Telugu News

పనోల్లు కావాలా, పగోల్లు కావాలా: హరీష్ రావు 

సీతారామ ప్రాజెక్టుతో ఖమ్మం డిక్షనరిలోనే కరువు ఉండదు

0

పనోల్లు కావాలా, పగోల్లు కావాలా: హరీష్ రావు 

== సీతారామ ప్రాజెక్టుతో ఖమ్మం డిక్షనరిలోనే కరువు ఉండదు

== పాలమూరు ప్రాజెక్ట్ ప్రజలకు పండుగ..ప్రతిపక్షాలకు దండగ

== పాలమూరు ప్రజల కరువు తీర్చే అతి పెద్ద ప్రాజెక్టు

== కాంగ్రెస్ 50ఏళ్లలో ఏం చేసింది

== తన్నులాట పార్టీ కాంగ్రెస్.. ప్రజల పార్టీ బీఆర్ఎస్

==    రాబోయే ఎన్నికల్లో ‘నోబెల్స్, గోబెల్స్’ మధ్య పోటీ

== అభివద్ది ఆగోద్దంటే కేసీఆర్  ను గెలిపించాలి

== ప్రజలు ఆలోచించండి..ప్రజల పార్టీని గెలిపించండి

== పిలుపునిచ్చిన వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు

== ఆర్టీసీ ప్రభుత్వఫరం చేయడం సంతోషంగా ఉంది : మంత్రి పువ్వాడ

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

ప్రజలకు మేలు చేసే పనులను చేపట్టే బీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ ఎప్పటికి పనోళ్లని, ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ది చేస్తుంటే ఓర్వలేక పగబట్టి ప్రతిసారి అడ్డుకునే పగోళ్లు ప్రతిపక్ష పార్టీలని, అందుకే పగోల్లు కావాలా..? పనోల్లు కావాలా..? ప్రజలే ఆలోచించుకోవాలని రాష్ట్ర అర్థిక, వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పిలుపునిచ్చారు.

ఇది కూడా చదవండి:- ఎమ్మెల్సీ కవితా కు ఈడీ నోటీసులు

ఖమ్మంలోని వైద్యకళాశాల భవనాన్ని ప్రారంభించేందుకు ఖమ్మంకు వచ్చిన మంత్రి హరీష్ రావు మమత కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వం లో విలినాన్ని ఆమోదిస్తూ నిర్ణయం తీసుకోవడం శుభపరిణామమని అన్నారు. నా ఆర్టీసి కార్మికులకు, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు. ఇది కేసీఆర్ ఇచ్చిన బహుమతి. మీ చిరకాల వాంఛ నెరవేర్చినది కేసీఆర్ అని అన్నారు. ఇక నుండి ఆర్టీసీ కార్మికులు కాదు వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులని పేర్కొన్నారు. ఆర్టీసీ కష్టకాలంలో ఉన్నసమయంలో సీఎం కేసీఆర్ ఆదుకుని వేలాధి కోట్ల రూపాయలను బడ్జెట్ ను విడుదల చేశావరని, ప్రస్తుతం సంస్థలో పనిచేస్తున్న ఆర్టీసీని ప్రభుత్వపరం చేయడం సంతోషంగా ఉందన్నారు.

