Telugu News

ఎన్ని కష్టాలు వచ్చినా ఎర్రజెండాను విడని నేత వెంకట్ రెడ్డి

సిపిఐ జాతీయ సమితి సభ్యులు భాగం హేమంత్ రావు

0

ఎన్ని కష్టాలు వచ్చినా ఎర్రజెండాను విడని నేత వెంకట్ రెడ్డి

== ధైర్యశాలి సంగ బత్తుల వెంకటరెడ్డి

== సంస్మరణ సభలో సిపిఐ నేతలు

== సిపిఐ జాతీయ సమితి సభ్యులు భాగం హేమంత్ రావు

(కూసుమంచి-విజయం న్యూస్) 

ఎన్ని కష్టాలు వచ్చినా ఎర్రజెండాని వదలని ధైర్య శాలి సంగబత్తుల వెంకటరెడ్డి అని *సిపిఐ జాతీయ సమితి సభ్యులు భాగం హేమంత రావు కొనియాడారు*. గురువారం కూసుమంచి మండలం గైగోళ్ళపల్లి గ్రామంలో సిపిఐ సీనియర్ నాయకులు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులు *సంగబత్తుల వెంకటరెడ్డి సంస్మరణ సభ సిపిఐ జిల్లా సమితి సభ్యులు గుండెపొంగు మల్లేష్ అధ్యక్షతన* జరిగింది. తొలుత వెంకటరెడ్డి చిత్రపటానికి సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్, వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు పూలమాలలేసి రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో బాగం హేమంతరావు మాట్లాడుతూ.. తన చిరుప్రాయంలో 12 సంవత్సరాల వయసులో కమ్యూనిస్టు పార్టీకి ఆకర్షతుడు అయిన నాటినుండి 97 సంవత్సరాల కాలంలో మరణించేంత వరకు కూడా సిపిఐ ని వదలకుండా పోరాడిన ధైర్యశాలి ధీరుడు సంగబత్తుల వెంకటరెడ్డి అని అన్నారు. తాను విద్యార్థి సంఘంలో పనిచేస్తున్న నాటినుండి మరణించే వరకు ఆయనను గమనిస్తూ వస్తున్నానని ఏనాడు ఎవరి మీద ఏ రకమైన విమర్శ కూడా ఆయన చేయలేదన్నారు. ఎన్నికల సమయంలో పెద్ద పెద్ద నాయకులు వచ్చి వాళ్ళ పార్టీకి సపోర్టు చేయాలని అడిగిన పై పార్టీ నిర్ణయాన్ని తప్పలేమని సున్నితంగా చెప్పి తిరస్కరించేవాడు. *సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్* మాట్లాడుతూ కమ్యూనిస్టు నాయకులు ఏ విధంగా ఉండాలో తెలియచెప్పిన వెంకటరెడ్డి జీవితమే యువతకు ఆదర్శం అన్నారు. 1959వ సంవత్సరంలోనే ఆయన సర్పంచిగా ఎన్నికైన , సొసైటీ డైరెక్టర్ గా పోటీ చేసి గెలిచిన విధానాన్ని పరిశీలిస్తే ప్రజలకు ఆయనకు ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తుందన్నారు. *సిపిఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ మహమ్మద్ మౌలానా* మాట్లాడుతూ తనతోపాటు 1962 లో వెంకటరెడ్డి ఆరున్నర సంవత్సరాలు పాటు జైల్లో ఉన్నాడని, జైల్లో ఖైదీలతో పాటు అధికారులు కూడా ఆయనను మెచ్చుకునే వారన్నారు. జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా ఆయన గ్రామంలో అడుగుపెట్టకుండా ఉండటానికి అప్పటి పెత్తందారులు ప్రయత్నం చేశారని, ప్రజల మద్దతుతో ఆయన గైగోళ్ళపల్లి గ్రామానికి వచ్చారన్నారు. దాదాపు 300 ఎకరాల బంజర భూములను పేద ప్రజలకు పంచడానికి ఆయన చేసిన పోరాటం మరవలేనిది అన్నారు. 1975 వ సంవత్సరంలో మరలా ఆయన్ని కుట్ర చేసి ఒక హత్య కేసులో ఇరికించి జైలుకు పంపించి ఆయన జైల్లో ఉన్న సమయంలో ఇంటిని మొత్తం లూటీ చేసిన ఏమాత్రం భయపడటం కానీ బాధపడటం కానీ చూడలేదన్నారు . జైలు నుండి విడుదలైన వెంకటరెడ్డిని చంపటానికి ప్రయత్నిస్తున్నారని తెలిసి ఆయన కాపాడటానికి గైగల్లపల్లి గ్రామ ప్రజలు వంతులు వేసుకొని కాపలా ఉండి రక్షించారని ఆయన గుర్తు చేశారు. 1980వ సంవత్సరంలో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో రెండవసారి 1500 పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలిచారని ఆయన తెలియజేశారు. *సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేష్* మాట్లాడుతూ ఓర్పుకు సహనానికి ప్రతిరూపం వెంకటరెడ్డి అని కొనియాడారు. ప్రస్తుతం ఉన్న యువత ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. చిన్న వారిని సైతం మర్యాదగా ఆప్యాయంగా పిలిచేవాడని ఆయన గుర్తు చేశారు. తాను యువజన సంఘ నాయకుడుగా ఉన్న సమయంలో వెంకటరెడ్డి తో పరిచయం ఏర్పడిందని ఆనాటి నుండి నేటి వరకు ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని నడుస్తున్నానన్నారు. గైగోళ్లపల్లి గ్రామ ప్రజలు మరలా గ్రామపంచాయతీ ఎన్నికల్లో సిపిఐ పార్టీని గెలిపిస్తేనే వెంకటరెడ్డికి ఘనమైన నివాళులర్పించినట్లు అవుతుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో *సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సింగు నరసింహారావు, అజ్మీర రామ్మూర్తి, తాటి వెంకటేశ్వర్లు, తోట రామాంజనేయులు*, *కర్నాటి భాను ప్రసాద్, మెడకంటి వెంకటరెడ్డి, రావి శివరామకృష్ణ, జిల్లా సమితి సభ్యులు ఉన్నం రంగారావు*, *తాటి నిర్మల, బానోతు రామకోటి, చెరుకుపల్లి భాస్కర్, మెడకంటి పెద్ద వెంకటరెడ్డి, మారిశెట్టి వెంకటేశ్వర్లు, నంబూరి శంకర్రావు*, *సిపిఎం సీనియర్ నాయకులు కోరట్ల పాపులు, సంగ బత్తుల వెంకటరెడ్డి కురుమారులు వినోధర్ రెడ్డి, దేవేందర్ రెడ్డి*, *ఉపేందర్ రెడ్డి సీపీఐ కూసుమంచి మండల కార్యదర్శి భూక్య నరసింహ , మండల సహాయ కార్యదర్శి జిల్లా లింగయ్య, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా నాయకుడు తిమ్మిడి హనుమంతరావు*, *కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మట్టే గురవయ్య, సిపిఐ గైగొల్లపల్లి గ్రామ శాఖ కార్యదర్శి తేలు పిచ్చయ్య* , *లాల్ సింగ్ తండా కార్యదర్శి భూక్యా శ్రీకాంత్ , సంధ్య తండా కార్యదర్శి సుక్య నాయక్ , నాయకులు జిల్లా శంకర్, జిల్లా సైదులు, జిల్లా నాగరాజు , ధరావత్ మల్సూర్, భూక్యా నెహ్రూ, జిల్లా లాల్*, తదితరులు పాల్గొన్నారు.