వనమా రాఘవకు మరో షాక్..
* విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసిన మణుగూరు ఏఎస్పీ..
(మణుగూరు-విజయం న్యూస్)
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవకు మరో షాక్ తగిలింది. పుండుమీద కారం పడినట్లుగా ఇప్పటికే పాల్వంచ కు చెందిన రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య విషయంలో పలు సెక్షన్లపై కేసులు కాగా, ఆయన్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు గాలిస్తుండగా, మరో కేసుపై మణుగూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. 2021లో నమోదైన ఓ కేసుకు సంబంధించి ఈరోజు మధ్యాహ్నం 12:30గంటలలోగా విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు.
also read :-వనమా రాఘవ నా భార్యను కోరాడు.. ఎలా పంపగలను?: రామకృష్ణ సెల్ఫీ వీడియో వైరల్
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవకు మరో షాక్ తగిలింది. పుండు మీద కారం పడినట్లుగా పాల్వంచ కు చెందిన రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ఇప్పటికే పికలలోతు కష్టాల్లో ఉన్న వనమా రాఘవకు మరో కష్టం వచ్చిపడింది. రామకృష్ణ వీడియో బయటపడిన తరువాత వనమా రాఘవేంద్ర పై ఉన్న పాత కేసులను తవ్వే పనిలో పోలీసులు నిమగ్నమైనట్లు తెలుస్తోంది.. ఇప్పటికే వనమా రాఘవపై అనేక చోట్ల అనేక కేసులు ఉన్నప్పటికీ అధికార బలంతో వాటిని మూసేసే ప్రయత్నం చేయగ పోలీసులు కూడా సహాకరించినట్లు తెలుస్తోంది. కాగా పరిస్థితి మారడం,సీన్ రివర్స్ కావడంతో పోలీసులు పాత కేసుల ఫైల్స్ బూజు దులుపుతున్నట్లు తెలుస్తోంది..
also read :-జమ్మూకాశ్మీర్ ఎన్ కౌంటర్ …ముగ్గురు జైషే ఉగ్రవాదులు హతం.
అందులో భాగంగానే వనమా రాఘవ పై 2021లో నమోదైన ఓ కేసుకు సంబంధించి మణుగూరు ఏఎస్పీ శభరీష్ శుక్రవారం నోటీసులు జారీ చేశారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో ఏఎస్పీ శభరీష్ స్వయంగా వనమా రాఘవ ఇంటికి వచ్చి నోటీసులు ఇంటికి అంటించినట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 12:30గంటలలోగా విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. మరీ ఆయన అచూకికోసం 8బృంధాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో గాలింపు చేపట్టిన పోలీసులు..ఈ విషయంపై మణుగూరు పోలీసులు కూడా వెతికేందుకు ఎన్ని టీమ్ లను పెడతారో..? మొత్తానికి వనమా రాఘవ పరిస్థితి కుడితిలో పడిన ఎలుకలా అయింది..