Telugu News

వాకింగ్ చేస్తూ.. ఓట్లు అభ్యర్థించిన RRR

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘురాం రెడ్డి వినూత్న ప్రచారం

0

వాకింగ్ చేస్తూ.. ఓట్లు అభ్యర్థించిన RRR

– కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘురాం రెడ్డి వినూత్న ప్రచారం

(ఖమ్మం-విజయం న్యూస్)

కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డి గురువారం సాయంత్రం నగరంలోని గొరిల్లా పార్క్ సమీప వాకర్స్ ప్యారడైజ్ లో, ట్యాంక్ బండ్ వద్ద ఓట్లు అభ్యర్థించారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పువాళ్ల దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ తో కలిసి వాకింగ్ చేస్తూ.. అక్కడ వాకింగ్ చేస్తున్నవారిని పలకరిస్తూ… ఓట్లు అభ్యర్థించారు. అమ్మా..అక్కా.. అంటూ ఆప్యాయంగా మాట్లాడించారు. చేతి గుర్తుపై ఓటేసి.. తనను ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజా సంక్షేమ పాలన కోసం కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉందని వివరించారు.
== కాంగ్రెస్ కార్యాలయంలో ఎన్ఎస్ యూఐ సమావేశం..*
కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో ఎన్ ఎస్ యూ ఐ సమావేశానికి కాంగ్రెస్ ఖమ్మం లోక్ సభ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డి హాజరై మాట్లాడారు. విద్యార్థి నాయకులంతా తమ ప్రాంతాల్లో యువ న్యాయ్ పథకం గురించి వివరించి, చైతన్యం నింపి .. భారీ మెజారిటీకి కృషి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ నగర అధ్యక్షులు మహమ్మద్ జావిద్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య మాజీ కార్పొరేటర్ నాగండ్ల దీపక్ చౌదరి, మాజీ కౌన్సిలర్ పాలకుర్తి నాగేశ్వరరావు, నాయకులు కొప్పుల చంద్రశేఖర రావు, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మొక్కా శేఖర్ గౌడ్, సయ్యద్ హుస్సేన్, షేక్ అబ్దుల్ రెహ్మాన్, తదితరులు పాల్గొన్నారు.