Telugu News

సీఎం కేసీఆర్ కు విక్రమార్కుడే టార్గెటా..?

మధిరలో గులాబీ జెండా గెలుపే లక్ష్యమా..?

0

సీఎం కేసీఆర్ కు విక్రమార్కుడే టార్గెటా..?

== మధిరలో గులాబీ జెండా గెలుపే లక్ష్యమా..?

== హ్యాట్రిక్ హీరో విజయాన్ని అడ్డుకునే ప్రయత్నమా..?

== నెక్స్ట్ ఎన్నికలే టార్గెట్ గా పథకాలు మంజూరు చేస్తున్నారా..?

== దళితబంధును అసరాగా చేసుకుంటున్న టి.సర్కార్

== హస్తంకు పట్టున్న మండలాలే టార్గెట్

== ఇంటింటా పథకాన్ని అమలు చేసే యోచన

== బీసీ బంధు అమలులో వేగం పెంచిన ప్రభుత్వం

== సీఎం మాస్టర్ ప్లాన్ ను తిప్పికొడుతున్న కాంగ్రెస్ నేత

== ప్రతి అంశాన్ని తమ వైపు మల్చుకుంటున్న సీఎల్పీ నేత

 సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను  సీఎం కేసీఆర్ టార్గెట్ చేశారా..? ఆయన వరస విజయాలను అడ్డుకునే పయత్నం చేస్తున్నారా..? మధిరలో గులాబీ జెండాను ఎగురవేసే పనిలో నిమగ్నమైయ్యారా..? అందుకే ట్రబుల్ షూటర్ రంగంలోకి దిగారా..?

ఇది కూడా చదవండి:- పాలేరుకు ‘తుమ్మల’.. ఖమ్మంకు ‘పొంగులేటి’..?

సర్కార్ పథకాలను అసరగా చేసుకుని ఓటర్ల మేథస్సుపై దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారా..? అంటే నిజమేనని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.. దేశంలోనే రాజకీయ చాణుక్యుడిగా పేరు గాంచిన సీఎం కేసీఆర్.. మరోసారి తన చాణుక్యతను బయటపెట్టే పనిలో పడినట్లు తెలుస్తోంది..? అందుకు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోబోతుంది..? ఎలాంటి ప్రణాళికను రచించబోతుంది..? భట్టి విక్రమార్కను ఏ విధంగా ఓడించే ప్రయత్నాలు చేయబోతుందో..? ‘విజయం’ తెలుగు దినపత్రిక అందించే ప్రత్యేక కథనం..

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

తెలంగాణ రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీకి ప్రాణం పోసిన ఏకైక నాయకుడు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమైన నాయకులు పార్టీ వీడుతున్నప్పటికి ఎదరక..బెదరక దీరుడై నిలబడిన ఆయన పార్టీని ముందుకు నడిపించాడు..

ఇది కూడా చదవండి:- కామ్రెడ్లతో కాంగ్రెస్ దోస్తి..బీఆర్ఎస్ తో కుస్తి

ఒక వైపు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తూ పార్టీని బలోపేతం చేస్తుంటే.. మరో వైపు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తన మార్ఖీజంతో పార్టీని బలోపేతం చేస్తున్నారు. ఇలా ఇద్దరు కలిసి జోడేద్దుల వలే నిలబడి రాష్ట్రంలో పార్టీకి పునర్వైభవం తీసుకొచ్చారనే చెప్పాలి.. అట్టడుగుకు పడిపోయిన కాంగ్రెస్ పార్టీని నిలబెట్టిన ఘనత కూడా ఈ ఇద్దరికే దక్కుతుంది.. ఆ పద్దతే బీఆర్ఎస్ పార్టీ అధినేతకు నచ్చనట్లుంది.. అందుకే కాంగ్రెస్ కు రెండు ప్రాణవాయువులైన భట్టి, రేవంత్ లను ఓడిస్తే కాంగ్రెస్ పతనం ఖాయమని భావిస్తున్న సీఎం కేసీఆర్ ఆ విధంగా కసరత్తు మొదలు పెట్టారనే చెప్పాలి. ఇప్పటికే 2018 ఎన్నికల్లో రేవంత్ రెడ్డి విజయాన్ని అడ్డుకున్న సీఎం కేసీఆర్, రాబోయే ఎన్నికల్లో ఇద్దరిని గెలవకుండా చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లుగా తెలుస్తోంది..

