Telugu News

స‌మ‌యాన్ని స‌ద్వినియోగం చేసుకుంటేనే విజయం సాధిస్తారు : నామా

0

స‌మ‌యాన్ని స‌ద్వినియోగం చేసుకుంటేనే విజయం సాధిస్తారు : నామా

== ప్ర‌భుత్వ పాఠ‌శాల విద్యార్థుల‌కు ఎంపీ నామ నాగేశ్వ‌ర్‌రావు దిశానిర్దేశం

== ఖ‌మ్మం కార్పొరేషన్ లోని గాంధీన‌గ‌ర్ స్కూల్‌ను ఆక‌స్మికంగా సంద‌ర్శించి, వ‌స‌తుల ప‌రిశీల‌న‌

(ఖ‌మ్మం ప్రతినిధి-విజయంన్యూస్)

జీవితంలో ఉన్నత శిఖ‌రాల‌కు రావాల‌నుకున్న విద్యార్థులు స‌మ‌యాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని టీఆర్ఎస్ లోక్‌స‌భ ప‌క్ష నేత‌, ఖ‌మ్మం ఎంపీ నామ నాగేశ్వ‌ర్‌రావు సూచించారు. మంగ‌ళ‌వారం ఆయ‌న ఖ‌మ్మం ప‌ర్య‌ట‌న‌లో భాగంగా గాంధీన‌గ‌ర్‌లోని ప్రాథ‌మిక పాఠ‌శాల‌ను ఆక‌స్మికంగా సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా పాఠ‌శాల‌లో వ‌స‌తుల గురించి ఉపాధ్యాయుల‌ను ఆరా తీశారు. అనంత‌రం విద్యార్థుల‌తో కొద్దిసేపు ఆయ‌న ప్ర‌త్యేకంగా గ‌డిపారు. త‌న బాల్యం, విద్యార్థి ద‌శ ఉన్న రోజుల్లో మాదిరిగా పిల్ల‌ల‌తో మాట్లాడి… తానొక చిన్న‌పిల్లాడిగా ప‌సికూన‌ల‌తో ఎంపీ ముచ్చ‌టించారు. పాఠ‌శాల ప్రాంగణంలో క్లాసుల‌ను సంద‌ర్శించిన త‌రుణంలో భ‌విష్య‌త్‌లో ఏమీ అవ్వాలని అనుకుంటున్నార‌ని ప‌లువురు విద్యార్థుల‌ను ఎంపీ నామ అడిగారు. విద్యార్థులు వారి జీవితంలో సాధించ‌బోయే ఆశ‌యాలను ఎంపీకి వివ‌రించారు.

బాగా చ‌దివితే రానున్న రోజుల్లో జీవితం అద్భుతంగా ఉంటుంద‌ని ఆయ‌న చెప్పారు. త‌ల్లిదండ్రులు కూడా త‌మ పిల్ల‌లు బాగా చ‌దివితేనే సంతోషిస్తార‌ని గుర్తు చేశారు. జీవితంలో ప్ర‌తి ఒక్క‌రికీ 24 గంట‌లే ఉంటుంద‌ని అన్నారు. కానీ దాన్ని స‌ద్వినియోగం చేసుకున్న విద్యార్థులే జీవితంలో ఉన్న‌త స్థానానికి ఎదుగుతార‌ని వెల్ల‌డించారు. విద్యా సంబంధిత అంశాల్లో స్టూడెంట్స్ టాప‌ర్స్ కావాల‌ని సూచించారు. విద్యార్థి ద‌శ‌లో ప్ర‌తి ఒక్కిరికీ ప‌లు ర‌కాల ఆసక్తులు ఉంటాయ‌ని వ్యాఖ్యానించారు. సాధారణంగా జీవితంలో ఒక వ్యక్తి నిమగ్నమయ్యే ప్రతి ప‌నిలో విజ‌యం రాద‌ని… 24 గంట‌ల సమ‌యాన్ని ఎవ‌రైతే ల‌క్ష్య సాధ‌న‌కు ఉప‌యోగించుకుంటారో వారే విజ‌యం సాధిస్తార‌ని చెప్పారు.

విద్యార్థులు త‌మ లక్ష్యాన్ని స్పష్టంగా నిర్వచించుకోని ప‌ని చేయ‌డం ముఖ్య‌మైన అంశ‌మ‌న్నారు. అనేక రంగాలపై ఆసక్తి ఉంటే, ఒకే సమయంలో అన్నింటినీ విజయవంతం చేయడానికి ప్రయత్నించవద్దని, ఒక ల‌క్ష్యాన్ని సాధించుకునేందుకు స్థిరంగా ప‌ని చేయాల‌న్నారు. విజయవంతం కావడానికి ఉద్దేశించిన ల‌క్ష్యం కోసం పూర్తిగా అధ్యయనం చేయాల‌ని సూచించారు. సక్సెస్ తరచుగా కొత్త మార్గంలో పనులు చేసేవారికి వస్తుంద‌ని ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో రైతు
బంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, టి.ఆర్.ఎస్ రాష్ట్ర నాయకురాలు మద్దినేని స్వర్ణకుమారి గారు, సౌత్ సెంట్రల్ రైల్వే జడ్ఆర్ యుసీసీ మెంబెర్ మెళ్ళచేరువు వెంకటేశ్వరరావు గారు, 32,36 వ డివిజన్ కార్పొరేటర్లు డి. సరస్వతి రవి గారు, పసుమర్తి రామ్మోహన్ రావు గారు, నాయకులు చిత్తారు సింహాద్రి యాదవ్ గారు, బాణాల వెంకటేశ్వరరావు గారు, నామ సేవా సమితి సభ్యులు పాల్వంచ రాజేష్, చీకటి రాంబాబు, తాళ్ళూరి హరీష్ బాబు, రేగళ్ల కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

also read;-రైతుల ఖాతాలో సమఅవుతున్న రైతు బంధు నిధులు