Telugu News

వనమా రాఘవ రిమాండ్

బెయిల్ నిరాకరించిన న్యాయస్థానం

0

వనమా రాఘవ రిమాండ్
== బెయిల్ నిరాకరించిన న్యాయస్థానం
== 14 రోజుల పాటు రిమాండ్ విధించిన కోర్టు
(ఖమ్మం ప్రతినిధి-విజయంన్యూస్);-
కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవ కు కొత్తగూడెం కోర్టు రిమాండ్ కు అదేశించింది. 14 రోజుల పాటు రిమాండ్ లో ఉండాలని సూచించింది. ఆయనకు బెయిల్ ను నిరాకరించింది. పాత పాల్వంచకు చెందిన రామకష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ఏ2గా ఉన్న వనమా రాఘవేంద్ర ఈనెల 3 నుంచి పరారిలో ఉన్నారు. కాగా భద్రాద్రికొత్తగూడెం పోలీసులు నాలుగు రోజుల పాటు గాలించి చివరికి శుక్రవారం రాత్రి భద్రాద్రికొత్తగూడెం జిల్లా శివారు దమ్మపేట సమీపంలో పోన్ సిగ్నల్ ద్వారా పట్టుకున్నట్లు ఆ జిల్లా ఎస్పీ సునిల్ దత్ తెలిపారు.

alsso read :-రౌడీషీటర్లను పక్కన పెట్టుకొనేది మీ నాయకులే

కాగా రాఘవాను శుక్రవారం రాత్రి అరెస్టు చేసిన పోలీసులు శనివారం ఉదయం 11గంటల వరకు విచారణ చేపట్టారు. అనంతరం స్థానిక కోర్టులో మెజిస్ట్రేట్ ముందు హాజరపరచగా, న్యాయవాధుల వాధనల అనంతరం వనమా రాఘవాకు 14 రోజుల పాటు రిమాండ్ ను విధిస్తూ తీర్పు చెప్పింది. దీంతో భద్రాద్రికొత్తగూడెం పోలీసులు ఖమ్మం సబ్ జైలుకు తరలించారు. 14 రోజుల అనంతరం మరోసారి ఈ కేసు విచారణకు రానుంది.