Telugu News

ఖమ్మం చేరుకున్న విక్టరీ వెంకటేష్

== స్వాగతం పలికిన మంత్రి పొంగులేటి, రాయల, కాంగ్రెస్ నేతలు

0

ఖమ్మం చేరుకున్న విక్టరీ వెంకటేష్

== స్వాగతం పలికిన మంత్రి పొంగులేటి, రాయల, కాంగ్రెస్ నేతలు

== సాయంత్రం ఖమ్మం, కొత్తగూడెం లో రోడ్ షో

(ఖమ్మం ప్రతినిధి -విజయం న్యూస్)

సినీ యాక్టర్ విక్టరీ వెంకటేష్ కమాన్ చేరుకున్నారు. ఖమ్మం పార్లమెంట కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ మంగళవారం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రోడ్ షో కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా ఈ కార్యక్రమానికి స్టార్ క్యాంపెనర్ గా సినీ హీరో విక్టరీ వెంకటేష్ హాజరవుతున్నారు. అందులో భాగంగానే హైదరాబాద్ నుంచి ఖమ్మం కు మంగళవారం మధ్యాహ్నం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసానికి చేరుకోగా రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, గిడ్డంగుల శాఖ చైర్మన్ రాయల నాగేశ్వరావు, మరో చైర్మన్ మువ్వా విజయ్ బాబు ఘనంగా స్వాగతం పలికారు. విక్టరీ వెంకటేష్,  మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కాంగ్రెస్ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డి ఈరోజు ఖమ్మం లో జరిగే రోడ్ షో కార్యక్రమానికి హాజరవుతున్నారు. సాయంత్రం ఐదు గంటలకు మయూరి సెంటర్ నుంచి జడ్పీ సెంటర్ వరకు రోడ్ షో కార్యక్రమం జరగనుంది.