Telugu News

పరామర్శలు-ఆశీర్వాదాలు

-ఖమ్మం నగరంలో మాజీ ఎంపీ పొంగులేటి పర్యటన

0

పరామర్శలు-ఆశీర్వాదాలు

-ఖమ్మం నగరంలో మాజీ ఎంపీ పొంగులేటి పర్యటన

(ఖమ్మం విజయం న్యూస్):-
ఖమ్మం: తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోమవారం ఖమ్మం నగరంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా 28వ డివిజన్ నాయకులు కొప్పెర ఉపేందర్ ఆధ్వర్యంలో ప్రకాశ్ నగర్ ప్రాంతాన్ని సందర్శించారు. అనారోగ్యంతో బాధపడుతున్న పలువురిని పరామర్శించి ఆర్థికసాయం అందజేశారు. ఇటీవల వివాహం చేసుకున్న జంటను ఆశీర్వదించారు. ధంసలాపురం కొత్తూరులో సిల్వరాజ్ ఇటీవల చనిపోగా వారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థికసాయం అందజేశారు. పుట్టకోటలో ఓర్సు వెంకన్న కుమారుని వివాహ రిసెప్షన్ వేడుకకు హాజరైయ్యారు.

also read ;-రాష్ట్రంలో ప్రజలకు అందుబాటులోనే అధికారులు

టీఆర్ఎస్ నాయకులు తాళ్లూరి రాము తల్లి ప్రథమ వర్ధంతి కార్యక్రమానికి హాజరై చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లర్పించారు. వివాహ వార్షికోత్సవ వేడుకను జరుపుకుంటున్న పీఎస్ఆర్యూత్ నాయకులు మొగిలిచర్ల సైదులు, నాగలక్ష్మి దంపతులను ఆశీర్వదించారు. నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని దీవించారు. వీటితోపాటు కృష్ణాపంక్షన్‌హాల్లో, బాలపేట తండాలో, రఘునాథపాలెం మండలం శివాయిగూడెంలో జరిగిన వివాహది శుభకార్యక్రమాలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. పట్టు వస్త్రాలను కానుకగా సమర్పించారు. ఈ పర్యటనలో పొంగులేటి వెంట తెరాస రాష్ట్ర నాయకురాలు మద్దినేని బేబి స్వర్ణకుమారి, కొణిజర్ల ఎంపీపీ గోసుమధు, కార్పొరేటర్ దొడ్డా నగేష్, తెరాస నగర నాయకులు దుంపల రవికుమార్, షేక్ ఇమామ్, చింతమళ్ల గురుమూర్తి, భీమనాథుల అశోక్ రెడ్డి, కానంగుల రాధాకృష్ణ, తోట ప్రసాద్, కాంపాటి రమేష్, వెనిగళ్ల నాగేశ్వరరావు, మందడపు రామకృష్ణారెడ్డి, కొంగర జ్యోతిర్మయి, చిరంజీవి,తంబి,ఆది, బాలపేట గోపి, ఎయిర్ టెల్ నరసింహారావు, బాలాజీ తదితరులు ఉన్నారు.

-ఉమ్మడి జిల్లాలోని ఆలయాలకు విరాళం….
భద్రాద్రికొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మండలం పాత కొత్తగూడెంలో వెంకటేశ్వరస్వామి దేవాలయానికి రూ. 25వేలు, బోనకల్ ముష్టికుంట్లలోని కాటమయ్య దేవాలయానికి రూ.25వేలు, సత్తుపల్లి మండలం బేతుపల్లిలోని కృష్ణునిగుడికి రూ.25వేలు, కామేపల్లి మండలం శ్రీరాంనగర్ తండాలోని అభయంజనేయస్వామి దేవాలయానికి రూ.25వేలను సోమవారం ఉదయం ఖమ్మంలోని క్యాంప్ కార్యాలయంలో విరాళంగా అందజేశారు. అదేవిధంగా పంపింగ్ వెల్ రోడ్డుకు చెందిన అరుణ్-పూజితలు ఇటీవల ప్రేమ వివాహం చేసుకోగా వారిని ఆశీర్వదించారు. పట్టు వస్త్రాలను కానుకగా అందజేశారు.

కొణిజర్లలో మాజీ ఎంపీ పొంగులేటి పర్యటన

కొణిజర్ల: తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోమవారం కొణిజర్ల మండలంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా తుమ్మలపల్లి గ్రామంలోని బండారు రామలక్ష్మణులు, బండారు కృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ బీరప్పస్వామి, కామరాతి అమ్మగార్ల కళ్యాణ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ నిర్వాహకులు పొంగులేటిని ఆలయ మర్యాదాలతో ఘనంగా సత్కారించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి అన్ని విధాల అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

also read :-కల్యాణలక్ష్మిపథకం ఆడబిడ్డకు వరం

కొణిజర్ల ఎంపీపీ గోసుమధు, సర్పంచ్ కమటాల రేణుక, టీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు కోసూరి శ్రీనివాసరావు, రాయల పుల్లయ్య, డేరాంగుల బ్రహ్మం, దొడ్డపునేని రామారావు, ఏలూరి శ్రీనివాసరావు, పొట్లపల్లి శేషగిరి, శీలం వెంకటరామిరెడ్డి, గోసు ఉపేందర్, సుడా డైరెక్టర్ బండారు కృష్ణ, మండల నాయకులు కనగంటి రావు, కొనకంచి మోషే, తేజావత్ మదన్, మోడు సురేష్, పొట్లపల్లి జేడయ్య, షేక్ జానీపాషా, రచ్చా రామకోటయ్య, సురభి వెంకటప్పయ్య, గుండ్ల కోటేశ్వరరావు, గడల నరేందర్ నాయుడు, చలగుండ్ల సురేష్, తేజావత్ బాబులాల్, కావూరి శ్రీనివాసరావు, కటుకూరి నరసింహారావు తదితరులు ఉ న్నారు.