ఇది కూడా చదవండి:- తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్

ఈ మేరకు సీఎం కేసీఆర్ రాజకీయ చతురతను ప్రదర్శిస్తున్నారు.. ప్రభుత్వ పథకాలను అసరాగా చేసుకుని నిరుపేద దళితులకు గాలం వేసే పనిలో నిమగ్నమైయ్యారు.. దళితుల సంక్షేమం కోసం అమలు చేసిన దళితబంధు పథకాన్ని అసరగా చేసుకుని మధిర నియోజకవర్గంలో భట్టి విక్రమార్క విజయాన్ని అడ్డుకునే ప్రయత్నం జరుగుతున్నట్లు తెలుస్తోంది..

== ప్రభుత్వ పథకాలే అసరగా

తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ రాజకీయ కోణంలోనే ప్రభుత్వ పథకాలు అమలు చేస్తుండటం చూస్తున్నాం. హుజురబాద్ ఉప ఎన్నిక సమయంలో అత్యవసరంగా తెరపైకి వచ్చిన దళితబంధు పథకం  సీఎం కేసీఆర్ ఓట్ల రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేశారు. రాజకీయ శత్రువులుగా భావించే ఈటెల రాజేందర్ ను ఓడించడమే లక్ష్యంగా దళితులపై గురిపెట్టిన సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని అమలు చేయగా, హుజురబాద్ నియోజకవర్గం పాటు మధిర, తుంగతుర్తి మరో రెండు మూడు నియోజకవర్గాల్లో దళితబంధు పథకాన్ని అమలు చేశారు. ప్రతి నియోజకవర్గంలో ఒక మండలాన్ని రోల్ మోడల్ గా ఎంచుకున్న సీఎం కేసీఆర్ నేరుగా రాజకీయ శత్రువు అయిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గాన్ని ఎంపిక చేసి అక్కడ కాంగ్రెస్ పార్టీకి బలంగా ఉన్న చింతకాని మండలంలో దళితబంధు పథకాన్ని అమలు చేశారు. ప్రతి గ్రామంలో ఈ పథకాన్ని అమలు చేసి సక్సెస్ సాధించారు. కాగా చింతకాని మండలంతో పాటు మధిర నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి మరింత బలం పెరిగినట్లైంది..

ఇది కూడా చదవండి:- షెడ్యూల్ విడుదలతోనే  కోడ్ అమలు

ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వాసం పెరిగింది.. బీఆర్ఎస్ పార్టీ పై సానుకూల స్పందన వచ్చింది.. అనూహ్యంగా బీఆర్ఎస్ బలం పుంజుకుంది. దీంతో సీఎం కేసీఆర్ మరో ప్రయత్నం చేసే పనిలో పడ్డారు.

== భట్టి విక్రమార్కే టార్గెట్..?

రాష్ట్రంలో అత్యంత కీలక నేతగా ఎదిగిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను నివారిస్తే బీఆర్ఎస్ కు తిరుగుండదని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.. అందులో భాగంగానే సీఎల్పీనేత భట్టి విక్రమార్కను సీఎం కేసీఆర్ టార్గెట్ చేసినట్లుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అందులో భాగంగానే మధిర నియోజకవర్గ ప్రజలను బీఆర్ఎస్ కాకా పట్టే పనిలో పడ్డారు. ఇప్పటికే చింతకాని మండలంలో సూపర్ సక్సెస్ సాధించిన దళితబంధు పథకాన్ని అసరగా చేసుకుని మరో ప్రయత్నం చేయబోతుంది.. కాంగ్రెస్ పార్టీ పూర్తి బలంగా ఉన్న బోనకల్ మండలాన్ని టార్గెట్ చేసిన సీఎం కేసీఆర్, అక్కడ దళితులందరికి దళితబంధు పథకాన్ని అమలు చేసే పనిలో పడింది..

ఇది కూడా చదవండి:- రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే : పొంగులేటి

