Telugu News

ఖమ్మంలో నేడు వినాయక నిమజ్జనం

రెండు రోజుల పాటు జరగనున్న నిమజ్జన ప్రక్రియ

0

ఖమ్మంలో నేడు వినాయక నిమజ్జనం

== రెండు రోజుల పాటు జరగనున్న నిమజ్జన ప్రక్రియ

== భారీగా బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు

== ఖమ్మం నగరంలో ట్రాఫిక్ అంక్షలు

 (ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

నవరాత్రుల పాటు అత్యంత వైభవంగా, అంగరంగవైభవంగా పూజలందుకున్న గణనాథులకు భక్తులు బైబై చెప్పే సమయం రానే వచ్చింది.. భక్తులందరు భక్తిశ్రద్దలతో 9 రోజుల పాటు పూజలు చేసిన గణనాథులను బుధవారం నిమజ్జనం చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని భక్తులు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి ఏడాది ఒక్క రోజు నిమజ్జనం కార్యక్రమం ఉండగా, ఈ ఏడాది మాత్రం రెండు రోజుల పాటు నిమజ్జనం జరిగే అవకాశం ఉంది.  కొందరు నవరాత్రుల పాటు పూజలు చేసిన భక్తులు 10 రోజు నిమజ్జనం చేసే అవకాశం ఉండగా, మరికొందరు వినాయకుడ్ని ప్రతిష్ట చేసిన రోజు నుంచి 10 రోజులు పూర్తి చేసుకుని 11 వ రోజు నిమజ్జనం చేయనున్నారు. అందుకే కొందరు బుధవారం నిమజ్జనం చేస్తే, మరి కొంత మంది 11వ రోజు నిమజ్జనం చేసే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: ఖమ్మం లో ట్రాఫిక్  ఆంక్షలు

మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని పట్టణ కేంద్రాల్లో,  భద్రాచలం, పర్ణశాల గోదావరి పరిశర ప్రాంతాల్లో గోదావరిలో, మున్నేరు, ఆకేరు, తాళీపేరుతో పాటు ఆయా చెరువుల్లో గ్రామాల్లో ఉన్న చెరువుల్లో, వాగుల్లో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయనున్నారు. ఖమ్మం మున్నేరులో భారీగా వినాయక నిమజ్జనం కార్యక్రమం జరగనుంది..  అందుకు గాను ఖమ్మం పోలీస్ కమీషనర్ ఆధ్వర్యంలో భారీగా పోలీస్ బందోబస్తును నిర్వహిస్తున్నారు.ఖమ్మం మున్నేరు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ ఆధ్వర్యంలో అన్ని శాఖలాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వినాయక నిమజ్జన ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. సోమవారం కలెక్టర్, పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్. వారియర్ తో కలిసి, కాల్వఒడ్డు, నాయుడుపేట, ప్రకాశ్ నగర్ లలోని నిమజ్జన పాయింట్ల వద్ద ఏర్పాట్లను క్షేత్ర స్థాయిలో తనిఖీ చేసి, అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిమజ్జన పాయింట్ల వద్ద పూర్తి రక్షణచర్యలు తీసుకోవాలని అన్నారు. లైటింగ్, క్రేన్లు, రిలీజింగ్ క్లాoప్ లు, బోట్లు, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలన్నారు.  పబ్లిక్ అడ్రస్ సిస్టం, అంతరాయం లేని విద్యుత్ సరఫరా ఉండాలన్నారు. ప్రతి పాయింట్ వద్ద పోలీస్, మునిసిపల్, ఈతగాళ్లతో పాటు వాలంటర్ల ఏర్పాట్లు చేయాలన్నారు.

ఇది కూడా చదవండి: వచ్చే సాధారణ  ఎన్నికలకు ఏర్పాట్లు వేగంచేయాలి: కలెక్టర్

శోభాయాత్ర ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని, ఎక్కడా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడాలని తెలిపారు. నిమజ్జనం సజావుగా జరగడంతోపాటు, నిమజ్జనం తర్వాత విగ్రహాలతో సమస్యలు తలెత్తకుండా తగుచర్యలు చేపట్టాలన్నారు. ప్రత్యేక అధికారులు పటిష్ట పర్యవేక్షణ చేయాలన్నారు. శోభాయాత్ర, నిమజ్జనం లలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని ఆయన తెలిపారు.