ఇది కూడా చదవండి:- మీరు గర్వపడేలా  అభివృద్ది చేస్తా: మంత్రి పువ్వాడ

ఆర్టీసీ బిల్లును అసెంబ్లీ, శాసనమండలిలో అమోదించి గవర్నర్ కు బిల్లును పంపిస్తే అడ్డంకులు స్రుష్టించారని, అయినప్పటికి ధర్మం, న్యాయమే గెలుస్తుందనడానికి ఇదే నిదర్శనమన్నారు. ఇన్నాళ్లకైనా గవర్నర్  బిల్లున  ఇవాళ ఆమోదం తెలపడం సంతోషకరమని, దీంతో ఆర్టీసీ కార్మికులందరు ప్రభుత్వ ఉద్యోగులైయ్యారని అన్నారు. నాటి పాలకులు ఆర్టీసిని అప్పుల పాలు చేసి అడ్రస్ లేకుండా చేయాలని కుట్రలు పన్నారని అన్నారు. మా ప్రభుత్వం ఆర్టీసీకి కార్మికులకు పట్టం కట్టిందని,  ప్రభుత్వ ఉద్యోగులను చేసిందన్నారు. ఇకనుండి కార్మికులు కాదు వారు ప్రభుత్వ ఉద్యోగులని, అందుకు కార్మికులందరికి అభినందలు తెలిపారు.

== పాలమూరు ప్రాజెక్టు శాశ్వత పరిష్కారం

పాలమూరు ప్రాజక్టు మహుబూబ్ నగర్ జిల్లా ప్రజలకు శాశ్వత పరిష్కారమని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం హాయంలో మహుబూబ్ నగర్ జిల్లాలో పాలమూరు తోపాటు పలు ప్రాజెక్టులు పెండింగ్ లోనే ఉన్నాయని అన్నారు. పెండింగ్ ప్రాజెక్టులుగా నామకరణం చేసిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

ఇది కూడా చదవండి:- ఖమ్మంలో నలు దిక్కుల అభివృద్ది చేసి:మంత్రి పువ్వాడ

కానీ సీఎం కేసీఆర్ పెండింగ్ ప్రాజెక్ట్ లను భారీ బడ్జెట్ ను విడుదల చేసి రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చేశారని, తద్వారా లక్షల ఎకరాల వ్యవసాయభూములకు సాగునీటిని అందిస్తున్నారని తెలిపారు. ఇది సీఎం కేసీఆర్ ఘనతేనని అన్నారు. పాలమూరు ప్రాజెక్టు ను నేడు సీఎం కేసీఆర్ ప్రారంభించేందుకు సిద్దమైతే ప్రతిపక్ష పార్టీలు శకుని పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. గతంలో అనేక దఫాలుగా ప్రాజక్టులపై కోర్టుల్లో కేసులు వేస్తున్నారని, ట్రిబ్యునల్ వద్ద ఫిర్యాదుల చేస్తారని, ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులను అపేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. సాగు నీటి ప్రాజెక్టులను ప్రజలు పండగ లా భావిస్తే, ప్రతిపక్షాలు దండగ అంటున్నాయని ఆరోపించారు. పాలమూరు ప్రజల కరువు తీర్చే అతి పెద్ద ప్రాజెక్టు అని, కాళేశ్వరం కంటే చాలా పెద్ద ప్రాజెక్ట్ అని అన్నారు. పాలమూరు ప్రాజెక్ట్ దండగ  అంటున్న పార్టీలు దండగ అంటూ ప్రజలు చీదరించుకుంటున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిందన్నారు. నాడు అడ్డంకులు సృష్టించారు. ఇప్పుడు మళ్లీ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. మీరు పాలమూరు ప్రజలపై పగ సాధిస్తున్నారని విమ్మరించారు. కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలు ఎన్ని అడ్డంకులు స్రుష్టించినప్పటికి సీఎం కేసీఆర్ సంకల్ప బలం కిందా తుత్తినియం కావడం ఖాయమన్నారు.

ఇది కూడా చదవండి:- 16వేల పోడు పట్టాలిచ్చిన మొగోడేవ్వరైనా ఉన్నారా..?: మంత్రి 

ఆయన ప్రజల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా సాధనధీక్షతతో పనిచేస్తాడని, అందుకే ఎన్ని అడ్డంకులు వచ్చిన పాలమూరును పూర్తి చేసుకుని శుక్రవారం ప్రారంభించబోతున్నారని అన్నారు.

== పనోల్లు కావాలా..? పగోల్లు కావాలా..?

