Telugu News

వ్యవసాయబావిలో వ్యక్తి మృతదేహం

ఆత్మహత్య చేసుకోవచ్చని భావిస్తున్న పోలీసులు

0

ముదిగొండ మండలం వల్లభి సమీపంలో వ్యవసాయ బావిలో ఓ వ్యక్తి మృతదేహం.

— ఆత్మహత్య చేసుకోవచ్చని భావిస్తున్న పోలీసులు 

(ముదిగొండ-విజయంన్యూస్)

బావిలో ఓ మృతదేహం లభ్యమైంది.. ముదిగొండ మండలంలోని వల్లబి సమీపంలోని ఓ వ్యవసాయ బావిలో ఓ వ్యక్తి మృతదేహం కనిపించింది.  అటుగా వ్యవసాయ పనులు చేసుకుంటున్న రైతులు ఆ మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు.  సమాచారం అందుకున్న ముదిగొండ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్థానికుల సహాయంతో బయటకు తీశారు. ఆ తరువాత ఆయా పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇవ్వగా నేలకొండపల్లి మండలంలోని రాయిగూడెం గ్రామానికి చెందిన దామల్ల నరసింహారావు (48) అనే వ్యక్తి గా గుర్తించారు. నరసింహారావు తప్పిపోయినట్లుగా నేలకొండపలి్ల పోలీస్ స్టేషన్ లో ఈనెల 19న కుటుంబ సభ్యులు  ఫిర్యాదు చేయగా, నేలకొండపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ముందుగా పురుగుల మందు తాగి బావిలో దూకి ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని పోలీసులు బావిస్తున్నారు.

also read : – ఇసుక అక్రమ రవాణా పై ఎస్ఐ జితేందర్ మెరుపుదాడి