== నేడు ఖమ్మంలో శోభయాత్ర

ఖమ్మం నగరంలోని గాంధీచౌక్ లో భారీ విగ్రహాలను ఏర్పాటు చేయగా, ఆ విగ్రహాలను బుధవారం భక్తులు శోభయాత్ర నిర్వహించనున్నారు. అందుకు గాను ఉదయం 10.30గంటల నుంచి శోభయాత్ర ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 3గంటలకు ఖమ్మం నగరంలోని మట్టి వినాయక విగ్రహం వద్ద రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, పార్లమెంటరీ పార్టీ నేత నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతామదు, రాజ్యసభ సభ్యులు గాయత్రి రవి, ఎమ్మెల్యేలు   జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్, సీపీ విష్ణు వారియర్, నగర కమీషనర్ సురబీ, మేయర్, సుడా చైర్మన్ లు వినాయక విగ్రహా నిమజ్జన శోభయాత్రను జెండా ఊపి ప్రారంభించనున్నారు. ముందుగా మంత్రి పువ్వాడ  మట్టి విగ్రహం వద్ద పూజలు చేయనున్నారు. అనంతరం శోభయాత్రను ప్రారంభించి, ఆ తరువాత మున్నేరు వద్ద నిమజ్జనాన్ని పరిశీలించనున్నారు. అధికారులకు పలు సూచనలు చేయనున్నారు. శోభాయాత్రను నగరంలోని చర్చి కాంపౌండ్, వెంకటగిరి వంతెన మీదగా, ప్రకాష్ నగర్, కాల్వొడ్డు, వైపును సాగేలా రూట్ మ్యాఫ్ ఖరారు చేశారు.

== కమాండ్ కంట్రోల్ ద్వారా పర్యవేక్షణ

వినాయకుడి నిమజ్జనం సందర్భంగా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్.వారియర్ తెలిపారు. నిమజ్జనం ఏర్పాట్లను మంగళవారం పరిశీలించిన ఆయన బందోబస్తు సమీక్షించారు. కమాండ్ కంట్రోల్ రూమ్ కు సీసీ కెమోరాలను అనుసధానం చేసి నిమజ్జనం, శోభయాత్రలను పర్యవేక్షిస్తామని తెలిపారు. ఖమ్మంతో పాటు వైరా, సత్తుపల్లి, ఖమ్మం రూరల్ పరిధిలోని జరిగే నిమజ్జనాన్ని కూడా జిల్లా పోలీస్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ ద్వారా పర్యవేక్షణ చేస్తున్నామని వెల్లడించారు.

ఇది కూడా చదవండి: మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టడంలో చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

అలాగే ఖమ్మం నగరంలోని మున్నేరుకు ఇరువైపుల భారీ బందోబస్తు నిర్వహిస్తున్నామని, ప్రణాళిక బద్దంగా వినాయక నిమజ్జన కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రజలందరు, భక్తులందరు పోలీసులకు సహాకరించాలని కోరారు. అలాగే గణేష్ శోభయాత్ర, నిమజ్జనం సందర్భంగా భారీ బందోబస్తును నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ముగ్గురు అడిషనల్ డీసీపీలు, ఐదుగురు ఏసీపీలు, 20మంది సీఐలు, 35 మంది ఎస్సైలు, 55 మంది ఏఎస్ఐలు, హెడ్ కానిస్టెబుళ్లు, 250 మంది పోలీస్ కానిస్టెబుళ్లు, 60 మంది హోంగార్డులు తో పాటు సెక్టార్ ఏఆర్ ఫోర్స్, ఎన్సీసీ కేడెట్లను నియమించినట్లు తెలిపారు. మున్నేరు వద్ద, చెరువుల వద్ద నిమజ్జన కేంద్రాల వద్ద గజఈతగాళ్లను ఏర్పాటు చేసినట్లు సీపీ విష్ణు ఎస్.వారియర్ తెలిపారు.

==మూడు చోట్ల నిమజ్జనం

ఖమ్మం నగరంలోని రెండు చోట్ల నిమజ్జనంకు ఏర్పాట్లు చేశారు. మున్నేరు పక్కనే కాల్వోడ్డులోని హిందు వైకుంఠదామాం పక్కన రెండు వైపుల, అలాగే ఖమ్మం రూరల్ మండలంలోని జలగం నగర్ వద్ద మున్నేరు వైపున నిమజ్జనం ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ప్రకాష్ నగర్ నిమజ్జనం కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. కాల్వోడ్డు వైకుంఠదామం వద్ద 10 క్రేన్లతో, జలగం నగర్ వద్ద 3 క్రేన్లతో, ప్రకాష్ నగర్ వద్ద మూడు క్రేన్లతో నిమజ్జన ఏర్పాట్లు చేస్తున్నారు.

== భారీగా ఏర్పాట్లు

జిల్లా వ్యాప్తంగా బుధవారం నిమజ్జనం కార్యక్రమం ప్రారంభమవుతుడటంతో పోలీసులు, అధికారులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. నిమజ్జన కేంద్రాల్లో భారీకేట్లను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే పట్టిష్ట బందోబస్తును నిర్వహించడం తో పాటు భారీ సంఖ్యలో ప్లడ్ లైట్లు, తెప్పలు ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 100 మంది గజఈతగాళ్లను మూడు సిప్ట్ లుగా పనిచేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.