23 వేల కుటుంబాలపై దయలేని ముఖ్యమంత్రి
❇️15 రోజులుగా ప్రయాస పడుతున్న వీఆర్ఏలు
❇️కూసుమంచిలో ప్రజా బంద ఐఎఫ్టియు,పిడిఎస్ యు, సిపిఎం నాయకుల సంఘీభావం
కూసుమంచి, ఆగస్టు8(విజయంన్యూస్)
కూసుమంచులో వీఆర్ఏల నిరవధిక సమ్మె 15 రోజుకు చేరింది. వీఆర్ఏలు ప్రజా సామాజిక సంఘాలను మద్దతుగా ఆహ్వానించారు. సిపిఐఎంఎల్ ప్రజాపంథా పాలేరు డివిజన్ కార్యదర్శి పుల్లయ్య, పిడిఎస్యు డివిజన్ కార్యదర్శి మురళీకృష్ణ, ఐ ఎఫ్ టి యు కార్యదర్శి రామదాసు, సిపిఎం నాయకులు తాళ్లూరి రవి సమ్మె శిబిరంలో పాల్గొని ప్రసంగించి వారి యొక్క పూర్తి సంఘీభావన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామస్థాయిలో వీఆర్ఏలు ప్రభుత్వానికి ప్రజలకు అనుసంధాన కర్తలుగా ఉన్నారని వారికి ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కోరారు. 15 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమని అన్నారు. కుటుంబంలో అందరికీ ఉద్యోగాలు కల్పించిన ముఖ్యమంత్రి తరతరాలుగా సేవలు చేస్తున్న23 వేల కుటుంబాలకు న్యాయం చేయలేకపోతున్నారని విమర్శించారు. మండల వీఆర్ఏలైన రియాజ్ భూపతి మాట్లాడుతూ 15 రోజులుగా ఎన్నో ప్రయాసలు పడుతూ సమ్మె చేస్తున్నప్పటికీ కనీసం ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి రాష్ట్ర జేఏసీతో చర్చించి మా సమస్యలను,పేస్కేల్ హామీని పరిష్కరించాలని లేనియెడల పంద్రాగస్టు తర్వాత సమ్మె కార్యాచరణ యుద్ధాన్ని తలపించేలా ఉంటుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మండల అధ్యక్ష కార్యదర్శులు ధారా శ్రీను, అన్వర్ ,రవికుమార్ ,అనిల్ మండల వీఆర్ఏలందరూ పాల్గొన్నారు.
allso read- జర్నలిస్టు న్యాయ పోరాట దీక్ష