బీఆర్ఎస్ పార్టీ ప్రజల కోసం పనిచేస్తుందని, ఇప్పటికే అనేక ప్రాజెక్టులను నిర్మాణం చేసి ప్రజలకు అంకితం చేసిందని మంత్రి హరీష్ రావు తెలిపారు. విద్య,వైద్యం, ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో నిలిచిందన్నారు.  దేశంలో ఎక్కడ లేని విధంగా పోటీ పరీక్షల్లో తెలంగాణకు అద్భుతమైన ర్యాంకులు వస్తున్నాయని, కేంద్రమే ప్రకటించిందని అన్నారు. గ్రామీణ స్థాయి విద్యార్థులను సైతం కార్పోరేట్ విద్యను అందించేందుకు గురుకుల పాఠశాలలు, కళాశాలు, రెసిడెన్సీ, కస్తూరిభగాంధీ పాఠశాలలను ఏర్పాటు చేశామన్నారు. అందుకే ప్రతి పేదవిద్యార్థికి ఉన్నతమైన విద్యనభ్యసించే అవకాశం వచ్చిందన్నారు. అలాగే వైద్యం విషయంలో భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా 31 జిల్లాల్లో మెడికల్ కళాశాలను మంజూరు చేసిన ఏకైక రాష్ర్టం తెలంగాణ రాష్ట్రమేనని అన్నారు.

ఇది కూడా చదవండి:- ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధునిక సదుపాయాల కల్పన చేస్తున్నాం: మంత్రి

అంతేకాకుండా ఖమ్మం జిల్లాలోనే రెండు మెడికల్ కళాశాలలు, నర్సింగ్ కళాశాలను మంజూరు చేశామన్నారు. గతేడాది మంజూరు చేసి ఏడాది సమయంలోనే క్లాసులు ప్రారంభించిన ఘనత సీఎం కేసీఆర్ సర్కార్ కే దక్కిందన్నారు. తద్వారా ప్రతి ఏడాది 10వేల మంది వైద్యవిద్యార్థులు చదువుకునే అవకాశం వచ్చిందన్నారు. ఆటో డ్రైవర్ కొడుకు, కూలీ పిల్లలకు ఎంబీబీఎస్ సీట్లు ఉచితంగా వచ్చాయని అన్నారు. అంతకంటే ఇంకేం కావాలని రాష్ట్ర అభివద్ది జరిగిందనడానికి అని సంతోషం వ్యక్తం చేశారు.  దేశంలోని అన్ని రాష్ట్రాల్లో 57శాతం రిజల్ట్ వస్తే, తెలంగాణ వైద్యవిద్యార్థులకే 47శాతం మంచి ఫలితాలు రావడం సంతోషించదగ్గ విషమన్నారు. ప్రతి చిన్న ఆసుపత్రిని సైతం 50పడకల ఆసుపత్రిగా ఏర్పాటు చేసి, మౌళిక వసతులతో పాటు ఆసుపత్రికి క్వాలిటీ వైద్యులను ఏర్పాటు చేశామన్నారు. ఆ ఒక్క అవకాశం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే దక్కిందన్నారు.  అంతే కాకుండా సాగునీటి విషయంలో అనేక అద్భుతమైన నీటిప్రాజెక్టులను నిర్మాణం చేసి, కాలువలను తవ్వి చివరి ఎకరభూమికి సాగునీటిని అందించామని, తద్వారా దేశంలోనే అత్యధిక ధాన్యం ఉత్పత్తి అవుతున్న రాష్ట్రంగా నెంబర్ వన్ తెలంగాణ రాష్ట్రమేనని అన్నారు.  విద్యలో నెంబరవన్, వైద్యంలో నెంబర్ వన్, ధాన్యం ఉత్పత్తిలో నెంబర్ వన్, ఇంటింటికి తాగునీటిని ఇవ్వడంలో నెంబర్ వన్, రైతులకు రుణమాఫీ చేయడంలో నెంబర్ వన్, రైతు బంధు సహాయం అందించడంలో నెంబర్ వన్ అన్నింటిలో నెంబర్ వన్. ఇంతకంటే ఇంకేం కావాలి ప్రజలకు అంటూ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. కానీ ప్రతిపక్షాలకు అవి కనిపించడం లేదని, అబద్దాలు మాట్లాడటం, పనులు చేస్తుంటే అడ్డుపడటం, పగపట్టి కేసులు వేయడం చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ ను ఇంటి మనిషి అని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. మనకు పనోల్లు కావాలా, పగోల్లు కావాలా ప్రజలు ఆలోచించాలని కోరారు. బి ఆర్ ఎస్ కావాలి, కాంగ్రెస్ వద్దు అని ప్రజలు అంటున్నారని, ఇప్పటికే నిర్ణయించుకున్నారని అన్నారు.

