Telugu News

అభివృద్ది లో వరంగల్ తూర్పు విక్టరీ.

ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు..

0

అభివృద్ది లో వరంగల్ తూర్పు విక్టరీ.

 భవిష్యత్ అంతా తూర్పుదే.అరవై ఏండ్లలో జరగని అభివృద్ది చేసి చూపించాం..ప్రజల కోసమే పనిచేస్తున్నాం.నియోజకవర్గాన్ని అద్బుతంగా అభివృద్ది చేస్తాం.

ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు..

-ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్.

(విజయం న్యూస్ వరంగల్):-

వరంగల్ రాజశ్రీ గార్డెన్ లో గత మూడేళ్ళలో వరంగల్ తూర్పులో జరిగిన అభివృద్ది& నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ.

– ఒక లారీ డ్రైవర్ కొడుకు,ఒక పేదింటి బిడ్డ ఈ ప్రాంత సమస్యలు తెలిసిన వ్యక్తి ఎమ్మెల్యే గా ఉంటే అభివృద్ది ఎలా జరుగుతుందో చూపిస్తున్నాం..Lముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కే.టీఆర్  నన్ను నగర అద్యక్షునిగా రెండుసార్లు,ఆర్టీసీ గౌరవ అద్యక్షుడిగా,మేయర్ గా,ఎమ్మెల్యే గా నాకు అవకాశం కల్పించారు.వారికి రుణపడి ఉంటాను..పార్టీ కోసం అనేక హోదాల్లో పనిచేసాం. తెలంగాణ ఉద్యమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపులను విజయవంతం చేసాం. వరంగల్ తూర్పు అభివృద్దికి గొప్ప బాటను వేస్తున్నాం.చరిత్రలో మునుపెన్నడూ లేని అభివృద్దిని చేసి చూపిస్తున్నాం.రాజకీయాలు ఎన్నికలప్పుడే ప్రజాసేవ శాశ్వతం,ప్రజల ఆశలు ఆశయాలకు అనుగుణంగా పని చేస్తున్నా.60 ఏండ్లలో జరగని అభివృద్దిని చేస్తున్నాం..వరంగల్ తూర్పు దిశ దశను మార్చుతున్నాం.వరంగల్ కే తలమానికంగా 2000 కోట్లతో సూపర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ముఖ్యమంత్రి కేసీఆర్  ఆశీర్వాదంతో ఈ నియోజకవర్గంలో నిర్మించుకుంటున్నాం..

ఇది దేశంలోనే అతిపెద్ద ఆసుపత్రి..తద్వారా జిల్లా ప్రజలతో పాటు చుట్టు పక్కల జిల్లాలకు మెరుగైన వైద్యానికి దోహదపడుతుంది..పేదలు రోగమస్తే హైదరాబాద్ ను ఆశ్రయించకుండా ఇక్కడే కార్పోరోట్ స్థాయి వైద్యం పేదలకు ఉచితంగా అందుతుంది.వరంగల్ తూర్పు తలరాతను మార్చేలా ముఖ్యమంత్రి కేసీఆర్,మంత్రి కేటీఆర్ గార్లను ఒప్పించి మెప్పించి వరంగల్ జిల్లాను ఏర్పాటు చేసుకున్నాం..జిల్లా ఏర్పాటు మాత్రమే కాకుండా జిల్లా కేంద్రాన్ని ఈ ప్రాంతంలోని పేదల ఇండ్ల నడుమ ఆజంజాయి మిల్లు గ్రౌండ్ లో ఏర్పాటు చేసుకుంటున్నాం..తద్వారా పరిపాలన భవనం ఇక్కడ ఏర్పాటై ప్రయాణ సౌకర్యాలు మెరగవుతాయి.చుట్టూరా ఉపాది అవకాశాలు లభిస్తాయి.వ్యాపారాలు మరింత అభివృద్ది చెందుతాయి.స్వయం ఉపాది మెరుగవుతుంది.దగ్గరలోనే ఉన్న ఖిలావరంగల్ టూరిజంలో అభివృద్ది చెందుతుంది.జిల్లా కేంద్రం ఇక్కడే ఉండటం ద్వారా పేదల ఆస్థి విలువ పెరుగుతుంది.భవిష్యత్ తరాలకు ఒక అద్బుతమైన నియోజకవర్గాన్ని అందించేలా కృషి చేసాం.

వరంగల్ లో ముంపు సమస్యను రూపుమాపేలా,శివనగర్ లాంటి ప్రాంతాలు తీవ్ర ముంపుకు గురవుతున్న తరుణంలో పెద్ద ఎత్తున అగర్తాల నుండి నీటిని నిర్మించిన అండర్ గ్రౌండ్ డక్ట్ నిర్మాణం ద్వారా నీటిని 12 మోరీల లోకి చేరేలా చరిత్రలో ఎన్నడూ లేని విదంగా అండర్ గ్రౌండ్ డక్ట్( భూగర్బ వరద నీటి కాలువ) నిర్మాణాన్ని నిర్మించాం. ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంచ అయిన అండర్ బ్రిడ్జ్ విస్తరణ కొత్త వెంట్ నిర్మించి ఈ ప్రాంత ప్రజలకు కానుకగా ఇచ్చాం.మేయర్ గా ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్టగా నాడే ఈ ప్రాంత అభివృద్దిపై సమీక్షలు నిర్వహించి ఏం చేస్తే ఈ నియోజకవర్గం అభివృద్ది చెందుతుందో ప్రణాళికలు రూపొందించి 191 కోట్లతో నియోజకవర్గంలోని  16  ప్రధాన రహాదారులను అభివృద్ది చేస్తున్నాం.భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రద్దీ ఉండే నేపద్యంలో రోడ్లను ఎలాంటి నష్టం వాటిల్లకుండా ప్రణాళికలు రూపొందించి సర్వాంగ సుందరంగా రోడ్లను అభివృద్ది చేస్తున్నాం.పనులు మీ కళ్ళముందు ఉన్నాయి.పేదవారి సొంతింటి కలను నిజం చేసేలా దూపకుంటలో 2000 డబుల్ బెడ్ రూం ఇండ్లను,జర్నలిస్టుల కోసం మరియు ప్రజల కోసం దేశాయిపేటలో200 ఇండ్లను నిర్మిస్తున్నాం.దాదాపు అవి పూర్తి దశలో ఉన్నాయి.పేదలు ఆత్మగౌరవంతో బ్రతకాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సంకల్పం..

