సీసీ కెమెరాలతో గ్రామాలు సురక్షితం
(ఖమ్మం ప్రతినిధి – విజయంన్యూస్)-
సురక్షితమైన గ్రామాల కోసం ప్రతి ఒక్కరూ భాగస్వామ్యమై సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకొవాలని వైరా సిఐ వసంతకుమార్ అన్నారు. వైరా ఏఎస్పీ స్నేహ మెహ్రా పర్యవేక్షణలో నేనుసైతం,కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా వైరా డివిజన్ కొణిజర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో కాచారం గ్రామాన్ని సందర్శించారు. నేర రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాడ0 ఖమ్మం పోలీస్కమీషరేట్ లక్ష్యమని, గ్రామల్లో కొత్త వ్యక్తులు కదలికలు,నేరాలకు పాల్పడే వ్యక్తులను గుర్తించటం,చోరీల నివారణకు సీసీ కెమెరాలు దోహదపడుతాయని సిఐ తెలిపారు.
గ్రామ ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములై సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల
రక్షణతో పాటు ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు
అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాల ఉపయోగపడతాయి.
మాస్క్.. తప్పనిసరి
ఒమైక్రాన్ వేరియంట్ వేగంగా విస్తరిస్తున్న నేపధ్యంలో వైరా ప్రాంతాల్లో ప్రజలు ఖచ్చితంగా మాస్క్ ధరించాలని లేకుంటే జరిమానా వెస్తామని సిఐ తెలిపారు. వైరస్ పై ఇప్పటికే స్ధానిక ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.
కార్యక్రమంలో కొణిజర్ల ఎస్సై పాల్గొన్నారు.
also read :-శ్రీశైలం ఘాట్రోడ్లో విషాదం..