ఖమ్మం ప్రెస్ క్లబ్ లో టీజేఎఫ్ జెండా అవిష్కరణ
జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రమేష్ బాబు
ఖమ్మం ప్రెస్ క్లబ్ లో టీజేఎఫ్ జెండా అవిష్కరణ
◆ జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రమేష్ బాబు
◆ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన టీయూడబ్ల్యూజే(టిజేఎఫ్) జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ
ఖమ్మం, జనవరి 26(విజయంన్యూస్):
ఖమ్మం ప్రెస్ క్లబ్ లో 74వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుద్దేటి రమేష్ బాబు జాతీయ జెండాను గురువారం ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టియుడబ్ల్యూజె (టీజేఎఫ్) జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ మాట్లాడుతూ.. గణతంత్ర వేడుకలు దేశవ్యాప్తంగా ప్రజలు వాడ వాడలా ఘనంగా జరుపుకుంటున్నారని, అందులో భాగంగా ఖమ్మం ప్రెస్ క్లబ్ లో ఈ వేడుకలు ఘనంగా జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. గత 12 సంవత్సరాలుగా ఖమ్మం ప్రెస్ క్లబ్ కొందరి పెత్తనంగా ఉందని, 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలతో దానికి విముక్తి కలగడం, జర్నలిస్టుల సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందరికీ అందేలా మార్గం సుగమం అయిందన్నారు. నియంత పోకడలు ఎంతోకాలం ఉండవని, ఐక్యతతో జర్నలిస్టుల ఆకాంక్ష మేరకు మంచే గెలుస్తుందని పేర్కొన్నారు. భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలు ఆయన చూపిన మార్గాలు భవిష్యత్ తరాలకు దిక్సూచిగా వెలుగొందుతాయని, ఆయన చూపిన మార్గమే నేడు ఖమ్మం ప్రెస్ క్లబ్ పై త్రివర్ణ పతాకం రెపరెపలాడిందన్నారు.
ఇది కూడా చదవండి: పార్కులకు గుమ్మం ‘ఖమ్మం’: మంత్రి పువ్వాడ
ఈ సందర్భంగా జిల్లా ప్రధానకార్యదర్శి చిర్రా రవి మాట్లాడుతూ.. అనేక ఏండ్లుగా ఖమ్మం ప్రెస్ క్లబ్ నిరాదరణకు గురైందని, సమస్యల నిలయంగా మిగిలిందని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (టీజేఎఫ్) అడుగుపెట్టి జర్నలిస్టుల ఆకాంక్షకు అనుగుణంగా, జర్నలిస్టుల పక్షాన నిలబడి గొంతు ఎత్తి సమస్యలు పరిష్కరించుకునే దిశగా అభివృద్ధికి బాటలు వేస్తూ ముందుకు వెళుతుందని అన్నారు.
ప్రజా ప్రతినిధులు ఇచ్చిన హామీలను అమలుపరచుకుంటూ ప్రెస్ క్లబ్ ను మరింత అభివృద్ధి చేసుకునే విధంగా పయనిస్తామని పేర్కొన్నారు. జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షకార్యదర్శులు వి రామకృష్ణ, శెట్టి రజినీకాంత్, నగర కమిటీ అధ్యక్ష కార్యదర్శులు బాలబత్తుల రాఘవ, అమరవరపు కోటేశ్వరావు, నగర ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షకార్యదర్శులు యలమందల జగదీష్, కరీష అశోక్, జిల్లా ఉపాధ్యక్షులు టీఎస్ చక్రవర్తి, డిప్యూటీ జిల్లా కార్యదర్శి మందటి వెంకటరమణ, ఎస్.కె జానీపాషా, విజేత, కంచర్ల శ్రీనివాస్, యాకేష్, వీడియో జర్నలిస్ట్ అధ్యక్షులు నాగరాజు, ప్రెస్ క్లబ్ కోశాధికారి కొరకొప్పుల రాంబాబు, సహయ కారదర్శి బిక్కీ గోపి, ఉపాధ్యక్షులు ముత్యాల కోటేశ్వరరావు, ఈశ్వరి, సాయి, వేణు, శ్రీనివాస్, నరేందర్, జీవన్ రెడ్డి, రోశిరెడ్డి, వెంకట్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, శివాజీ, తిరుపతిరావు, ఆర్ కె, పానకాలరావు, గణేష్, మందుల వెంకటేశ్వర్లు, కిరణ్, జి కుమార్, బండి కుమార్, నరేష్, పురుషోత్తం, రవి, యాదగిరి, మోహన్, వేణుగోపాల్, వెంకటేశ్వర్లు, లక్ష్మణ్, కృష్ణారావు, పులి శ్రీనివాస్, ఉత్కంఠం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడ చదవండి: ఖమ్మం ప్రెస్ క్లబ్ లో విచిత్ర పాలిటిక్స్