ఆ సంకల్పం మరికొద్ది రోజుల్లో నిజంకానుంది.GO నంబర్ 58 ద్వారా గుడిసెవాసులకు పట్టాలు అందించేందుకు అసెంబ్లీ సాక్షిగా పేదల గొంతుకను వినిపించాను..పేదలకు పట్టాలందించేందుకు కృషిచేస్తున్నాను.సుమారు 5 వేల గుడిసె వాసుల సొంత స్ఢల కల నెల నెరవేరనుంది.ఇంటిగ్రేటెడ్ ప్రూట్స్&వెజిటేబుల్ మార్కెట్ ను అన్ని హంగులతో నిర్మించి అందజేసాం. నేతన్నలకు చేయూతనిస్తూ వరంగల్ నేతన్నలు తయారు చేసిన దుస్తులను ప్రభుత్వమే కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టి వారికి బాసటగా నిలిచాం. నన్ను గెలిపించిన ప్రజలకు కష్టకాలంలో అండగా నిలవాలనే ఉద్దేశ్యంతో రాజకీయాలకతీతంగా పార్టీల కతీతంగా 25 వేల పేద కుటుంబాలకు లాక్ డౌన్ సమయంలో నిత్యావసరాలు అందజేసి అండగా నిలిచాం.సుమారు 3వేల పైచిలుకు కోట్లతో సూపర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి,  నియోజకవర్చంలోని అన్ని రోడ్లు,వివిద రూపాల్లో అభివృద్ది పనులు చేసుకుంటున్నాం భవిష్యత్ లో మరింత అభివృద్ది చేసుకుంటాం..

రాజకీయాలు ఎన్నికలప్పుడే ప్రజలు బాగుండటమే మా ఎజెండా ఓట్లు సీట్ల కోసం రాజకీయాలు చేయట్లేదు.ప్రజా సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చాము  పేద భిడ్డనైన నాకు నమ్మి అవకాశం ఇచ్చి అసెంబ్లీ కి వెల్లే అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్,మంత్రి కేటీఆర్  రుణపడి ఉంటాను.నన్ను ఆశీర్వదించిన ప్రజలకు మరింత సేవ చేసేందుకు వెనకడుగేయను.ప్రజల కోసం వారి ప్రయోజనాల కోసం ఎంతవరకైనా వెల్తాను..మా ఏకైక ఎజెండా పేదరిక నిర్మూళన పేదలు ఆత్మగౌరవంతో బ్రతకడం..పేదరికం నుండి వచ్చిన పేదల ఆత్మగౌరవ ప్రతీకగా వారి కలలు నిజం చేయడం కోసం పనిచేస్తూనే ఉంటాను.

భవిష్యత్ లో వరంగల్ తూర్పును మరింత అభివృద్ది చేస్తాను.పార్టీ పిలుపునిచ్చిన ఏ ఎన్నికకైనా వరంగల్ తూర్పు నియోజకవర్గం విజయాన్నందించింది..9 ఎన్నికల్లో పార్టీ ఇచ్చిన ప్రతీ ఎన్నికను విజయవంతం చేసాం..పార్టీ నిర్వహించి మాకు భాద్యతలు అప్పజెప్పిన పనులను విజయవంతంగా నిర్వర్తించాం.. ఈ కార్యక్రమాల్లో తూర్పు నియోజకవర్గ నాయకులు,కార్యకర్తలు శక్తివంచన లేకుండా గొప్పగా పనిచేసారు..వారికి అభినందనలు కృతజ్ఞతలు.గతంలో ఏ నాయకులు చేయని పనులను చేస్తున్నాం.ఇక భవిష్యత్ అంతా తూర్పుదే..ఇంత గొప్ప అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి,మంత్రి కేటీఆర్ గారికి కృతజ్ఞాభివందనాలు..ప్రజలకు కృతజ్ఞతలు..కార్యకర్తలను కాపాడుకుంటాం,గౌరవించుకుంటాం..ప్రతీ ఒక్కరికి గౌరవాన్ని కల్పిస్తాం.తూర్పు అభివృద్ది లో మరింత ముందుకు తీసుకెలతాం..

ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్, కార్పోరేటర్లు,ముఖ్య నాయకులు,గులాబీ శ్రేణులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

also read :-భద్రాచలం టిఆర్ఎస్ నాయకుడు కారు ప్రమాదం….