== రాబోయే ఎన్నికలు ‘నోబెల్స్..గ్లోబెల్స్’ మధ్య పోటీ

బీఆర్ఎస్ పార్టీ ప్రజల సంక్షేమాభివృద్ది కోసం పనిచేస్తుంటే కావాలనే ప్రతిపక్షాలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని, ఇష్టానుసారంగా గ్లోబల్ ప్రచారం చేస్తున్నారని మంత్రి హరీష్ రావు విమ్మర్శించారు.  అందుకే రాబోయే ఎన్నికల్లో నోబెల్స్, గోబెల్స్ కి మధ్య పోటీ జరుగుతుందన్నారు. గోబెల్స్ ప్రచారం చేసే కాంగ్రెస్ నీ ప్రజలు కోరుకోరని, బిఆర్ఎస్ మరోసారి గెలుస్తుందని, హ్యట్రిక్ సీఎంగా కేసీఆర్ చరిత్ర తిరగరాయబోతున్నారని జోస్యం చెప్పారు. కౌరవుల లాగా వంద అబద్ధాలు ఆడినా మీ పక్క జన బలం లేదని, బీఆర్ఎస్ వైపు, సీఎం కేసీఆర్ వైపు జనబలం ఉందన్నారు.

50 ఏళ్లలో కాంగ్రెస్ ఎందుకు ప్రాజెక్టులు కట్టలేదని, ఎందుకు ఎన్నేళ్లపాటు నీళ్ళు ఇవ్వలేదు, కరెంట్ ఇవ్వలేదు. మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయలేదన్నారు. రైతుబంధు, రైతు రుణమాఫీ, రైతు బీమా, ఇంటింటికి నల్లా నీళ్లు ఎందుకు ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. మీకు పాలించడం చేతకాదని, పదవుల కోసం తన్నులాడుకోవడం, అడ్డగోలుగా అమ్ముకోవడం మాత్రమే తెలుసన్నారు. రైతులకు, ప్రజలకు ఆకలి అయినప్పడు కాంగ్రెస్ నేతలు అన్నం పెట్టలేదు,  కానీ నేడు గోరుముద్దలు తినిపిస్తం అంటే ప్రజలు నమ్ముతారా..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ కు చిత్తశుద్ది ఉంటే తెలంగాణలో పథకాలు ఉన్నట్లుగా ఛత్తీస్ గడ్, కర్ణాటక, రాజస్థాన్ లో అమలు చేయోచ్చు కదా అని ప్రశ్నించారు.  అక్కడ చేయలేనోళ్లు..ఇక్కడ చేస్తారంటా.?అంటూ విమ్మర్శించారు. గతంలో రైతులు ఎరువుల కోసం, విత్తనాల కోసం  తన్నులు తినేవారని, నీటి కోసం పోట్లాట పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హాయంలో తన్నుల సంస్కృతి ఉంటే, బీఆర్ఎస్ హాయంలో టన్నుల సంస్కృతి ఉందన్నారు. సీట్ల కోసం, పదవుల కోసం ఏమి జరగక ముందే కాంగ్రెస్ కొట్లదితున్నదని, మత కలహాలు సృష్టించి ఎంతకైనా దిగజార్చే పరిస్థితి కాంగ్రెస్ దని అన్నారు.

