టీఆర్ఎస్ ఆధ్వర్యంలో కలెక్టర్‌ని కలిసిన బాధితులు
( భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో – విజయం న్యూస్ )
చర్ల తహశీల్దార్ వైఖరి వలన తీవ్ర ఇబ్బంది పడుతున్నామంటూ మండలానికి చెందిన పలువురు సోమవారం టీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌ని కలిసి తమ గోడు చెప్పుకున్నారు. తహశీల్దార్ మూలంగా తాము వివక్షకు గురై కులం, ఆదాయం సర్టిఫికెట్లు, కళ్యాణలక్ష్మి పథకం కోల్పోయామంటూ పలువురు బాధితులు కలెక్టర్ వద్ద మొరబెట్టుకున్నారు. టీఆర్ఎస్ చర్ల మండల కార్యదర్శి సోయం రాజారావు, చర్ల పీఏసీఎస్ చైర్మన్ పరుచూరి రవికుమార్, ఎస్‌ఎన్‌పురం పీఏసీఎస్ అధ్యక్షుడు శ్రీనివాసరాజు, మండల రైతుబంధు అధ్యక్షుడు కొసరాజు రాజా, చర్ల సర్పంచ్ కాపుల కృష్ణార్జునరావుల నాయకత్వంలో తహశీల్దార్ బాధితులంతా కొత్తగూడెం వెళ్ళి చర్ల తహశీల్దార్‌పై కలెక్టర్‌కి పిర్యాదు చేశారు.
also read :-అధికారుల నిర్లక్ష్యం వలన ఉపాధి మహిళ నిండు ప్రాణం పోయింది…!
కళ్యాణలక్ష్మి చెక్కులు వెనక్కి తిప్పి పంపిన విషయంపై పిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు. ఎస్సీ మాలకు ఎస్‌టీ, ఎస్‌సి మాదిగకి మాల కులం సర్టిఫికెట్లు ఇచ్చినట్లు ఆధారాలతో పిర్యాదు చేశారు. స్థానిక గిరిజనులను గుత్తికోయలుగా మార్చి రికార్డులకు ఎక్కించి ఎస్‌టి కులం సర్టిఫికెట్లు ఇవ్వకుండా వారి పిల్లల జీవితాలతో చెలగాటమాడుతున్న తహశీల్దార్ వైఖరిపై పిర్యాదు చేసినట్లు తెలిపారు. పిర్యాదులు అన్నింటిపై విచారించి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు బాధితులు తెలిపారు. కలెక్టర్‌ని కలిసిన వారిలో ఎంపీటీసీ మిడియం శోభారాణి, సర్పంచ్‌లు దుబ్బా కవిత, అలవాల పార్వతి, కన్నారావు, కుంజా కమల, టీఆర్ఎస్ నాయకులు ఐనవోలు పవన్‌కుమార్, పందిల్లపల్లి రాధాకృష్ణమూర్తి, ఇరసవడ్ల రాము, కాపుల నాగరాజు, సూర్యనారాయణరాజు, రామరాజు, దుబ్బా సమ్మయ్య తదితరులు ఉన్నారు..