Telugu News

ఆశావర్కర్లకు సంక్రాంతి కానుక

◆ ఆశ, హెల్త్‌ వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులకు గౌరవ వేతనం 30 శాతం పెంపు.

0

ఆశావర్కర్లకు సంక్రాంతి కానుక
◆ ఆశ, హెల్త్‌ వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులకు గౌరవ వేతనం 30 శాతం పెంపు.
◆ పుష్పగుచ్చం ఇచ్చి మంత్రి పువ్వాడ కు కృతజ్ఞతలు తెలిపిన ఆశా వర్కర్లు..
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
రాష్ట్రంలోని ఆశావర్కర్లకు, ఔట్ సోర్సింగ్ పబ్లిక్ హెల్త్ వర్కర్లు ప్రభుత్వం సంక్రాంతి కానుక ప్రకటించింది. రాష్ట్రంలోని ఆశ కార్యకర్తలకు, వివిధ మున్సిపాలిటీల్లో ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన పనిచేస్తున్న పబ్లిక్‌ హెల్త్‌ వర్కర్లకు, పారిశుద్ధ్య కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వేతనాలు పెంచింది. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే ఔట్‌సోర్సింగ్‌ వారికి కూడా పీఆర్సీని వర్తింపజేస్తామని సీఎం కేసీఆర్‌ గతంలో హామీ ఇచ్చారు. ఈ మేరకు వారి నెలవారీ గౌరవ వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం జిఓ నెం.1 జారీ చేస్తూ 30 శాతం పెంచుతూ ఈ సందర్భంగా ఖమ్మం మున్సిపాలిటీ పరిధిలోని ఆశా కార్యకర్తలు శనివారం రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గరిని మర్యాదపూర్వకంగా కలిసి పుషగుచ్ఛంలు అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.

also read :-★ పేదల బతుకులు ఛిద్రంచేస్తున్న బీజేపీ

ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్న అది ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని తీసుకుంటారని వివరించారు. ఈ చర్య వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 22,533 మంది పబ్లిక్‌ హెల్త్‌ వర్కర్లు, 7,271 మంది పారిశుద్ధ్య కార్మికులకు లబ్ధి చేకూరిందన్నారు. ఆశ కార్యకర్తలకు ప్రస్తుతం వారి పనితీరును బట్టి ఇన్సెంటివ్‌ రూపంలో ప్రభుత్వం గరిష్ఠంగా రూ.7,500 ఇస్తున్నదని, అయితే దానిని రూ.9,750కి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడంతో దాదాపు 30వేల మంది కుటుంబాల్లో వెలుగులు నింపారని అన్నారు. ఆశ కార్యకర్తలకు గతంలో రూ.6 వేల గౌరవ వేతనం ఉండగా, ప్రభుత్వం 2018లో 30 శాతం పెంచిందని, ఫలితంగా రూ.7,500కు పెరిగిందని తాజాగా మరో 30శాతం పారితోషికం పెంపు పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఆశ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారని వివరించారు. సీఎం కేసీఆర్‌ కార్మికులు, ఉద్యోగుల పక్షపాతి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కమర్తపు మురళి, ఆశ వర్కర్స్ టీఆర్ఎస్కేవీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ, జిల్లా అధ్యక్షురాలు బి.కరుణ, నగర కమిటీ అధ్యక్షురాలు కె అరుణ కుమారి, జి పద్మ, నర్సమ్మ, ధీన, అనసూర్య, ఈ.పద్మ నరాయనమ్మ, నాగమణి, నాగ రాణి, లక్ష్మీ, సైదాభి తదితరులు పాల్గొన్నారు.