*నగరాభివృద్ధే నా లక్ష్యం: మంత్రి పువ్వాడ
* అందులో భాగంగా అన్ని డివిజన్లలో రోడ్లు నిర్మాణం
** ఖమ్మం నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపన చేసిన మంత్రి
(ఖమ్మం ప్రతినిధి-విజయం న్యూస్)
ఖమ్మం నగరాభివృద్ధిలో భాగంగా కార్పొరేషన్ పరిధిలో ప్రతి డివిజన్ లో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు గాను సీసీ రోడ్స్ నిర్మిస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు పేర్కొన్నారు.
మంగళవారం 53వ డివిజన్ NST రోడ్ నందు రూ.30 లక్షలు, 26వ డివిజన్ పోలీస్ కమీషనర్ కార్యాలయం రోడ్ నందు రూ.13 లక్షలు మొత్తం రూ.43 లక్షలతో నిర్మించిన Vaccum Dewatered Flooring(VDF) రోడ్స్ ను మేయర్ పునుకొల్లు నీరజ తో కలిసి ప్రారంభించారు.
ముఖ్యమంత్రి ప్రత్యేక నిధులు(SDF) రూ.30 కోట్ల నిధుల నుండి 41 డివిజన్లలో 140 రోడ్స్ ఏర్పాటు చేయనున్నమన్నారు.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంను వినియోగించుకుని VDF రోడ్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
ఇప్పటికే నగరంలో పలు ప్రధాన దారుల్లో బ్లాక్ టాప్(BT) రోడ్స్ వేయడం జరిగిందన్నారు.
ప్రజలకు నిత్యం అవసరమయ్యే రోడ్లు వేసి మెరుగైన రవాణా సౌకర్యం కల్పించాలని సంకల్పించమని పేర్కొన్నారు.
సూడా చైర్మన్ బచ్చు విజయ్ గారు, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి , పబ్లిక్ హెల్త్ EE రంజిత్ , డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా , కార్పొరేటర్ లు కర్నాటి కృష్ణ, పగడాల శ్రీవిద్య, దండా జ్యోతి రెడ్డి, నాయకులు పగడాల నాగరాజు, స్వరూప రాణి తదితరులు ఉన్నారు..
also read :-సార్ నమస్తే మేము మీ కళాశాల విద్యార్థులం…