Telugu News

వనమా రాఘవ ను తక్షణమే అరెస్ట్ చేయాలి..

ఎమ్మెల్యే గా వనమా వెంకటేశ్వరరావు రాజీనామా చేయాలి...

0

వనమా రాఘవ ను తక్షణమే అరెస్ట్ చేయాలి..
ఎమ్మెల్యే గా వనమా వెంకటేశ్వరరావు రాజీనామా చేయాలి…
సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావులపల్లి రాంప్రసాద్……

( చండ్రుగొండ- విజయo న్యూస్ ):-

పాల్వంచలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవ కీచకపర్వానికి రామకృష్ణ కుటుంబం మొత్తం చనిపోవడానికి కారణమైన వనమా రాఘవ ను ప్రభుత్వం తక్షణమే అరెస్ట్ చేయాలని.. సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావులపల్లి రాంప్రసాద్ అన్నారు

also read ;-మంత్రివర్యులు #సత్యవతి రాథోడ్ని మర్యాదపూర్వకంగా కలిసిన జారే ఆదినారాయణ……….
రాఘవ నీచమైన రాజకీయాలకు సమాజం తలదించుకునే పరిస్థితి నెలకొంది అని.. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజలపై కీచకపర్వాన్నీ చూపెడుతున్న రాఘవకు సమాజంలో స్థానము లేదని. ఎమ్మెల్యే పదవికి వనమా ఒక్క నిమిషం కూడా అర్హుడు కాదని తక్షణమే రాజీనామా టిఆర్ఎస్ పార్టీ చేయించాలని అన్నారు…
ఈ ప్రకటన విడుదల చేసిన వారిలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కల్లూరి వెంకటేశ్వరరావు. సి.పి.ఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తమ్మళ్ల వెంకటేశ్వరరావు. రావులపల్లి రవికుమార్. సిపిఐ నాయకులు ఆకోజు సునిల్ కుమార్.సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.