Telugu News

హైదరాబాద్ లో వంశీరామ్ బిల్డర్స్ అదినేత **బి.సుబ్బారెడ్డి – పుట్టిన రోజు వేడుకలు..

**  కోవిడ్ అంక్షలు నేపథ్యంలో సాధారణ విధముగా పుట్టిన రోజు వేడుకలు..

0

హైదరాబాద్ లో వంశీరామ్ బిల్డర్స్ అదినేత పుట్టిన రోజు వేడుకలు..
**  కోవిడ్ అంక్షలు నేపథ్యంలో సాధారణ విధముగా పుట్టిన రోజు వేడుకలు..

(హైదరాబాద్ – విజయంన్యూస్):-
వంశీరామ్ బిల్డర్స్ అధినేత, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బి.సుబ్బారెడ్డి 52వ పుట్టిన రోజు వేడుకలను మంగళవారం సంస్థ సిబ్బంది ఘనంగా నిర్వహించారు.

హైదరాబాద్ లోని వంశీరామ్ బిల్డర్స్ ప్రధాన కార్యాలయంలో మేనేజర్లు, సిబ్బంది నడుమ ఘనంగా పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి కేక్ కట్ చేయగా, ఉద్యోగులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

దీంతో సుబ్బారెడ్డి వారికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ నెల్లూరులో జన్మించిన నేను చదువు అయిపోయిన తరువాత బిజినెస్ చేసేందుకు, ప్రజలకు అతి తక్కవు ధరలోనే మంచి హౌజ్ ఇవ్వాలి, మంచి స్థలాన్ని ఇవ్వాలనే లక్ష్యంతో హైదరాబాద్ వచ్చి రియల్ ఎస్టెట్ రంగంలో అడుగు పెట్టడం జరిగిందన్నారు.

ఈ మేరకు వంశీరామ్ బిల్డర్స్ ప్రారంభమై ప్రజల మన్నన్నలను అందుకుంటోందని, తన సక్సస్ కి కారణం తన సతీమణి జ్యోతి  మరియు తన సంస్థలో పనిచేసే ఉద్యోగులు, మనపై ప్రజలు పెట్టుకున్న విశ్వాసమేనని అన్నారు. నన్ను ఇంతలా ప్రోత్సహిస్తున్న ప్రజలందరికి రుణపడి ఉంటానని హామినిచ్చారు.

ఈ పుట్టిన రోజు వేడుకల సందర్భంగా వంశీరామ్ బిల్డర్స్ పేరుతో ఉన్న కంపెనీని ”వంశీరామ్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమెటేడ్” గా మార్చడం జరిగింది.

ఈ కార్యక్రమంలో వంశీరామ్ సంస్థ సిబ్బంది తదితరులు హాజరైయ్యారు.

also read :- స్వామి వివేకానంద యువతకు మార్గదర్శి… ఆదర్శం..