Telugu News

కొత్తగూడెం నియోజకవర్గంలో పొంగులేటి పర్యటన

0

కొత్తగూడెం నియోజకవర్గంలో పొంగులేటి పర్యటన

 

కొత్తగూడెం : ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి కొత్తగూడెం నియోజకవర్గంలో మంగళవారం పర్యటించారు పర్యటనలో భాగంగా చుంచుపల్లి, కొత్తగూడెం మున్సిపాలిటీ లోని గ్రామాలను సందర్శించారు. చుంచుపల్లి మండలంలోని రాంపురము, అంబేద్కర్ నగర్ కాలనీ, పెనగడప, శ్రీనగర్ కాలనీ, మూలగూడెం, వనమానగర్, చండ్రుకుంట, గౌతంపూర్, రుద్రంపూర్, 4 ఇన్ క్లెన్ గ్రామాలు, కొత్తగూడెం మున్సిపాలిటీలోని రామవరం ప్రాంతాల్లో పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో ఇటీవల మృతిచెందిన పలువురు వ్యక్తుల కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. వివిధ ప్రమాదాల్లో గాయపడిన పలువురిని పరామర్శించారు. అదేవిధంగా అనారోగ్యంతో బాధపడుతున్న పలువురి పరామర్శించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆర్థికసాయాలను కూడా అందజేశారు. ఆయా ప్రాంతాల్లోని పలు దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. పలు శుభ కార్యక్రమాల్లోనూ పొంగులేటి పాల్గొన్నారు. ఈ పర్యటనలో పొంగులేటి వెంట డీసీసీబీ డైరెక్టర్ తుళ్ళూరి బ్రహ్మయ్య, ఊకంటి గోపాలరావు, తూము చౌదరి, ఆళ్ళ మురళి తదితరులు ఉన్నారు.

allsp read- పొంగులేటి మాటే మా బాట…!