Telugu News

వరంగల్‌లో రెండు రోజుల పాటు ఘనంగా  రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ0

*మహోత్సవ0 ను ప్రారంభించిన తెలంగాణ గవర్నర్ శ్రీమతి తమిళిసై సౌందరరాజన్ 

0

వరంగల్‌లో రెండు రోజుల పాటు ఘనంగా  రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ0

 

****మహోత్సవ0 ను ప్రారంభించిన తెలంగాణ గవర్నర్ శ్రీమతి తమిళిసై సౌందరరాజన్ 

 

****రెండవ రోజు కార్యక్రమానికి హాజరవుతున్న కేంద్ర పర్యాటక, సంస్కృతి

 

***భారతదేశ ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖా మంత్రి, శ్రీ జి. కిషన్ రెడ్డి..

(వరంగల్ విజయం న్యూస్):-

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లోభాగంగా నేషనల్ కల్చరల్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా, రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్ (ఆర్ఎస్ఎమ్) 2022 రెండవ దశ ఈరోజు వరంగల్‌లో ప్రారంభమైంది. 2022 మార్చి 29 మరియు 30 తేదీల్లో వరంగల్‌లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్‌లో అట్టహాసంగా జరగనున్న రెండు రోజుల మెగా సాంస్కృతిక మహోత్సవాన్ని తెలంగాణ గవర్నర్, శ్రీమతి. తమిళిసై సౌందరరాజన్ ప్రారంభించారు.

also read;-అక్రమంగా నిలువ ఉంచిన రేషన్ బియ్యం పట్టివేత

కేంద్ర సాంస్కృతిక, పర్యాటక మరియు సహాయ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి 2022 మార్చి 30న నిర్వహిస్తున్నకార్యక్రమాల్లో పాల్గొంటారు. అంతకుముందు, రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్ 2022 ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరంలో 26 మార్చి 2022న ప్రారంభంకాగా, రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్ లో మూడవది 2022 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు 3 రోజుల పాటు హైదరాబాద్‌లో జరగనున్నది.

also read;-మల్టీస్టార్‌ అంటే వెంకటేష్‌
రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్ 2022లో స్థానిక కళాకారులచే వైవిధ్యభరితమైన కళా ప్రదర్శనలు మరియు జానపద నృత్యాల నృత్యరూపాలతో వేదికపై మరియు ప్రేక్షకుల నడుమ రెండు రోజుల పాటు వేడుకలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. సాయంత్రం 5.30 నుండి 10.30 గంటల మధ్య ముఖ్యమైన సాంస్కృతిక ప్రదర్శనలు జరిగాయి. మొదటి రోజు హైదరాబాద్ బ్రదర్స్ వారిచే శాస్త్రీయ కర్ణాటక సంగీత గాత్ర ప్రదర్శన మరియు పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ దర్శనం మొగులయ్య, నేపథ్య గాయని కుమారి మంగ్లీ మరియు ఇతరులచే సంగీత ప్రదర్శనలు జరిగాయి.

also read;-పొలిటికల్ అట్రాక్షన్ పొంగులేటి

మహోత్సవ్‌లో రెండవ రోజైన మార్చి 30న ప్రముఖ సంగీత దర్శకుడు మరియు గాయకుడు శ్రీ వందేమాతరం శ్రీనివాస్ మరియు ఇతర ప్రముఖ నేపథ్య గాయకులచే శ్రావ్యమైన సంగీత ప్రదర్శనలు ఉంటాయి. అదే రోజు పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ కె పద్మజా రెడ్డిచే శాస్త్రీయ నృత్య ప్రదర్శన కూడా ఉంటుంది.జానపద కళాకారుల బృందాలను, పద్మ మరియు సంగీత నాటక అకాడమీ గ్రహీతలతో సహా దేశంలోని అత్యుత్తమ సాంస్కృతిక ప్రతిభను మహోత్సవ్ ఆకర్షిస్తోంది. రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్ నిర్వహించబడే రాష్ట్రంలోని ప్రాంతీయ అభిరుచులను ప్రతిబింబించేలా కళాకారులను ఎంపికలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.

also read;-సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర
రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్ (ఆర్ఎస్ఎమ్), 2015లో భారత ప్రభుత్వం యొక్క సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ద్వారా రూపొందించబడింది మరియు ఎంతో అద్భుతమైన మన దేశం యొక్క సంప్రదాయం, సంస్కృతి, వారసత్వం మరియు వైవిధ్యం యొక్క స్ఫూర్తితో ఉత్సవాలను జరుపుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మహోత్సవ్ తన విస్తృత లక్ష్యంతోనే కాకుండా, భారతీయ ఆత్మ యొక్క వారసత్వాన్ని సంరక్షించడం, ప్రోత్సహించడం మరియు ప్రాచుర్యం కలిగించడం మరియు నూతన తరాన్ని మన సంస్కృతితో మళ్లీ అనుసంధానం చేయడం మరియు భిన్నత్వంలో ఏకత్వం యొక్క మన ప్రభలమైన శక్తిని దేశానికి మరియు ప్రపంచానికి ప్రదర్శించడం వంటివి ఉన్నాయి. న్యూఢిల్లీలోని ఐజి నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ మైదానం లో 2015 నవంబర్ లో మొదటి రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్ నిర్వహించబడింది.