Telugu News

వామ్మో ఏం జనం..

% కొండగట్టు ఆలయానికి పోటెత్తిన భక్తులు

0

వామ్మో ఏం జనం..
%% కొండగట్టు ఆలయానికి పోటెత్తిన భక్తులు
(జగిత్యాల-విజయంన్యూస్):
అసలే కరోనా సమయం.. దేశవ్యాప్తంగా కరోనా విజంభిస్తోంది.. కేసులు రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి.. ఈ సమయంలో దేవాలయాలకు భక్తులు తాకిడి తగ్గింది.. కోట్ల మంది జనం వచ్చే తిరుపతి కూడా జనం రద్ది లేదు. కానీ కొండగట్టు అంజన్న ఆలయానికి మాత్రం భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులతో ఆలయం కిటకిటలాడుతోంది. క్యూలైన్లు నిండిపోయి వెలుపల వరకు బారులుతీరారు. దర్శనానికి 2 గంటల సమయం పట్టింది

also read :-.వచ్చే నెలలో హిందీలో ‘రంగస్థలం’

సమ్మక్క సారలమ్మ జాతర సవిూపిస్తున్న దృష్ట్యా భక్తుల రద్దీ పెరిగింది. జాతరకు ముందు అంజన్నను దర్శించుకోవడం భక్తులు ఆనవాయితీగా వస్తోంది. దీనికి తోడు మంగళవారం కావటంతో భక్తులు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలి వచ్చి స్వామి వారిని దర్శించుకుంటున్నారు. ఆలయానికి భక్తులు పోటెత్తడంతో ట్రాఫిక్‌ స్తంభించింది. ఆలయ పరిసరాల్లో ఎక్కడ చూసినా వాహనాల రద్దీ నెలకొంది. సుమారు 50 వేలకుపై భక్తులు ఆలయానికి వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.