చింతకాని మండలంలో ఇంటింటా దళితబంధు పథకాన్ని అమలు చేయగా, సక్సెస్ అయ్యింది. అంతే కాకుండా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నియోజకవర్గం పై గురిపెట్టిన ప్రభుత్వం మరోసారి బోనకల్ మండలాన్ని టార్గెట్ గా చేసుకుంది.. అందులో భాగంగానే బోనకల్ మండలంలోని అన్ని గ్రామాలకు దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నట్లు స్వయానా ఐటీ, పురపాలక శాఖామంత్రి కె.తారాకరామారావు ప్రకటించారు. ఎందుకంటే బోనకల్ మండలంలో దళితులు అధికంగా ఉన్నారు.. వారందరు కాంగ్రెస్ వైపు ఉంటారనేది జగమెరిగిన సత్యం. అందుకే సీఎం కేసీఆర్ వ్యూహత్మకంగా బోనకల్ మండలాన్ని వెంచుకుని, అక్కడ కాంగ్రెస్ పార్టీని దెబ్బతిసే పనిలో నిమగ్నమైయ్యారు. ఈ మేరకు రాబోయే అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందుగానే బోనకల్ మండలంలో దళితబంధు పథకాన్ని అమలు చేయాలని టి.సర్కార్ భావిస్తోంది.. అందులో భాగంగానే ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ ఆధ్వర్యంలో  సర్వే పనులను వేగవంతం చేశారు. ఇంటింట సర్వే చేస్తున్నారు. అతికొద్ది రోజుల్లోనే అర్హుల జాబితాను ప్రకటించే ప్రయత్నంలో జిల్లా కలెక్టర్ ముమ్మరంగా పర్యటిస్తున్నారు.

== బీఆర్ఎస్ ఎత్తులను తిప్పికొడుతున్న భట్టి

రాజకీయాల్లో అత్యంత అపరచాణిక్యుడిగా పేరుగాంచిన సీఎం కేసీఆర్ తన ఆలోచనలకు తిరుగు ఉండదు.. ఆయన ఎదైనా అనుకున్నాడంటే కచ్చితంగా చేసి నిలిచిగెలుస్తుండటం ఆయన నైజం.

ఇది కూడా చదవండి:- కేటీఆర్  నోరు జాగ్రత్త: సీఎల్పీ నేత భట్టి

అందులో భాగంగానే మధిర నియోజకవర్గంపై కన్నేసిన సీఎం కేసీఆర్, భట్టి విక్రమార్కను ఓడించేందుకు  రాజకీయ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. కానీ ఓటమి ఎరుగని అపర దీరత్వం కల్గిన నేత సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క సీఎం కేసీఆర్ వ్యూహాలను తిప్పికొడుతున్నారు. ప్రభుత్వం ఏ పథకం అమలు చేసిన తను ఓన్ చేసుకుంటున్నారు. ప్రభుత్వంపై విమ్మర్శలు చేస్తూనే తాను ఉంటేనే ప్రజలకు ప్రభుత్వ పథకాలు వస్తున్నాయనే విధంగా క్రియేట్ చేస్తున్నారు. తన వల్లనే ప్రభుత్వ పథకాలు ప్రజలకు వస్తున్నాయనే విధంగా ప్రజల ఆలోచనలను మార్చే ప్రయత్నంలో సక్సెస్ సాధిస్తున్నారు. అందుకే సీఎం కేసీఆర్ ఎత్తుగడలను చిత్తు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

== రంగంలోకి ట్రబుల్ షూటర్

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క రాజకీయ చతురితను గుర్తించిన సీఎం కేసీఆర్ అతన్ని ఓడించేందుకు కావాల్సిన ప్రయోగత్మక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే దళితబంధు, బీసీ బంధు పథకాలతో పాటు అభివద్ది పథకాలను అమలు చేసినప్పటికి భట్టి రాజకీయ చతురతను తగ్గించలేకపోతున్నారు. భట్టిని ఓడించాలంటే బీఆర్ఎస్ ఎన్నో ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. అందుకే  సీఎల్పీ నేతను ఓడించేందుకు ట్రబుల్ షూటర్ రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది..

ఇది కూడా చదవండి:- ఓట్ల కోసం కేసీఆర్ ది దొంగ కపట నాటకం: భట్టి విక్రమార్క

ఒక వైపు మధిర నియోజకవర్గాన్ని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు ఇంచార్జ్ ఇవ్వగా, ట్రబుల్ షూటర్ రంగంలోకి దిగితే మరింత పట్టు సాధించవచ్చని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.. అందుకే అతి త్వరలోనే ట్రబుల్ షూటర్ మధిర నియోజకవర్గంలో పర్యటించే అవకాశం ఉంది.

మొత్తానికి రాష్ట్రంలోనే ప్రతిపక్ష పార్టీల్లో కీలక నాయకులను ఓడించాలనే లక్ష్యంగా అడుగులేస్తున్న సీఎం కేసీఆర్ ను దీటుగా ఎదుర్కొంటూ విజయం వైపు అడుగులేస్తున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను ఎలా నిలువరిస్తారో..? మధిరలో ఎలా గెలుస్తారో..? వేచి చూడాల్సిందే..?