Telugu News

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: డి ఎల్ పి ఒ

అక్రమ లే అవుట్ లలో ఫ్లెక్సీలో ఏర్పాటు

0
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: డి ఎల్ పి ఒ
?అక్రమ లే అవుట్ లలో ఫ్లెక్సీలో ఏర్పాటు
?పంచాయతీ కార్యదర్శు పై మండిపడ్డ 
ఇచ్చోడ డిసెంబర్ 01 (విజయం న్యూస్ ) :
అక్రమ లే అవుట్లు వేస్తే ఉపేక్షించబోమని గురు వారం డిఎల్పిఓ ధర్మారాణి హెచ్చరించారు. ఇచ్చోడ మండలంలోని దుబార్ పేట్ గ్రామపంచాయతీ పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా వేసిన లేఅవుట్లను మండల పంచాయతీ అధికారి రమేష్, గ్రామ సర్పంచ్ చాహకటి అభిమాన్యు, పంచాయతీ కార్యదర్శి పరమేశ్వర్ తో కలిసి పరిశీలించారు. అక్రమంగా వెలసిన లేఅవుట్ లలో గ్రామపంచాయతీ సిబ్బందితో ఫ్లెక్సీలను పెట్టించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామ పంచాయతీ నుండి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని ఎవరైన అక్రమంగా లే అవుట్లను ఏర్పాటు చేస్తే చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. అలాగే ఇంతకు ముందే చెప్పాను కదా వారికి ఎందుకు నోటీసులు ఇవ్వలేదని పంచాయతీ కార్యదర్శి పరమేశ్వర్ పై డిఎల్పిఓ మండిపడ్డారు. వెంటనే బ్లేడు ట్రాక్టర్ ను పిలిపించి అక్రమంగా లేఅవుట్లలో వేసిన రోడ్లను తొలగించాలని సూచించారు. లేనియెడల వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.