అసాంఘీక కార్యకలాపాలు చేస్తే సమాచారం ఇవ్వండి : ఏసీపీ బస్వారెడ్డి
== వివరాలు ఇచ్చినవారి పేర్లను గోప్యంగా ఉంచుతాం
అసాంఘీక కార్యకలాపాలు చేస్తే సమాచారం ఇవ్వండి : ఏసీపీ బస్వారెడ్డి
== వివరాలు ఇచ్చినవారి పేర్లను గోప్యంగా ఉంచుతాం
== గంజాయి,గుట్కా అక్రమ వ్యాపారం చేస్తే కఠినచర్యలు
== కూసుమంచి మండల పరిషత్ కార్యాలయంలో ప్రజాప్రతినిధులకు సూచించిన ఏసీపీ బస్వారెడ్డి
(కూసుమంచి-విజయంన్యూస్)
అసాంఘీక కార్యకలాపాలు చేస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, అట్టి సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఖమ్మం రూరల్ ఏసీపీ బస్వారెడ్డి తెలిపారు. బుధవారం కూసుమంచి మండల పరిషత్ కార్యాలయంలో ఖమ్మం రూరల్ ఏసీపీ బస్వారెడ్డి ఆధ్వర్యంలో సర్పంచ్ లు, ఎంపీటీసీ లతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ మండలంలో ఎక్కడైనా ఎవరైనా అసాంఘిక కార్యకలాపాల కు పాల్పడినా, గంజాయి సేవించడం,గంజాయి అక్రమ రవాణా, గుట్కా వ్యాపారం, పేకాట వంటి చర్యలకు పాల్పడితే వారిపై చట్ట రీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని, తరచూ ఇలాంటి చర్య లకు పాల్పడిన వారికి ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ ఫలాలు కూడా రద్దు చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
also read :-వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి
అసాంఘీక కార్యకలాపాలు కు పాల్పడే వ్యక్తుల వివరాలు గురించి పోలీసుల కు సమాచార ఇవ్వాలని వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని ఈసందర్భంగా తెలియచేశారు. ఈ కార్యక్రమంలో కూసుమంచి ఎంపీపీ బానోతు శ్రీనివాస్, కూసుమంచి సీఐ సతీష్,ఎస్ నందీప్, ఎంపీడీవో కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
== విద్యార్థులు మంచి నడవడికతో నడవాలి : ఏసీపీ
కూసుమంచి జేవీఆర్ కళాశాల లో ఖమ్మం రూరల్ ఏసీపీ బస్వారెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు అందరూ మంచి నడవడిక తో మెలగాలని, ఎటువంటి వ్యసనాల బారిన పడవద్దని, చెడు అలవాట్లు చేసుకోవద్దని, మంచిగా ప్రణాలిక ప్రకారంగా చదువుకుని భవిష్యత్తు కు బాటలు వేసుకోవాలని సూచించారు. ఎవరైనా ర్యాగింగ్ వంటి చర్యలకు పాల్పడితే వారిపై చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోబడతాయని, ఎవరైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లైతే వారి వివరాలు పోలీసులకు తెలియచేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో కూసుమంచి సీఐ సతీష్,ఎస్ నందీప్,కళాశాల సిబ్బంది పాల్గొన్నారు..