పంది దాడికి గురైన బడే బతుకయ్య..
== తీవ్రగాయాలు.. ఆసుపత్రికి తరలింపు
( తాడ్వాయి మండలం,విజయం న్యూస్):-
బతుకుదేరువు కోసం అడవికి పోయిన ఓ వ్యక్తిని అడవిపంది ఓ ఆటాడుకుంది.. తునికాకు కోసేందుకు అడవికి వెళ్లిన బతుకయ్యపై దాడి చేసింది.. దీంతో తీవ్రగా గాయపడగా ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాల్లోకి వెళ్లగా ములుగు జిల్లా, తాడ్వాయి మండలం, కాల్వాపల్లి గ్రామం, లో బడే బతుకయ్య తునికి ఆకు కోయడానికి అడవికి వెళ్లగా అడవి పంది దాడి చేసింది దీనితో బతుకయ్య వెంటనే కేకలు వెయ్యగా తోటి కూలీలు రావడం తో బతుకయ్యను పంది గాయపరిచి అక్కడ నుండి పారిపోయింది.దీనితో కాల్వపళ్లి గ్రామస్థులు తూనికి ఆకు సేకరణకు అడవికి వెళ్ళడానికి బాయోందలనకు గురవుతున్నారు. ఫారెస్ట్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు హెచ్చరించారు దాడికి పాల్ప డిన బతుకయ్యకు ఫారెస్ట్ శాఖ అధికారులు ఎక్స్ గ్రేషియ చెల్లించాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి :- రాజ్యసభ సభ్యుడిగా వద్దిరాజు రవిచంద్ర