలు వేసి జే తెలంగాణ నినాదాలు ఇచ్చారు.

also read :- మేడారం జాతర కమిటీలో వద్దిరాజు రవిచంద్ర కు చోటు
== పార్టీ బలోపేతం కోసం మరింతగా పనిచేస్తాం : తాతా మధు
టీఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం మరింతగా పనిచేస్తానని, అందర్ని కలుపుకుని గ్రామగ్రామాన పార్టీని మరింతగా బలోపేతం చేసేందుకు కషిచేస్తానని తాతామధు తెలిపారు. నాపై నమ్మకంతో ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి, ఆతరువాత జిల్లా పార్టీ అధ్యక్షుడిగా అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. అలాగే సహాకారించిన రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు,ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలలకు, నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలోని ఐదు స్థానాల్లో పార్టీ అభ్యర్థులు విజయం సాధించే విధంగా కష్టపడి పనిచేస్తానని హామినిచ్చారు. అందరి సహాకారం తీసుకుంటానని, అందరు సహాకరిస్తారనే నమ్మకం నాకు ఉందన్నారు. ప్రతి గ్రామంలో పర్యటించి పార్టీ నాయకులు, కార్యకర్తల సమస్యలను పరిష్కరించేందుకు కషి చేస్తానని హామినిచ్చారు.

ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు హాజరైయ్యారు.

also read :- కన్నీంటి పర్వంతమైన ఎమ్మెల్యే కందాళ