వైరా మండలం రెబ్బవరంలో హత్య..
*తమ్ముడ్ని చంపిన అన్న*
*కుటుంబ కలహాలు నేపథ్యంలో హత్య..*
*పండుగ రోజున రెబ్బవరంలో విషాదం..
(వైరా-విజయం న్యూస్)
దీపావళి పండుగ రోజున వైరా మండలంలో విషాదం నెలకొంది.. తోడు పుట్టిన తమ్ముడ్ని,అన్న హత్య చేసిన సంఘటన వైరా మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వైరా మండలం రెబ్బవరం గ్రామంలో అక్రమ సంబంధం నెపంతో తమ్ముడిని అన్న హత్య చేశాడు. ఈ ఘటనతో వైరా మండలం ఉలిక్కిపడింది.వివరాల్లోకి వెళితే రెబ్బవరం గ్రామానికి చెందిన సాదం కృష్ణ భార్యతో తమ్ముడు సాదం నరేష్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడని కోపంతో అన్నయ్య తమ్ముడిని నరికి చంపాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది….
Allso read:- పాదయాత్ర లో డప్పు దరువేసిన సీతక్క