Telugu News

వైకుంఠథామానికి పోదామంటే నరకమే..?

ఊరికి దూరానా వైకుంఠధామం

0

వైకుంఠానికి పోవుడంటే నరకమే..?
== ఊరికి దూరానా వైకుంఠధామం
== వాగుల్లో పయనం.. నడుమ లోతు నీళ్లల్లో నడక
== వర్షం వస్తే వాగు పక్కనే అంత్యక్రీయలు
== సమస్యను పరిష్కరించాలని కోరుతున్న జనం
== పట్టించుకుని అధికారగణం
(చండ్రుగొండ- విజయం న్యూస్);-
పల్లె రూపురేఖలు మార్చాలనే ఆలోచనతో ప్రభుత్వం పల్లె పకృతి కార్యక్రమానికి రెండేళ్ల క్రితం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా గ్రామాల్లో పల్లె ప్రకృతి వనా లు, డంపింగ్ యార్డ్, వైకుంఠధామాల నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వాటిని గ్రామాల్లో నిర్మించి గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలనే లక్ష్యం తో రూ.లక్షలను వెచ్చించి వాటిని నిర్మాణాలు చేపట్టింది. కానీ కొందరి ఆనాలోచిత నిర్ణయాలకు ఆ పథక లక్ష్యం నీరుగారిపోతుంది.. చాలా గ్రామాలకు ఈ పథకం అందని ద్రాక్షగానే మిగిలింది. ఊరికి దగ్గరగా నిర్మాణం చేయాలని సర్కార్ చెబుతుంటే ఊరికి అమడదూరంలో నిర్మాణం చేస్తూ మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నప్పటికి అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు.. మైళ్ల దూరం మాకొద్దు అంటూ జనం మొత్తుకున్న పట్టించుకునే నాథుడే కరువైయ్యారు..

also read;-కమలం నెక్స్ట్ టార్గెట్ ‘తెలంగాణ’

ఆ గ్రామంలో జరుగుతున్న ఇబ్బందులపై ‘విజయం’ విలేకరి అందిస్తున్న ప్రత్యేక కథనం ..వివరాల్లోకి వెళితే.
చండ్రుగొండ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలకు ఈజీఎస్ పథకం నుంచి వైకుంఠధామం నిర్మాణానికి నిధులు మంజూరైయ్యాయి. మరణించిన సమయంలో ప్రజలందరు ఒకే వద్ద ఖననం చేసుకునేందుకు, దహాన సంస్కారాలు చేసుకునేందుకు వీలుగా ఉండే విధంగా వైకుంఠదామాలను నిర్మాణం చేయాలని ప్రభుత్వంఅధికారులకు, పాలకులకు సూచించింది. అందులో భాగంగానే మండలంలో చాలా గ్రామాల్లో వైకుంఠదామాలను గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా నిర్మించారు.

కానీ గుర్రంగూడెం గ్రామపంచాయతీలో మాత్రం గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో అడవి ప్రాంతంలో వైకుంఠదామాన్ని నిర్మాణం చేస్తున్నారు. చాలా దూరంగా ఉండటంతో పాటు ఆ వైకుంఠదామానికి వెళ్లాలంటే వాగు దాటిపోవాల్సి ఉంటుంది. వర్షం వచ్చిన సమయంలో కచ్చితంగా నడుములోతు నీళ్లు ఆ వాగులో ప్రవహిస్తుంటాయి. వర్షం వస్తే గ్రామ పరిశరప్రాంతాల్లో వైకుంఠదామాన్ని నిర్మాణం చేయాల్సిన అధికారులు, పాలకులు రెండు కిలోమీటర్ల దూరం నిర్మాణం గ్రామంలో ఎవరు చనిపోయిన దహన సంస్కారాలు చేయాలంటే గ్రామస్తులు మృతుల బంధువులు నరకం చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దానికి తోడు అడవిలో రవాణా మార్గం లేక పోవడం, చిన్నపాటివర్షం పడితే కాలు తీసి కాలువేసే పరిస్థితి లేదు. మరి ముఖ్యంగా వైకుంఠ ధామం చేరుకోవాలంటే మార్గమధ్యలో ఉన్న వాగుకు ఏలాంటి చప్టా లేకపోవడంతో నడుము లోతు నీటిలో పాడే మోస్తూ వాగు దాటాల్సిందే ఇక వర్షాకాలం అయితే గ్రామస్తులు ఇక్కడే నరకం చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

also read;-ఆర్య వైశ్యుల అభివృద్ధికి కృషి చేస్తా

ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు దాటలేక వాగులు చెరువులు కుంటలు పక్కనే దహన సంస్కారాలు చేయాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. ప్రభుత్వం ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైకుంఠధామాలు నిర్మించాలని అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ గ్రామానికి ఆమడదూరంలో నిర్మించడంతో గ్రామస్తులతో పాటు మృతుల బంధువులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లాస్థాయి అధికారులు కలుగజేసుకుని గ్రామం నుంచి వైకుంఠధామం వరకు గ్రావెల్ రోడ్డు నిర్మించాలని అలాగే వాగుపై లో లెవెల్ వంతెన నిర్మించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుతున్నారు. అలానే అదే దారిలో వాగు పైన సుమారు 60 నుంచి 80 ఎకరాల వ్యవసాయ భూమి కూడా రైతులు సాగు చేస్తున్నారు. గతంలో ఎన్నో సార్లు ప్రజాప్రతినిధులకు, అధికారులకు, కలెక్టర్ సైతం కూడా వినతి పత్రాలు అందజేశారు.కానీ నేటికీ కూడా వాగుపై ఎలాంటి నిర్మాణం చేపట్టలేదు.

== అనేకమార్లు వినతులు చేసినం : కాకా సీత (సర్పంచ్), గుర్రం గూడెం.

గ్రామపంచాయతీలో ప్రభుత్వ భూమి లేకపోవడం వల్ల అటవీశాఖ అధికారుల నుంచి వైకుంఠధామం కి జిల్లా కలెక్టర్ నుంచి స్థలం సేకరించారు.. కానీ వైకుంటదామనికి కి వెళ్లడానికి సరేనా మార్గం లేదని పలుమార్లు అధికారులుకి కూడా తెలియజేశాం. కొన్నిసార్లు ప్రజాప్రతినిధులు కూడా వినతిపత్రం అందజేశాం. కానీ అధికారులు ఇంతవరకు కూడా స్పందించలేదు.. అదేవిధంగా వ్యవసాయం చేసుకునే రైతులు కూడా పెద్ద సంఖ్యలో ఇదే దారి గుండా వెళ్లాలి. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి మాకు వాగుపై బ్రిడ్జి నిర్మాణం, అదేవిధంగా వైకుంఠధామం కి మెటల్ రోడ్డు వెయ్యాలని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం.

== వైకుంఠధామానికి వెళ్లడానికి నరకం చూస్తున్నాం:

మా గ్రామంలో ప్రభుత్వం నిర్మించిన వైకుంఠధామం నికి వెళ్లడానికి నరకయాతన అనుభవిస్తున్నారు.. వర్షాకాలం వచ్చిందంటే ఆ దారిలో కాలు తీసి కాలు పెట్టడానికి కూడా అవకాశం ఉండదు. అదేవిధంగా ఆ వాగులో ఎప్పుడూ కూడా సుమారు 5 నుంచి 6 అడుగులు నీరు ఎప్పుడూ పారూతు ఉంటది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రోడ్డు నిర్మాణం నిర్మించాలని కోరుతున్నాం.