మానవత్వాన్ని చాటుకున్న వైరా ఏఎస్పీ స్నేహ మెహ్రా.
పోలీసులు ప్రజల రక్షణకే కాదు వారి కష్టసమయంలోనూ తోడుగా నిలుస్తూ..తమ ఔదార్యాన్ని చాటుకుంటారని నిరుపించారు వైరా ఏఎస్పీ స్నేహ మెహ్రా ఐపిఎస్
మానవత్వాన్ని చాటుకున్న వైరా ఏఎస్పీ స్నేహ మెహ్రా.
(వైరా -విజయం న్యూస్)
పోలీసులు ప్రజల రక్షణకే కాదు వారి కష్టసమయంలోనూ తోడుగా నిలుస్తూ..తమ ఔదార్యాన్ని చాటుకుంటారని నిరుపించారు వైరా ఏఎస్పీ స్నేహ మెహ్రా ఐపిఎస్.
పోలీసులు ప్రజల రక్షణకే కాదు వారి కష్టసమయంలోనూ తోడుగా నిలుస్తూ..తమ ఔదార్యాన్ని చాటుకుంటారని నిరుపించారు వైరా ఏఎస్పీ స్నేహ మెహ్రా ఐపిఎస్.
విధి నిర్వహణలో ఎన్నో రకాల పనివత్తిడి ఉన్నప్పటికీ…రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయలతో రోడ్డు ప్రక్కన అపస్మారక స్ధితిలో పడివున్న వ్యక్తిని చూసిన ఏఎస్పీ తమ సిబ్బంది సహకారంతో తన వాహనంలో ఎక్కించి మధిర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించి మానవత్వం చాటుకున్న ఘటన తాజాగా రాత్రి బోనకల్లు మండలం, కలకోటా గ్రామ సమీపంలోని రాపల్లే క్రాస్ రోడ్లపై జరిగింది.
పోలీస్ స్టేషన్ తనిఖీల్లో భాగంగా మధిర పోలీస్ స్టేషన్ సందర్శించిన వైరా ఏఎస్పీ స్నేహ మెహ్రా తిరుగు ప్రయాణంలో వైరా వెళ్తుండగా రాపల్లే క్రాస్ రోడ్ వద్ద రోడ్డు పక్కన గాయాలతో పడి ఉన్న వ్యక్తిని గుర్తించి హుటాహుటిన
తన వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి స్వయంగా తీసుకు వచ్చి వైద్య సేవలు అందేలా చోరవ తీసుకొన్నారు.
సమాచారం తెలుసుకొని ఆస్పత్రికి చేరుకున్న సీఐ మురళి పట్టణ మధిర ఎస్ఐ బాధితుల వివరాలు సేకరించారు. ఖమ్మం నగరానికి చెందిన ఉపేందర్ గా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.