ఇసుక లారీలను ఆపిన గ్రామస్తులు
? మోతే,తాళగొమ్మూరు రాంప్ ల లారీలను ఆపిన గ్రామస్తులు ? అధిక లోడుతో, అధిక స్పీడ్ తో రాత్రి పగలు తేడా లేకుండా తిరుగుతున్నాయని ఆరోపణ
ఇసుక లారీలను ఆపిన గ్రామస్తులు
? మోతే,తాళగొమ్మూరు రాంప్ ల లారీలను ఆపిన గ్రామస్తులు
? అధిక లోడుతో, అధిక స్పీడ్ తో రాత్రి పగలు తేడా లేకుండా తిరుగుతున్నాయని ఆరోపణ
(బూర్గంపహాడ్ -విజయం న్యూస్ )
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మోతే, తాళ్లగొమ్మూరు ఇసుక రాంప్ ల లారీలను నైట్ 8 గంటలకు అడ్డుకున్న గ్రామస్తులు. రాత్రి పగలు తేడా లేకుండా రాంప్ ల నుండి అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ మధ్యకాలంలోనే నైట్ సమయంలో అధిక లోడ్ తో అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీ డికొని 4 గేదెలు చనిపోయాయని గ్రామస్తులు తెలిపారు.అధిక లోడ్, అధిక స్పీడ్ తో వెళ్తు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వక్తం చేస్తున్నారు.
also read :- హమాలీల పై తప్పుడు ప్రచారాన్ని ఖండించండి. అఖిలపక్ష కార్మిక సంఘాలు .
అర్ధరాత్రి సైతం భారీ వాహనాల సహాయంతో ఇసుక రవాణా జరుగుతుందనే దీన్ని ఆపాల్సిన టిఎస్ఎండిసి అధికారులు చోద్యం చూస్తూ ఉన్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు గోపిరెడ్డి రమణ రెడ్డి మరి కొంతమంది టిఆర్ఎస్ నాయకులు, స్థానికులు టిఎస్ఎండిసి సంబంధించిన ఉన్నతాధికారికి సమాచారం ఇవ్వగా సదరు అధికారి సానుకూలంగా స్పందించక పొగ తమతో దురుసుగా మాట్లాడి క్రాస్ రోడ్ వద్ద విలేఖర్లకు ఏమి జరిగిందో మీకు అలాగే జరుగుతుందని తమని బెదిరించాడని గోపిరెడ్డి రమణ రెడ్డి అన్నారు. టిఎస్ఎండిసి అధికారులు స్పందించి రాంప్ నిర్వహణను పకడ్బందీగా జరపాలని స్థానికులు కోరుతున్నారు .
also read :-అటవీ హక్కు చట్టాలను ఉల్లంఘిస్తున్న ప్రభుత్వం