Telugu News

గ్రామ బహిష్కరణ..రాజ్యాంగ విరుద్ధం

==  ఆదివాసి సీనియర్ నాయకుడు పూనెం సాయి

0
గ్రామ బహిష్కరణ..రాజ్యాంగ విరుద్ధం.
==  ఆదివాసి సీనియర్ నాయకుడు పూనెం సాయి
నూగురు వెంకటాపురం,నవంబర్ 1(విజయం న్యూస్):
ఎర్రబోరు గ్రామ ఆదివాసీలను గ్రామ బహిష్కరణ చేయడం రాజ్యాంగ విరుద్ధమని ఆదివాసీ సీనియర్ నాయకుడు పూనెం సాయి దొర అన్నారు.
ఆదివాసి యువ నాయకుడు మడకం రవి అధ్యక్షతన నూగురు కాలనీలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో దొర పాల్గొని మాట్లాడారు. 5వ షెడ్యూల్ ప్రకారంగా అడవి, నీరు, భూమిపై సర్వ హక్కులు ఆదివాసిలయేనని అన్నారు.ఆదివాసులను గ్రామ బహిష్కరణ చేసే నైతిక హక్కు తెలంగాణ ప్రభుత్వానికి లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అడవి హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేసి ఆదివాసీలందరూ అడవి హక్కు పత్రాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతాల నుండి రాజకీయ పార్టీలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం వస్తే ఆదివాసులకు పోడు హక్కు పత్రాలను ఇస్తానని,ఇప్పుడు హామీని బురదలో కలిపారని ఆరోపించారు. ఎర్రబోరు గ్రామ ఆదివాసీల గ్రామ బహిష్కరణ వెనక్కి తీసుకోవాలన్నారు. ఆదివాసులకు రక్షణ కల్పించాలని కోరారు.  ఈ సమావేశంలో బాబు, పార్ధు, మోహన్ సూర్యం, నరేష్, తదితరులు పాల్గొన్నారు.