కాంగ్రెస్ హైకమాండ్ ఢిల్లీ ఉండే, ఇప్పుడు వయా బెంగళూరు అయ్యిందన్నారు. మాకు హైకమాండ్ ప్రజలని అన్నారు.

==ఖమ్మంప్రజల కరుణ కేసీఆర్ పై ఉండాలి

ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సీఎం కేసీఆర్ ఏది కావాలంటే అది అందిస్తున్నారని, భక్తరామదాసు లాంటి ప్రాజెక్టు, క్రిష్ణ,గోదావరిలను కలిపే సీతారామప్రాజెక్టులను మంజూరు చేసిన ఘనత సీఎం కేసీఆర్ దేనన్నారు. సీఎం కి ఖమ్మం పై ప్రత్యేక ప్రేమ. నాడు ఉద్యమ సమయంలో ప్రజలు గుండెకు హత్తుకున్నారు. అందుకే ఖమ్మం కరువు తొలగించాలని సీఎం కోరిక అని అన్నారు. ఖమ్మం జిల్లా అభివద్ది విషయంలో కూడా ఏం కావాలని మంత్రి పువ్వాడ అజయ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అడిగిన వెంటనే మంజూరు చేస్తున్నారని, అంతటి ప్రేమ ఖమ్మం జిల్లా ప్రజలపై సీఎం కేసీఆర్ కు ఉందన్నారు. ఖమ్మం ప్రజలు కూడా అలాంటి ప్రేమను చూపించాలని, 10కి పది స్థానాలను రాబోయే ఎన్నికల్లో గెలిపించాలని, తద్వారా ఖమ్మం జిల్లా మరింత అభివద్ది చెందుతుందన్నారు. సీతారామ ప్రాజెక్టు పనులు చివరి దశలో ఉన్నాయని, సీతారామ పూర్తి అయితే కరువు అనే పదం ఖమ్మం డిక్షనరీలో ఉండబోదని స్పష్టం చేశారు. వచ్చే వానాకాలం నాటికి కృష్ణా లో నీళ్ళు ఉన్న లేకున్నా గోదావరి జలాలు వస్తాయని, రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదన్నారు. ఈసారి క్రిష్ణా ప్రాజెక్టులలో నీటి సౌలభ్యం లేదని, తద్వారా నాగార్జున సాగర్ ఆయకట్టులో పంటలు సాగు చేయలేకపోయారని, బోర్ల కిందా రైతులు అరకొరగా పంటలను సాగు చేశారే తప్ప పూర్తి స్థాయిలో పంటలను సాగు చేయలేకపోయారని అన్నారు. కృష్ణా నది పరివాహక ప్రాంతం ఏపీలో క్రాప్ హాలిడే ప్రకటించారని తెలిపారు. అదే సీతారామప్రాజెక్టును పూర్తి చేసుకుంటే పాలేరు జలాశయం ద్వారా ఉమ్మడి జిల్లాకు సాగునీటిని అందించుకోవచ్చన్నారు.  ఈ కార్యక్రమంలో   ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర రెడ్డి, తాతా మధుసూదన్, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, మొచ్చా నాగేశ్వరరావు, వనమా వెంకటేశ్వరరావు, బానోతు హరిప్రియనాయక్,  మదన్ లాల్, బాలసాని లక్ష్మినారాయణ, మేయర్ పూనకొల్లు నీరజ,  జెడ్పి చైర్మన్ లింగాల కమలరాజ్, రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్య అధికారిణి డా. మాలతి, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ రత్న కుమారి,