Telugu News

ఈటెల విచారణకు హాజరుకాండీ

ఈటెలను పిలిచిన  వరంగల్ పోలీసుల 

0

ఈటెల విచారణకు హాజరుకాండీ

== ఈటెలను పిలిచిన  వరంగల్ పోలీసుల 

== నిన్న బండి ..నేడు ఈటెల రాజేందర్‌

== బిజెపి నేతలను టార్గెట్‌ చేసిన పోలీసులు

== నేడు వరంగల్‌ సిపి ముందు హాజరు కావాలని నోటీసులు

(వరంగల్ -విజయంన్యూస్)

నిన్న బండి సంజయ్.. నేడు ఈటెల రాజేందర్.. బీజేపీ నేతల పై పోలీసులు నజర్ పెట్టారు.. టెన్త్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కూపీ లాగిన పోలీసులు ఆ లీకేజీ వెనక బీజేపీ ఆగ్రనేతల హస్తం ఉందని భావించి అరెస్టలకు రంగం సిద్దం చేశారు.. ఇప్పటికే బీజేపీ చీఫ్ బండి సంజయ్ ను అరెస్ట్ చేసి జైలుకు పంపించిన వరంగల్ పోలీసులు, ఈ రోజు మాజీ మంత్రి ఈటెల రాజేందర్ పై ద్రుష్టి సారించారు.. ఆయన్ను విచారణకు హాజరు కావాలని వరంగల్ పోలీసులు నోటీసులు జారీ చేశారు.

ఇది కూడా చదవండి: బండి సంజయ్ అరెస్ట్ మాత్రమే..? జైలుకు పంపలేదు..?

తెలంగాణలో టెన్త్‌ ఎక్జామ్‌ పేపర్‌ లీక్‌ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. టెన్త్‌ క్లాస్‌ పేపర్‌ లీక్‌ కేసు లో నోటీసుల పరంపర కొనసాగుతోంది. బండిపై కేసు పెట్టి జైల్లో తోసిన ప్రభుత్వం ఇప్పుడు ఈటెల రాజేందర్‌ను టార్గెట్‌ చేసింది. నిన్న బండి సంజయ్‌ అరెస్ట్‌ తర్వాత.. మరో ఎపిసోడ్‌ తెరపైకి వచ్చింది. టెన్త్‌ పేపర్‌ లీకేజీ కేసులో పోలీసుల దూకుడు కొనసాగుతోంది. కమలాపూర్‌లో పేపర్‌ లీక్‌పై కూడా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటనలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ స్టేట్‌మెంట్‌ ను వరంగల్‌ పోలీసులు రికార్డు చేయనున్నారు. ఎమ్మెల్యే ఈటలకు ప్రశాంత్‌ పేపర్‌ పంపడంతో ఈ విషయంలో పోలీసులు మరింత ఫోకస్‌ పెంచారు. పేపర్‌ లీక్‌కు హుజూరాబాద్‌ నియోజకవర్గాన్నే ఎందుకు ఎంచుకున్నారు అసలేం జరిగింది.. దీని వెనుక ఎవరున్నారు..? కోణాల్లో పోలీసులు ఆరా తీయనున్నారు. ఈ మేరకు వరంగల్‌ పోలీసులు ఈటల రాజేందర్‌, పీఏకు నోటీసులు ఇవ్వనున్నారు. ఇటు బండి బెయిల్‌ పిటిషన్‌.. అటు పోలీసుల కస్టడీ పిటిషన్‌లపై న్యాయస్థానాలిచ్చే ఆదేశాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బండి సంజయ్‌ రిమాండ్‌ని కొట్టివేయాలంటూ హైకోర్ట్‌లో బీజేపీ లీగల్‌ సెల్‌ లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ వేయగా.. మరోవైపు సంజయ్‌ని కస్టడీ కోరుతూ వరంగల్‌ పోలీసుల పిటిషన్‌ వేశారు.

ఇది కూడా చదవండి: ముంబైలో తొలి కరోనా మరణం

బండి సంజయ్‌ మొబైల్‌ ఫోన్‌ ఇవ్వలేదని.. ఫోన్‌ డేటాతో పాటు లీకేజ్‌ కేసులో లోతుగా విచారించాలని.. కస్టడీ పిటిషన్‌లో వేర్వేరు అంశాల్ని పోలీసులు ప్రస్తావించారు. బండి సంజయ్‌, ప్రశాంత్‌ను వారంపాటు పోలీసులు కస్టడీ కోరనున్నారు. ఈ క్రమంలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు పోలీసుల నోటీసులు ఇచ్చారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని ఎమ్మెల్యే ఈటలకు ఇచ్చిన నోటీసుల్లో పోలీసులు తెలిపారు. వరంగల్‌ డీసీపీ ఆఫీస్‌లో హాజరుకావాలని పోలీసులు పేర్కొన్నారు. పోలీసుల నోటీసుపై న్యాయసలహా తీసుకునే యోచనలో ఈటల ఉన్నారు. ఏ2 ప్రశాంత్‌ ఎమ్మెల్యే ఈటలకు ఉదయం 10.41 గంటలకు పేపర్‌ పంపాడని సీపీ రంగనాథ్‌ స్పష్టం చేశారు. ఉదయం 9.30 గంటలకే ప్రశ్నాపత్రం లీకైనట్లు అసత్య ప్రచారం చేశారని వరంగల్‌ సీపీ రంగనాథ్‌ తెలిపారు. మరోవైపు.. టెన్త్‌ పేపర్‌ లీక్‌ వ్యవహారంపై వరంగల్‌ సీపీ రంగనాథ్‌ పూర్తి వివరాలను వెల్లడిరచారు. టెన్త్‌ పేపర్‌ లీక్‌ కాలేదని, కాపీయింగ్‌ జరిగిందని వరంగల్‌ సీపీ రంగనాథ్‌ స్పష్టం చేశారు. తన స్నేహితులకు ఇవ్వాలని పేపర్‌ను బాలుడు ఫొటో తీసుకున్నాడని, కిటికీ పక్కనే పరీక్ష రాస్తున్న విద్యార్థి నుంచి క్వశ్చన్‌ పేపర్‌ను బాలుడు తీసుకున్నాడని, తీసుకున్న ప్రశ్నాపత్రం ఫొటోను శివగణెళిశ్‌కు పంపాడని రంగనాథ్‌ తెలిపారు. శివగణెళిశ్‌ ఆ ఫొటోను టెన్త్‌ స్టూడెంట్స్‌ గ్రూప్‌లో పెట్టాడని వివరించారు. వరంగల్‌లో టెన్త్‌ హిందీ పేపర్‌ లీకైనట్లు ప్రశాంత్‌ అనే వ్యక్తి సోషల్‌ విూడియాలో పెట్టాడని, కాపీయింగ్‌లో ఓ చానల్‌ మాజీ ఉద్యోగి పాత్ర ఉందని రంగనాథ్‌ వెల్లడిరచారు. ప్రశాంత్‌ హైదరాబాద్‌లోని విూడియా ఉద్యోగికి ప్రశ్నాపత్రం పంపాడని, ఉదయం 9.30 గంటలకు ప్రశ్నాపత్రం లీకైనట్లు అసత్య ప్రచారం చేశారని, ప్రశ్నాపత్రం కాపీయింగ్‌ ఘటనపై సెక్షన్‌ 5 కింద కేసు నమోదైందని సీపీ చెప్పారు.

ఇది కూడా చదవండి: త్వరలో ప్రధాని నరేంద్రమోడీ తెలంగాణలో పర్యటన