Telugu News

వామ్మో పులి.. రోడ్డుపై కనిపించడంతో బెంబేలు.

జంగలపల్లి గేట్ వద్ద రోడ్డు పై తిరుగుతు కనిపించిన పులి. బెంబెలెత్తిన జనం

0

** వామ్మో పులి.. రోడ్డుపై కనిపించడంతో బెంబేలు**.
** జంగలపల్లి గేట్ వద్ద రోడ్డు పై తిరుగుతు కనిపించిన పులి; బెంబెలెత్తిన జనం.
** మూడు జిల్లా ప్రజలను అప్రమత్తం చేస్తున్న పారెస్టు అధికారులు.

(ఇల్లందు – విజయం న్యూస్):-

పులి నడిరోడ్డు పై తిరుగుతుంది.. తెల్లవారుజామున రోడ్డు పై తిరుగుతున్న పులిని చూసి రోడ్డుపై రాకపోలు చేసే ప్రజలు ఉలిక్కిపడ్డారు.. తక్షణమే అధికారులకు సమాచారం ఇవ్వడంతో సరిహద్దు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే   భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా టేకులపల్లి ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని మొట్లగూడెం – జంగాలపల్లి బీట్ పరిధిలో మొట్లగూడెం సమీపంలోని జంగలపల్లి గేట్ వద్ద శనివారం ఉదయం తెల్లవారుజామున పులి రోడ్డు దాటుతుండగా రైతులు, పారెస్ట్ అధికారులు చూశారు. పులి దాటుతున్న సమయంలో కూడా పోటోలో తీశారు. దీంతో చుట్టు ప్రక్కల గ్రామాలకు చెందిన ప్రజలను పారెస్ట్ అధికారులు అప్రమత్తం చేస్తున్న్నారు. సమీప గ్రామ ప్రజలను అలర్ట్ చేసిన ఫారెస్ట్ అధికారులు అడవిలోకి ఎవరు వెళ్లకుండా ఉండాలని టేకులపల్లి ఎఫ్ అర్ ఓ ముక్తార్ హుస్సేన్ కోరారు. చుట్టు ప్రక్కల గ్రామాల్లో పారెస్టు అధికారులు తిరుగుతూ ప్రజలకు అవగాహణ కల్పిస్తున్నారు. అయితే పులి రోడ్డు పై కనిపించడంతో చుట్టుప్రక్కల ప్రజలు ఉలిక్కిపడ్డారు. అందరు ఇంటికే పరిమితమైయ్యారు.

allso read :- ఈరోజే “డ్రా..డే”..!

 

Please subscribe like & share :- https://youtu.be/l1Gvf4gr9Kk