Telugu News

యువతా మేలుకో… రాజ్యాన్ని ఏలుకో: పొంగులేటి 

అసమర్థ, అవినీతి పాలనను అంటగట్టాలంటే రాజకీయాల్లోకి యువత రావాల్సిందే

0

*యువతా మేలుకో… రాజకీయాన్ని ఏలుకో: పొంగులేటి 

*- అసమర్థ, అవినీతి పాలనను అంటగట్టాలంటే రాజకీయాల్లోకి యువత రావాల్సిందే*

*- ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి*

*- ఎలక్షన్ కు ఆరునెలల ముందు గానీ నోటిఫికేషన్ వేయాలని గుర్తుకు రాదా…?*

*- పింక్ కలర్ చొక్కా తొడుక్కున్న వారికి విద్యాసంస్థల్లో అందలం*

*-మల్లా రెడ్డి, పల్లా రాజేశ్వర రెడ్డి, వరదా రెడ్డి విద్యాసంస్థలను యూనివర్సిటీలను చేసి కోట్లు కట్టబెడుతున్న ఘనత సీఎం కేసీఆర్ దే*
*- రాజకీయాల్లో యువత పాత్ర క్రియాశీలకం… అందుకే ఆహ్వానిస్తున్నా…!!

ఇది కూడా చదవండి:-;పొంగులేటి.. ఊ.. అంటారా..? ఊఊ అంటారా..?

(హైదరాబాద్-విజయం న్యూస్):

యువతా మేలుకో… రాజకీయాన్ని ఏలుకో అని ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. ఓ యువతా మేలుకో అనే పేరుతో మారబోయిన రఘునాధ్ యాదవ్ అధ్వర్యంలో హైదరాబాద్ కూకట్ పల్లి లోని శ్రీ గోదా కృష్ణా ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో పొంగులేటి మాట్లాడారు. తెలంగాణ వస్తే నిధులు వస్తాయని…

ఇది కూడా చదవండి:- నిరుద్యోగ యువతకు పొంగులేటి బంఫర్ ఆఫర్

నియామాకాలు జరుగుతున్నాయని ఇంకా అనేక రకాలుగా తెలంగాణ అభివృద్ధి జరిగి ప్రతి పేదవాడి కలలు ఎవైతే ఉన్నాయో అవన్నీ సాకారం అవుతాయని భావించి అనేకమంది యోధనయోధులు… కవులు… నాయకులు… విద్యావేత్తలు… ఉద్యోగులు…. అన్ని కులాల వారు… అన్ని మతాల వారు… అన్ని పార్టీల వారు… అన్ని ప్రాంతాల వారితో పాటు ప్రత్యేకంగా యూనివర్సిటీ విద్యార్థులు తెలంగాణ కోసం పోరాటం చేసి సాధించి తెచ్చుకుంటే ఇప్పుడు ఆ కలలన్ని కల్లాలుగానే మిగిలిపోయాయని… ఇదంతా సీఎం కేసీఆర్ పుణ్యమేనని ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో మంది బలిదానాలతో వచ్చిన తెలంగాణ ఫలాలను అర్హులకు దక్కకుండా చేసే ప్రయత్నం కల్వకుంట్ల కుటుంబం చేస్తుందని విమర్శించారు.

ఇది కూడా చదవండి:-  సీఎం కేసీఆర్ పై పోటీకి నేను సిద్దం: పొంగులేటి 

పింక్ చొక్కా తొడుక్కున్న వారిని విద్యాసంస్థల్లో అందలం ఎక్కించారన్నారని ఆగ్రహాం వ్యక్తం చేశారు. ప్రభుత్వ యూనివర్సిటీలను గంగలో కలిపి వారి పార్టీలో ఉన్న మల్లా రెడ్డి, పల్లా రాజేశ్వర రెడ్డి, వరదా రెడ్డిలు సహా అనేక మంది ప్రయివేటు విద్యాసంస్థలను ప్రయివేటు యూనివర్సిటీలు గా చేసి పేదవాడి కలాలను తుంగలోకి తొక్కారని విమర్శించారు. యూనివర్సిటీల ద్వారా వారు వేల కోట్ల రూపాయాలు దండుకుంటున్నారని ఆరోపించారు. యువతను మభ్య పెట్టి తెలంగాణ ఉద్యమంలో వారిని వినియోగించుకుని వారికి శఠగోపం పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో లక్షా 70 వేల ఉద్యోగాల ఖాళీల సంగతి ఏంటి అన్ని ప్రశ్నించారు. ఎలక్షన్ కు ఆరునెలల ముందుగాని నోటిఫికేషన్ వేయాలని గుర్తుకు రాదా..? కేసీఆర్ అంటూ ఘాటూ విమర్శలు చేశారు.

ఇది కూడా చదవండి:-  పొంగులేటి లక్ష్యం కేసీఆర్ ను దించుడే: ఈటెల
టీ ఎస్ పీ ఎస్ సి పేపర్ లీకేజీలో వారి కేబినెట్ కు చెందిన నేతలే ఉన్నప్పటికి వారిపై చర్యలు శూన్యం అన్నారు. ఉద్యోగాలు ఇవ్వాలనే చిత్తశుద్ది లేని కేసీఆర్ కు సరైన బుద్ధి చెప్పాలంటే రాబోవు రోజుల్లో రాజకీయాలను శాసించటానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉ న్న యువతా అంతా రాజకీయాల్లోకి రావాలని ఈ అసమర్థ, అవినీతి పారద్రోలాలని ఈ సందర్భంగా పొంగులేటి పిలుపునిచ్చారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు సభా ప్రాంగాణానికి విచ్చేస్తున్న పొంగులేటికి యువత ఘన స్వాగతం పలికి భారీ గజమాల తో సత్కరించింది.