?అటవీ శాఖ పట్టుకున్న వాహనాలు అగ్నికి ఆహుతి
?అకస్మాత్తుగా చెలరేగిన మంటలు
?ఆలస్యంగా వచ్చిన అగ్నిమాపక వాహనం
(ఇచ్చోడ విజయం న్యూస్) :
అక్రమంగా కలప స్మగ్లింగ్ చేస్తు పట్టుబడిన వాహనాలు శుక్రవారం అగ్ని ప్రమాదం సంభవించి అగ్నికి ఆహుతి అయ్యాయి. ఇచ్చోడలోని కవ్వాల్ టైగర్ జోన్ కార్యాలయంలోని ఆవరణలో నిల్వ ఉంచిన వాహనాలకు అకస్మాత్తుగా మంటలు అంటుకోవడంతొ అటవీశాఖ సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఇచ్చోడ అగ్నిమాపక కార్యాలయానికి సమాచారం ఇచ్చారు.అగ్నిమాపక వాహనం ఆలస్యంగా రావడంతో మంటలు వాహనాలకు అంటుకొన్నాయి.అగ్నిమాపక వాహనం వచ్చే లోపే మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. కార్యాలయానికి చుట్టూ ప్రహరీ గోడ లేకపోవడంతో ఆయా దుకాణాల వారు చెత్త చెదారం వాహనాల సమీపంలోనే వేయడంతో చెత్తకు నిప్పు అంటుకొని మంటలు చెలరేగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
also read :-పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యూహాత్మక నిర్ణయం
సాధారణంగా పట్టుబడిన వాహనాలను టీంబర్ డిపో తరలిచాల్సిఉండగా ఏళ్ళ తరబడి అధికారులు నిర్లక్షయంగా వదిలివేయడం చుట్టూ ఎలాంటి రక్షణ లేకపోవడం వల్లనే ఈ ప్రమాదం సంభవించoదని అంటున్నారు. పట్టుకున్న వాహనాలను ఎప్పటికప్పుడు వేలం పాటలు నిర్వహించాల్సిఉండగా వేలం పాటలు జరగక పోవడం తో వాహనాలను కార్యాలయం ఆవరణలోనే ఏళ్ళ తరబడి మురుగుతున్నాయి. దీనితో ప్రభుత్వ ఆదాయానికి గండి ఏర్పడుతుంది.ఈ అగ్నిప్రమాదంలో జరిగిన నష్టాన్ని అధికారులు అంచనా వేస్తున్నారు.